లాక్ డౌన్ ప్రకటిస్తే బాగుంటుంది కోప్పల రామ్ కుమార్
పూర్ణ మార్కెట్, పెన్ పవర్
కరోనా విలయతాండవం రోజు రోజుకీ విజరంభిస్తున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించే దిశగా ఆలోచిస్తే బాగుంటుందని దక్షిణ నియోజక వర్గం బి.జె.పి. కన్వీనర్ కొప్పల రామ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ కేసులు ఎక్కువ అవుతుండడం వలన లాక్ డౌన్ ప్రకటిస్తే కేసులను కొంత వరకు కంట్రోల్ చేయవచ్చన్నారు. దక్షిణ నియోజకవర్గంలో గల పూర్ణా మార్కెట్లోని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఊదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపార కలాపాలు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం ద్రుష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తెలియజేశారు.
No comments:
Post a Comment