Followers

పరీక్షలు వాయిదా వేయండి...

 పరీక్షలు వాయిదా వేయండి... 


విజయనగరం, పెన్ పవర్

కోవిడ్ కారణంగా 30 మంది ఉండే కేబినెట్ మీటింగ్‌ నే వాయిదా వేసిన వారు 30 లక్షల మంది విద్యార్థులు జీవితాలకు రక్షణ ఎలా కల్పిస్తారు?

ఇంటి నుంచి సెక్ర‌టేరియ‌ట్‌కి అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌, ఆరోగ్య‌ర‌క్ష‌ణ ఏర్పాట్ల మ‌ధ్య వెళ్లి 30 మంది మంత్రుల‌తో దూరంగా ఉండి పాల్గొనే కేబినెట్ మీటింగ్ వ‌ల్లే క‌రోనా సోకుతుంద‌ని జగన్ భ‌య‌ప‌డి వాయిదా వేయించారని , అలాంటిది 15 ల‌క్ష‌ల మంది విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ప‌రీక్ష‌ల నిర్వాహ‌కులు, ఇత‌ర‌త్రా అంతా క‌లిసి 50 ల‌క్ష‌ల‌మందికి పైగా ప‌రీక్ష‌ల కోసం రోజూ రోడ్ల‌మీద‌కు రావాల్సి వుంటుందని, వారికి క‌రోనా సోక‌దా అని మాజీ శాసనసభ్యులు డా.కొండపల్లి అప్పలనాయుడు గారు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తన పంతం నెగ్గించుకోవడానికి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులతో కలుపుకుని సుమారు 50 లక్షల మందికి పైగా కరోనా బారినపడే అవకాశం ఉందని, కాబట్టి పరీక్ష‌లు వాయిదా వేయాలని డిమాండ్ చేసారు. స్వల్పకాలిక లక్షణాలు ఉన్న విద్యార్థులను ఐసోలేషన్  లో పెట్టి పరీక్షలు రాయిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం అనాలోచిత చర్యగా కనిపిస్తుందని, వైరస్ సోకిన వారు ఐసోలేషన్ వరకు ఎలా వస్తారని,  వ్యాధి సోకిన వారిని ఇంకెవరైనా పరీక్ష కేంద్రానికి తీసుకుని రావాలని , వారు కూడా కరోనా భారిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక కళ్ళముందే అయినవారిని పోగొట్టుకుంటున్నారని, సకాలంలో బెడ్లు దొరక్క రోడ్ల ప్రక్కన, ఆస్పత్రి ఆవరణలో ప్రాణాలు పోతున్న ఘటనలు చూస్తుంటే బాధాకరమని  అన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...