Followers

పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి

 పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి

పెన్ పవర్, రావులపాలెం

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే కరోన వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని ప్రభుత్వం పదవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసి ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ సభ్యులు డిమాండ్ చేసారు. ఎస్ఎఫ్ఐ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు కె.దుర్గాప్రసాద్, కేతా ప్రేమ్ కుమార్ ల ఆధ్వర్యంలో శనివారం శనివారం పరీక్షల రద్దు కోరుతూ రావులపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసిల్దార్  యూసఫ్ జిలానికి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ   రాష్ట్రంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తుందని, ముఖ్యంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు గతం కన్నా ఎక్కువ మంది వ్యాపిస్తుందన్నారు.

 రాష్ట్రంలో పదో తరగతి ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారని, ఈ నిర్ణయం సరియైనది కాదని అన్నారు. ఇప్పటికే కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసిందని, దాదాపు తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు పదవ తరగతి పరీక్షలు రద్దు చేసాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో పరీక్షలు జరుగుతాయో లేదో అనే సందిగ్ధంలో విద్యార్థులు ఉన్నారని, రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉందని అన్నారు.  వీరికి గనక పరీక్షలు నిర్వహిస్తే కరోన వ్యాధి వారికి, వారి కుటుంబాలకు గ్రామాల్లో సైతం వ్యాపించే ప్రమాదం పొంచి ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పరిస్థితుల్లో పదవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసి, ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు వాయిదా వేయాలని  డిమాండ్ చేసారు.  అధికారులకు నాయకులకు కరోన వస్తే పక్క రాష్ట్రాలకు పరుగులు తీసి వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో విద్యార్ధులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్షిజన్ లు లేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని పరీక్షలు నిర్వహిస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కావున పరీక్షలు వాయిదా వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్. సత్యనారాయణ, ఎస్. సందీప్ కుమార్, ప్రసన్న కుమార్, విశ్వతేజ, శ్రీనివాసు, విద్యార్ధులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...