Followers

మీ సేవలు చిరస్మరణీయం

 మీ సేవలు చిరస్మరణీయం

మునగపాక, పెన్ పవర్

మునగపాక పోలీసు స్టేషన్ లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన అదనపు ఎస్.ఐ.బి.గురునాథ్ ను జిల్లా ఎస్.పి, బి.కృష్ణారావు ఐ.పి.ఎస్., తమ కార్యాలయములో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో సన్మానించి, జ్ఞాపికను అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధతతో విధులు నిర్వర్తించినందుకు పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. 

విధుల్లో చేరిన నాటి కాలంలో అప్పటి స్థితిగతులను నిలదొక్కుకుంటూ కుటుంబానికి దూరంగా ఉంటూ విధులు నిర్వర్తించడం సాధారణ విషయం కాదన్నారు. పదవి విరమణ తరువాత  కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పదవీ విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబంలో సభ్యులేనని, ఎలాంటి సమస్య వచ్చినా తమను నేరుగా సంప్రదించ వచ్చునని  సూచించారు.ఈ కార్యక్రమంలో  ఏ.ఆర్ డి.ఎస్.పి  ఆర్.పి.ఎల్.శాంతి కుమార్,పదవీ విరమణ పొందిన ఎస్సై కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...