Followers

ఉచితంగా 20 టన్నుల బ్లీచింగ్ పంపిణీ

ఉచితంగా 20 టన్నుల బ్లీచింగ్ పంపిణీ     

పెన్ పవర్, కందుకూరు

 కందుకూరు నియోజకవర్గంలో కరోనా రెండో దశలో విజృంభిస్తున్న తరుణంలో కందుకూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు, మున్సిపాలిటీకి బ్లీచింగ్, సున్నం పంపిణీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్  రెడ్డి పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ సాటి మనుషులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకారం అందించే భావన తపన, ప్రతి ఒక్క మనిషి లో ఉండాలి అని అన్నారు. కందుకూరు పట్టణం లో 14వ వార్డు కు చెందిన మాధవ పేదవాడు అయినప్పటికీ మంచి మనసుతో, సేవా దృక్పథంతో 50 వేల రూపాయలతో 21 టన్నుల సున్నాన్ని కందుకూరు మున్సిపాలిటీ అందజేశారు. ఈ సందర్భంగా మాధవ కి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని కందుకూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం  మండలాల వైయస్సార్సీపి జడ్పిటిసి అభ్యర్థుల అందరూ కలిసి 20 టన్నుల బ్లీచింగ్ ను అందజేశారని అన్నారు. ఇప్పటికే 20 టన్నుల బ్లీచింగ్ ను,  సున్నాన్ని ఉచితంగా అందజేశామని అన్నారు. ఇక నుంచి వచ్చే బ్లీచింగ్ పంచాయితీలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అని అన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు  3500 జతల గ్లౌజులు, 150 లీటర్ల శానిటైజర్ ను, ఐదువేల మాస్కులను ప్రభుత్వం ఇచ్చేవి కాకుండా అదనంగా  అందిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కందుకూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్నీ ప్రైమరీ హెల్త్ సెంటర్ లకు మాస్కులు, మెడికల్ కిట్లు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ఆఫీస్ కి వచ్చి ఉన్నాయని వాటిని రేపు అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ లకు  అందజేస్తామని అన్నారు.


 కరోనా వచ్చిన పేషెంట్లు ఎవరు దయచేసి బయటకు రావద్దుని ప్రభుత్వ డాక్టర్లు  ఇచ్చిన సూచనలు సలహాల మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ ప్రభుత్వం వారిచ్చిన మందులు వాడుకుంటూ ఉండాలని అలా కాకుండా వారు బయటకు వచ్చి వారి ద్వారా జబ్బును మరింత మందికి వ్యాప్తి చేసి సమాజానికి నష్టపరిచే కార్యక్రమం చేయవద్దని వారిని కోరారు. కందుకూరు పట్టణం లో సుమారు 14 మంది, పల్లెటూర్లలో పదిమంది వరకు  మరణించారని, ఎటువంటి అవసరం లేకుండా పల్లెటూర్ల నుంచి కందుకూరు కి రావద్దని అన్నారు. పల్లెటూర్లో కూడా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా ని దరిచేరకుండా చూసుకోవాలి అని అన్నారు.ఇప్పటికే జరగాల్సిన నష్టం 30శాతం జరిగిపోయిందని ఇప్పటినుంచైనా 15 రోజుల వరకూ జాగ్రత్తగా ఉంటే కొంతవరకు కరోనా ని కట్టడి చేయవచ్చు అని అన్నారు. ఒంగోలు రిమ్స్ హాస్పటల్లో సామర్థ్యాన్ని రెట్టింపు చేసినా, అంబులెన్స్లోవేచి ఉండాల్సి వస్తుందని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ లో అయితే ఎంత డబ్బులు ఇచ్చినా బెడ్ దొరకట్లేదు అని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఇది గమనించి అనవసరంగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ కరోనా ను కట్టడి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, కందుకూరు, వలేటివారిపాలెం, లింగాసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు మండలాల ఎంపిడివో లు విజయ శేఖర్, రఫీక్ అహ్మద్, మాలకొండయ్య,. వెంకటేశ్వర్లు, రవి కుమార్ తదిరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...