Followers

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించాలి

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించాలి 

శ్రీకాకుళం, పెన్ పవర్

 కరోనా సెకండ్ వేవ్ కు జర్నలిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారని ఐజేయూ జాతీయ కార్యవర్గం ప్రత్యేక ఆహ్వానితులు నల్లి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు.మంగళ వారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో,ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ ,పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు తాజాగా ప్రకటించడాన్ని ఆయన గుర్తు చేశారు.ఒడిశా ప్రభుత్వం తొలి వేవ్ లోనే మరణించిన జర్నలిస్టు కుటుంబానికి 2.50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించిందని,రెండో వేవ్ మృతులకు రూ.10 లక్షలు ప్రకటించిందని తెలిపారు.తొలి వేవ్ లోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ఉప ముఖ్య మంత్రులకు ,మంత్రులకు విన్నవించినా ఫలితం లేకపోవడం విచారకరమన్నారు.తమ జాతీయ నాయకులు శ్రీనివాసరెడ్డి,దేవులపల్లి అమర్ స్వయంగా ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డితో మాటాడిన తరువాత ,చనిపోయిన వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చినా,అది ఇంతవరకు అమలు కాలేదని ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు.హెల్తు కార్డులు కూడా ,నూతన ప్రభుత్వం ఇంతవరకు మంజూరు చేయలేదన్నారు.రెండో వేవ్ లో జర్నలిస్టుల మరణాల సంఖ్య ఎక్కువగా వుందని ఆందోళన వ్యక్తం చేశారు.శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకూ ఆరుగురు  రెండో వేవ్ కు బలయినట్టు ధర్మారావు తెలిపారు.సోమవారం జరిగిన ,రాష్ట్ర యూనియన్ కార్యవర్గ సమావేశం ( జూమ్ ) ఇంతవరకూ చనిపోయిన వారి వివరాలతో ,రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇటీవల ఒకే రోజు ,ఇద్దరు ' సాక్షి ' కరోనాకు బలైన తరువాత ,రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులకు ప్రత్యేక బెడ్లను కేటాయిస్తూ,జిల్లాలకు సమాచార శాఖ అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్టు తెలిపారు.

శ్రీకాకుళం ' జెమ్స్ ' లో 15 బెడ్స్ 

శ్రీకాకుళం జిల్లా జర్నలిస్టుల కోసం జెమ్స్ లో 15 బెడ్స్ ను కేటాయిస్తూ కలెక్టరు నివాస్ ఆదేశాలు జారీ చేశారని ధర్మారావు వెల్లడించారు.కరోనా బాధితులైన జర్నలిస్టులు డీపీఆర్వో రమేష్ ను సంప్రదించాలని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టరు నివాస్ కు ధర్మారావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ క్లబ్ ను కోవిడ్ సెంటర్ గా వినియోగించండి. గత మూడేళ్ల నుంచి మూతపడిన గరిమెళ్ల ప్రెస్ క్లబ్ ను కోవిడ్ సెంటర్ గా వినియోగించుకునే విషయం ,కలెక్టరు పరిశీలించాలని ధర్మారావు కోరారు.విలువైన భవనాన్ని మూసేసి,టిడిపి ప్రభుత్వం అన్యాయం చేసిందని,కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించడం మరింత అన్యామన్నారు.కరోనా బారినపడిన జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ ను కోవిడ్ కేంద్రంగా మార్చాలని కోరారు.ఈ ప్రతిపాదన శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావుకు కూడా తెలిపామన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...