Followers

కౌన్సిల్లో సమస్యలపై ఏకరువు...!

 కౌన్సిల్లో సమస్యలపై ఏకరువు...!

సామర్లకోట, పెన్ పవర్ 

సామర్లకోట మున్సిపాలిటీలో శుక్రవారం జరిగిన కౌన్సి లమ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉభా జాన మోజెస్ తో సహా ఆధికార పక్ష కౌన్సిలర్లు పలువురు వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ఏకరువు పెట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కౌన్సిల్ సాధారణ సమావేశం సుమారు మూడు గంటల పాటు సదీర్ఘంగా సాగింది. మొత్తం జీరో అవర్‌గానే సమావేశం కొనసాగగా పట్టణంలోని సమస్యల పై సభ్యులు అధికారులను ప్రశ్నలతో నిలదీయగా కౌన్సిల్ హాలు హోరెత్తింది. సమావేశంలో తొలుత కౌన్సిలర్లు జీరో అవర్‌ను కోరగా చైర్ పర్శన్ దానికి అనుమతినిచ్చారన్నారు. దానితో వైస్ చైర్మన్ జాన మోజెస్ మాట్లాడుతూ పిఠాపురం రోడ్డులో ఏర్పాటు చేస్తున్న లే అవుట్ల యజమానులు ఇరిగేషన్ కు సంబందించిన కాలువలు మూసివేస్తూ లే అవుట్లు చేపడుతున్నట్టు చెబుతూ ఆ లే-అవుట్లకు అలాంటి అనుమతులున్నాయని అధికారులను ప్రశ్నించారు. దానికి కమీషనరు బీఆర్ ఎస్ శేషాద్రి వివరణిస్తూ లే-అవుట్లకు అనుమతులు గుడా ఆద్వర్యంలో జరుగుతున్నట్టు చెప్పారు. అంతా ఆన్ లైనులోనే జరుగుతున్నందున అది మన పరిదిలో లేనందున దాని పూర్తి వివరాలు తమ వద్ద లేవన్నారు. కాగా అయితే లే-అవుట్ల పైన వివరాలు సేకరించి పనులు నిలిపి వేయనున్నట్టు చెప్పారు. అయితే పట్టణంలో ఎన్ని ప్రభుత్వ స్థలాలున్నాయో వివరాలు తెలపాలని వైస్ చైర్మన్ కోరారు. దానికి డిఇ సిమెచ్ రామారావు వివరణిస్తూ వచ్చే సమావేశం నాటికి వివరాలు అందించనున్నట్టు చెప్పారు.  

కాగా సమావేశంలో కౌన్సిలరు నేతల హరిడబాబు మాట్లాడుతూ పట్టా ఇళ్ళకు పన్నులు విధించమని ప్రజలు కోరుతున్నా మున్సిపల్ అదికారులు పన్నులు వేయడం లేదని, దానికి ప్లాన్ అప్రోవల్ కావాలని అడుగుతున్నారని పట్టా గృహాలకు, హౌసింగు పధకంలో నిర్మించుకున్న గృహాలకు ప్లాన్ అప్రోవల్ ఎలా ఉంటాయని ఆయన అధికారులను ప్రశ్నించారు. దానిపై కమీషనరు మాట్లాడుతూ ప్కగా ఇళ్ళకు సంబందించి డాక్యుమెంట్లు ఉంటేనే పన్నులు విధిస్తామన్నారు. కాగా మున్సిపాలిటీలో ఏఏ విభాగాల్లో ఎంతమంది సిబ్బంది ఉన్నారో వివరాలు తెలపాలని వైస్ చైర్మన్ మోజెస్ కోరారు. దానికి కమీషనరు సిబ్బంది వివరాలను సమావేశంలో తెలిపారు. అలాగే కౌన్సిలరు పితాని కృష్ణ మాట్లాడుతూ వర్షం వస్తే తమ వార్డు మొత్తం మునిగిపోతున్నందున డ్రెయిన్ల ఆధునీకరణ, వంతెన నిర్మాణ పనులను చేపట్టాలని డిమాండ్ చేసారు. దానికి డిఇ రామారావు వివరణిస్తూ 14వ ఆర్థిక నిదులు విడుదల అయ్యాయని త్వరలోనే నూతన డ్రైన్ల నిర్మాణం, వంతెన నిర్మాణాలకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. కాగా సమావేశంలోని జీరో ఆవర్ లో కౌన్సిలర్లు యార్లగడ్డ జగదీష్, పాగా సురేష్, చల్లపల్లి శ్రీను, పాగా సురేష్, పాలిక కుసుమచంటిబాబు, పెండ్యాల వెంకటలక్ష్మి, చిట్టిమాని రాఘవ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ వారి వార్డులో ఉన్న సమస్యల పరిష్కారంపై అదికారులకు విన్నవించి వాటిని పరిష్కరించాలని కోరారు. సుమారు మూడు గంటల పాటు కొనసాగిన సమావేశం అనంతరం అజెండా అంశాలపై చర్చ ప్రారంభం కాగా వాటిలో 13 అంశాలను సభ్యులు ఆమోదించగా వారపు సంత రోడ్డు మార్గంలో ఆశీల వసూళ్ళ అంశాన్ని సమావేశం వాయిదా వేసింది. ఈ సమావేశంలో ఇంకా మున్సిపల్ ఎఇ రాజశేఖర్, శానిటరీ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్, అన్ని శాఖల అధికారులు, అందరు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...