Followers

సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న  ప్రజలు


 


సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న  ప్రజలు


జి.మాడుగుల, పెన్ పవర్ 


 

జి.మాడుగుల మండలం బంధ వీధి గ్రామంలో ఉన్న వీధిలైట్లు పాడై పోవడంతో బంధ వీధి గ్రామ ప్రజలు  ఎవరైనా వచ్చి బాగు చేస్తారేమో అని సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు. విద్యుత్తు సిబ్బంది గాని, సచివాలయ సిబ్బంది గాని,  స్పందించక పోవడంతో,  ప్రజలే అందరూ ఒక్కటై ఆ గ్రామ పరిధిలో ఉన్న స్తంభాలకు వీధిలైట్లు ఏర్పాటు చేసుకున్నారు.

వీధిలైట్లు వెలగక రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలు


వీధిలైట్లు వెలగక రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలు


గూడెం కోత్తవీధి, పెన్ పవర్



మండలకేంద్రంలో వీధిలైట్లు సౌకర్యం మెరుగు పరచడానికి పంచాయితీ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని మండలవాసులు కొరుతున్నారు ప్రస్తుతం వున్న వీధిలైట్లులో నూటికి 80. శాతం పాడుఅయ్యిపోయయని దిని వలన మండలకేంద్ర వాసులు అంధకారంలో కాలక్షేపం చేయ్యవలసినపరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. వర్షాలు వలన విషసర్పలు పాములు రోడ్లు ఫైకి వస్తున్నాయి రాత్రి సమయంలో బయటకు రావాలి అంటే ప్రజలు భయం భాంత్రులకుగురికావలసివస్తుంది. ఇటువంటి సమాస్య గూడెం కోత్తవీధీ మండలకేంద్రంలో ఇలాగా వుంటే మిగిలిన గ్రామాలు పరిస్థితి ఏమిటి నీ పలువురు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా స్పందించి. పంచాయతీ శాఖ అధికారులకు మండలకేంద్ర వాసులు కొరుతున్నారు 


15రోజులుగా ఎమ్మార్వో ఆఫీస్ లో




15రోజులుగా ఎమ్మార్వో ఆఫీస్ లో సర్వర్లు పనిచేయడం లేదు


పూర్ణ మార్కెట్, పెన్ పవర్



విశాఖపట్నం, దక్షిణ నియోజకవర్గం, మహారాణి పేట,ఎమ్మార్వో ఆఫీస్ లో సర్వర్లు పని చేయక, చాలా సర్టిఫికెట్లు గత పదిహేను రోజులుగా పెండింగ్లో ఉన్నాయి. ప్రజలు రోజు ఎం.ఆర్.ఓ ఆఫీస్ కి వెళ్లి సర్టిఫికెట్లు  రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మార్వో ఆఫీస్ లో అధికారులెవరు సీట్లలో ఉండటం లేదు.  తాసిల్దార్ని అడిగితే ప్రోటోకాలింగ్ అని చెప్తున్నారు. దీని గురించి అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ లేకపోవడం వల్ల స్టాప్ కూడా ఇబ్బంది పడుతున్నారు.


 


చిన్న వెంకన్న దేవాలయం నిలుపుదల





చిన్న వెంకన్న దేవాలయం నిలుపుదల చేయడమైనది ఆలయ ఈవో తెలియజేశారు


 


 ద్వారకాతిరుమల,పెన్ పవర్


 

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం కోవిద్ 19 నిరోధించుట లో భాగంగా జిల్లా కలెక్టర్ సూచనల మేరకు పశ్చిమగోదావరి జిల్లాలో అనేక మండలాలలో లో ఏలూరు పరిధిలోగల ద్వారకాతిరుమల మండలం ద్వారకాతిరుమల గ్రామము నందు లాక్ డౌన్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారకా తిరుమల స్వామి వారి ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని 25 7 2020 నుండి 31 7 2020 వరకు నిలుపుదల చేయడమైనది ఆలయ ఈవో తెలియజేశారు స్వామివారి నిత్య కైంకర్య కార్యక్రమములు నివేదనలు యధావిధిగా ఏకాంతంగా ఆగమ అనుసారంగా కొనసాగుతాయని మరియు భక్తులు తమ యొక్క తీర్థయాత్రలు వాయిదా వేసుకుని స్వామివారికి చెల్లించవలసిన మ్రొక్కుబడులు సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత స్వామివారి మొక్కులను తీర్చుకో వలసినదిగా ఆలయ ఈవో ఆర్ ప్రభాకర్ రావు తెలియజేశారు.


 

 




మంత్రి చే సి.ఎం. రిలీఫ్ ఫండ్ పంపిణీ






మంత్రి చే సి.ఎం. రిలీఫ్ ఫండ్ పంపిణీ


 


అమలాపురం, పెన్ పవర్ 



అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన చెక్ లును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పంపిణీ చేశారు. శుక్రవారం అమలాపురం లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అల్లవరం మండలం అల్లవరం గ్రామానికి చెందిన అరిగెల మంగాదేవి కి 18 వేలు,ఇదే గ్రామానికి చెందిన దాసం రత్న శ్రీ కి 15 వేలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాగా ఆ మొత్తాలకు సంభందించిన చెక్ లును లబ్దిదారులకు మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మునిసిపల్ ప్రతిపక్ష నాయకులు చెల్లు బోయిన శ్రీనివాస్, దొంగా శ్రీను, వాసం శెట్టి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.


 

 




కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి


కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి


 


జగ్గంపేట,  పెన్ పవర్ 


 

 

కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని, కోవిడ్ వారియర్స్ గా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గండేపల్లి జర్నలిస్టులు  తహసిల్దార్ చిన్నారావు కు వినతి పత్రం అందజేశారు.

 విధినిర్వహణలో అనేక మంది జర్నలిస్టులు కోవిడ్ భారిన పడుతున్న నేపథ్యంలో వారిని కోవిడ్ వారియర్స్ గా గుర్తించాలని ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జిల్లాలోని నియోజకవర్గాల్లో ఆయా అధికారులకు వినతిపత్రాలు అందించాలని జిల్లా ఏపీయూడబ్ల్యూజే ఇచ్చిన పిలుపుమేరకు గండేపల్లి లో తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ చిన్నారావు మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెడతానన్నారు.  ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి వెలిది వెంకటరత్నం మాట్లాడుతూ కరోనా బారిన పడిన జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు పెను గాడి సూరిబాబు మాట్లాడుతూ కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందారని, వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. జిల్లా మెంబెర్ యూనియన్ అడపా శ్రీనివాస్ మాట్లాడుతూ విధినిర్వహణలో అనేక మంది జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారన్నారు. రాజమహేంద్రవరం రూరల్ టీవీ5 రిపోర్టర్ రాము కరోనా వచ్చి చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. కరోనా తో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం  ప్రకటించాలని  ఏపీయూడబ్ల్యూజే తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు కొత్త గళ్ళ శ్రీనివాస్, చింతపల్లి శివ, లంజ పల్లి శ్రీను పాల్గొన్నారు.

50లీటర్ల నాటు సారాయి  స్వాధీనం 





50లీటర్ల నాటు సారాయి  స్వాధీనం 


 


సారాయి రవాణా చేస్తున్న మోటారు బైక్ స్వాధీనం   


 


800 లీటర్ల  బెల్లపు ఊట ధ్వంసం 


ఒక వ్యక్తిఅరెస్ట్. మరో ఇద్దరి పై కేసులు నమోదు     


 


                   


జగ్గంపేట, పెన్ పవర్ 


 

  పెద్దాపురం  స్పెషల్  ఎన్ ఫోర్స్ మెంట్  బ్యూరో టీమ్ లు పెద్దాపురం  రంగం పేట మండలాల్లో దాడులు రూట్ వాచ్ లు  నిర్వహించగా, పెద్దాపురం మండలం  ఆనూరు గ్రామ పరిధిలో 30 లీటర్ల నాటు సారాయి ని మోటారు బైక్  పై తరలిస్తున్న చింతపల్లి సూరిబాబు అను  వ్యక్తిని పట్టుకుని అరెస్టు చే సారు. సారాయిని, మోటార్ బైక్ ను స్వాధీన పర చుకున్నరు. అలాగే   కొండపల్లి ,  రంగం పేట గ్రా మాల్లో  20 లీటర్ల  నాటు సారాయి  ,800 లీటర్ల  బెల్లపు ఊట కనుగొని  సంబంధిత ఇద్దరు వ్యక్తుల పై 2 కేసులు నమోదు చేయటం జరిగిందని  పెద్దాపురం ఎక్సైజ్  సి ఐ  . ఎం. రామకృష్ణ దాస్ తెలిపారు .        ‌‌‌ ఈ  దాడుల్లో  పెద్దాపురం ఎక్సైజ్    ఎస్ ఐ.జె. విజయకుమార్. తదితర సిబ్బంది పాల్గొన్నారు.


 

 




Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...