Followers

వారోత్సవాలు కొనసాగింపా వాయిదా


మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కొనసాగింపా వాయిదా


 


చింతపల్లి  ,పెన్ పవర్


 

ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు అటవీ ప్రాంతంలో  సిపిఐ మావోయిస్టు అమరవీరుల సంస్సరణవారోత్సవాలు విజయవంతం  చేసుకోవడానికి మవోయిస్థులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నెల 28 నుంచి వచ్చే నెల3 వరకు మావోయిస్టులు నిర్వహించే సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీసులు  ఏ ఓ బి లో కుంబింగ్ ముమ్మరం చేరారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల19,  22న, మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి.ఈ ఎదురు కాల్పుల్లోమావోయిస్టు అగ్రనేతలకు తీవ్ర గాయాలయినట్లు పోలీసులు వర్గాలు భావిస్తున్నాయి.ఇటువంటి పరిస్థితుల్లో మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకోవాలా? లేక వాయిదా వేసుకోవాలా? అనే దానిపై మావోయిస్టులలో సందిక్తత నెలకొన్నంటుంది. అయితే ప్రతీ ఏడాది ఏవోబి అటవీ  ప్రాంతంలో ఉన్న అమరవీరుల సంస్కరణ స్థూపాలను సుందరంగా తీర్చిదిద్ది విప్లవ గేయాలతో, గ్రామ సభలు నిర్వహిస్తూ వారోత్సవాలు ఘనంగా జరుపుకునే వారు. వారోత్సవాలు మరో పది రోజులు వుందనగా గతంలో నిర్మించిన స్థూపాలకు రంగులు వేసేవారు.కానీ మరో 4 రోజులలో మావోయిస్టు సంస్మరణ వారోత్సవాలు ప్రారంభం కానున్నప్పటికి  ఎప్పుడో నిర్మించిన స్థూపాలకు నేటికీ రంగులు వేయలేక పోయారు.పోలీస్ నిర్బంధం,గాలింపు చర్యలు విస్తృతంగా వుండడం వలన మావోయిస్టు కార్యకలాపాలు సాగడం లేదు. గత కొన్నేళ్లుగా వారోత్సవాలు అడ్డుకొవడానికి పోలీస్  బలగాలు ఏవో బి అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతునే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఏవోబీ అటవీ ప్రాంతంతో పాటు ఏజెన్సీ గ్రామాలలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, స్తూపాలకు రంగులు వేసేందుకు అవకాశం లేకుండా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతూ,వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు మాత్రం ఏదో ఒక ప్రాంతంలో సంస్మరణ సభ నిర్వహించే తీరుతారని ప్రచారం జరుగుతోంది. ఏ ఓ బి,విశాఖ ఏజెన్సీ అంతటా పోలీసు యంత్రాంగం  ముందుగానే అప్రమత్తమై మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. ఇరు వర్గాల చర్యలతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని మన్య వాసులు భీతిల్లుతున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...