Followers

ఇంటర్, పది పరీక్షల్లో ఆల్ పాస్ పై ముఖ్య మంత్రి మంచి నిర్ణయం తీసుకోవాలి

 ఇంటర్, పది పరీక్షల్లో ఆల్ పాస్ పై ముఖ్య మంత్రి  మంచి నిర్ణయం తీసుకోవాలి

విజయనగరం, పెన్ పవర్

  దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు,ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో నిర్వహించనున్న ఇంటర్ ,పదవతరగతి పరీక్షలు రద్దు చేయడం నూటికి నూరు శాతం శ్రేయస్కరమని విద్యార్థులు,ఉపాధ్యాయులు తమ ఫోరం ఎదుట కన్నీటి పర్యంతమవుతున్నారని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం(సీఆర్పీఎఫ్) జిల్లా కన్వీనర్  సత్తి అచ్చిరెడ్డి అన్నారు,ఫోరం ఆధ్వర్యలో సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పదో తరగతి విద్యార్థుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు,దీనిలో భాగంగా విజయనగరంలోని బాబామెట్ట బాలిక ఉన్నత పాఠశాలను అలాగే రింగు రోడ్డు ప్రాంతంలో ఉన్న మరికొన్ని ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడారు,అధిక శాతం మంది విద్యార్థులు ఆల్ పాస్ విధానంలో ఉత్తీర్ణత కల్పించి తమ ఆరోగ్య జీవితాలకు పూర్తి భద్రత కల్పించేలా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున పూర్తి మద్దతును అందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్టు తెలిపారు.

  అనంతరం ఫోరం జిల్లా  కన్వీనర్ సత్తి అచ్చిరెడ్డి మాట్లాడుతూ గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లో కోవిడ్ వైరస్ వ్యాప్తి 11 శాతం పాజిటివ్ గా నమోదైందని అన్నారు,అదే వ్యాధి ఈ ఏడాది 20 శాతం నుండి 40 శాతం వరకు పిల్లల్లో వ్యాప్తి చెందిందని డబ్ల్యు.హెచ్.ఒ.అంచనాలు, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు గణాంకాలతో చెబుతున్నారని గుర్తు చేశారు,ఈ పరిస్థితుల్లో గనుక పరీక్షలు నిర్వహిస్తే చాలా మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు అధిక శాతం కోవిడ్ వ్యాధి వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయన్నారు వీటన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి,విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ ల దృష్టికి సత్వరమే తీసుకు వెళుతున్నామని అన్నారు,పిల్లల పక్షపాతియైన ముఖ్యమంత్రి,విద్యా శాఖ మంత్రులు విద్యార్థులందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వెలువరిస్తారన్న ఆశాభావంతో ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం  కార్యదర్శి చంద్రిక, గౌరి శంకర్, స్వామి,వేణు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...