Followers

శానిటైజర్ లు మాస్కులు పంపిణీ చేస్తున్న పంచాయతీ


శానిటైజర్ లు మాస్కులు పంపిణీ చేస్తున్న పంచాయతీ


పోతులూరి,పెన్ పవర్



పోతులూరి గ్రామంలో వైసిపి గ్రామ నాయకులు పంచాయతీ సచివాలయ సిబ్బందికి ఆశ వర్కర్లకు వాలంటీర్స్ కు మా స్కూలు శానిటైజర్ లు పంపిణీ చేశారు గ్రామ వాలంటీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రామంలో కరోనా మహమ్మారి పై అవగాహన  కల్పిస్తున్న అందుకుగాను అలాగే విధినిర్వహణ సక్రమంగా చేస్తున్న ఏఎన్ఎం సచివాలయ సిబ్బందికి మాస్కులు శానిటైజర్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లో లో  సిపిఐ ఎంఎల్ నాయకులు ఏసుబాబు మాజీ ఎంపీటీసీ రేఖ  కృష్ణార్జున పాల్గొన్నారు


వెంకన్న ఆలయాన్ని హైపో క్లోరైడ్ ద్రావణంతో శుభ్రం

వెంకన్న ఆలయాన్ని హైపో క్లోరైడ్ ద్రావణంతో శుభ్రం


 


ఆత్రేయపురం,పెన్ పవర్ 


 


మండలం వాడపల్లిలో కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం లో ఈరోజు దేవాలయం అంతా హైపో క్లోరైడ్ ద్రావణంతో శానిటేషన్ నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి ప్రభావం చూపించడం వల్ల వచ్చే భక్తులకు ఆలయంలో ఏ ఇబ్బంది కలక్కుండా ఆలయం మొత్తం శుభ్రం చేయడం జరిగింది ఈ హైపో క్లోరైడ్ ద్రావణం ఏ .ఎం. ఎన్ ఎం.సుమతి గ్రామ సచివాలయం రక్షణ విభాగానికి సంబంధించి ఝాన్సీ  ఆశావర్కర్లు గ్రామ వాలంటరీ లు వీరందరూ  ఆలయ ప్రాంగణం అంత శుభ్రం చేయడంలో పాల్గొన్నారు


అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి





అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి


 


పెన్ పవర్ ద్వారకాతిరుమల


 

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం పంగిడి గూడెం గ్రామ శివారులో రహదారి డివైడర్ పై పొడుకుని ఒక వ్యక్తి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు భీమడోలు కు చెందిన సంపర సూర్యనారాయణ(50) హోటల్ నడుపుతూ జీవనం సాగించేవాడు మద్యానికి బానిసయ్యాడు ఈ నేపథ్యంలో ఈ నెల 23న ఇంటినుండి బయటికి వచ్చేశాడు తన మోటార్ సైకిల్ నీ పంగిడిగూడెం శివారు అభిరుచి దాబా సమీపంలో రోడ్డు పక్కన పెట్టి తాళం వేసి డివైడర్ పై కొడుకుని మృతిచెందాడు అనుమానాస్పద స్థితి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధు వెంకట రాజా తెలియజేశారు.


 

 




కోవిడ్ పై ఆందోళన వద్దు





కోవిడ్ పై ఆందోళన వద్దు


మంత్రి విశ్వరూప్


 


అమలాపురం పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్


 

దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. కరోనా వైరస్ తీవ్రం ఉన్నప్పటికీ ప్రజలెవరూ  భయాందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి అన్నారు. శుక్రవారం అమలాపురం ఆర్.డి. ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజంలో పది శాతం మంది కోవిడ్ బారిన పడ్డారని,దీని నియంత్రణకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించవలసిన అవసరం వుందని మంత్రి తెలిపారు. అమలాపురం డివిజన్ లో గత మార్చి నుండి ఇప్పటివరకు 22,521 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 1,495 పాజిటివ్ గా గుర్తించడం జరిగిందని, 21,026 కేసులు నెగిటివ్ రావడం జరిగిందని మంత్రి తెలియ చేశారు.పాజిటివ్ కేసుల్లో 956 మందిని ఐసోలేషన్ సెంటర్స్ కు తరలించగా 525 మందిని హోమ్ ఐసోలేషన్ లో వుంచడం జరిగిందని మంత్రి తెలిపారు. మిగిలిన యాక్టివ్  కేసులు కిమ్స్ లోను, బొమ్మూరు లోను చికిత్స తీసుకుంటున్నారని మంత్రి తెలియ చేశారు.1091 మందిని చికిత్స అనంతరం నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

డివిజన్ లో గత మార్చి నుండి ఇప్పటివరకు కోవిడ్ మరణాలు 14 సంభవించాయని మంత్రి తెలిపారు.అమలాపురం మునిసిపాలిటీ పరిధిలో 30 వార్డులు వుండగా అందులో 24 వార్డులు కంటైన్మెంట్ జోన్ లు గా గుర్తించడం జరిగిందని మంత్రి తెలియ చేశారు.

 

అమలాపురం లో విద్యుత్ దహన వాటిక(ఎలక్ట్రిక్ క్రీమేషన్ )ఏర్పాటు___మంత్రి

 

అమలాపురం లో విద్యుత్ దహన వాటిక (ఎలక్ట్రిక్ క్రీ మేషన్ )ను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు డివిజన్ లో 14 కోవిడ్ మరణాలు సంభవించాయని, రాబోయే రోజుల్లో మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉన్నందున దహన సంస్కారాలుకు ఇబ్బంది లేకుండా వుండేందుకు అమలాపురం మునిసిపాలిటీ లో విద్యుత్ దహన వాటిక (ఎలక్ట్రిక్ క్రీమేషను )ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలియచేశారు.

 

కోవిడ్ మరణాలపట్ల వివక్షత వద్దు______మంత్రి

 

కోవిడ్ కారణంగా మరణించిన వారి పట్ల ప్రజలెవరూ అమాననీయ కోణం లో చూడకూడదని,అలాగే వారిపట్ల వివక్షత చూపకూడదని మంత్రి హితవు పలికారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో  కోవిడ్ కారణంగా మరణించిన వారు ఒక్కొక్కరికి దహన సంస్కారాలు నిమిత్తం 15 వేలు మంజూరు చేశారని, అమలాపురం డివిజన్ లో కోవిడ్ కారణంగా మరణించిన 14 మందికి ఒక్కొక్కరికి 15 వేలు రూపాయలు చొప్పున రేపు సాయంత్రంలోగా  ఆర్.డి. ఓ ద్వారా అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అలాగే కోవిడ్ కారణంగా మరణించిన వారిని అనాధ శవాలుగా భావించకుండా వారికి ప్రోటోకాల్ ప్రకారం దహన సంస్కారాలు చేయాలని మంత్రి సూచించారు. పాత్రికేయుల సమావేశంలో అమలాపురం ఆర్.డి. ఓ ఎన్.ఎస్.వి.బి వసంత రాయుడు, డిఎస్పీ షేక్ మాసుం భాషా పాల్గొన్నారు.

 

కోవిడ్_19 పై అధికారుల తో మంత్రి సమీక్ష

 

అమలాపురం డివిజన్ లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వ్యాప్తిని నివారించేందుకు తీసుకోవలసిన చర్యల పై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సంభందిత శాఖల అధికారులు తో సమీక్షించారు. అమలాపురం ఆర్.డి. ఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఈ సమావేశం లో మంత్రి మాట్లాడుతూ మునిసిపాలిటీ పరిధిలో మెరుగైన పారిశుధ్యానికి చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమీషనర్ కె.వి.వి.ఆర్.రాజును మంత్రి ఆదేశించారు. అన్ని వార్డుల్లో ను సోడియం హైపో క్లోరైడ్ ను ఉదయం,సాయంత్రం కూడా స్ప్రే చేయాలని మంత్రి సూచించారు.అలాగే డివిజన్ లోని అన్ని మండలాలలోను మెరుగైన పారిశుధ్యం వుండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో అమలాపురం ఆర్.డి. ఓ ఎన్.ఎస్.వి.బి వసంత రాయుడు, డిఎస్పీ షేక్ మసూం భాషా, మునిసిపల్ కమీషనర్ కె.వి.వి.ఆర్.రాజు, అమలాపురం,అల్లవరం మండలాల తహసీల్దార్ లు మాధవరావు,అప్పారావు, అల్లవరం ఎం.పి.డి. ఓ సుగుణ శ్రీ కుమారి, ఏ.డి.ఎం.అండ్.హెచ్. ఓ డా. పుష్కర రావు, పంచాయిత్ రాజ్ డిప్యూటీ ఇ ఇ లు రాంబాబు,మురళీ కృష్ణ, కే.ఆర్.సి.తహసీల్దార్ లక్ష్మీపతి, అమలాపురం మునిసిపల్ ప్రతిపక్ష నాయకులు చెల్లు బోయిన శ్రీనివాస్, మట్ట పర్తి నాగేంద్ర, దంగేటి  రాంబాబు, మోటూరి సాయి తదితరులు పాల్గొన్నారు.


 

 




 కరోనా విజృంభణ


 కరోనా విజృంభణ


ప్రత్తిపాడు ,పెన్ పవర్



రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు శుక్రవారం అత్యధికంగా ప్రత్తిపాడు లో 12 ధర్మవరం 2 కేసులు నమోదయ్యాయి దీనితో అప్రమత్తమైన అధికారులు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని అలాగనే తగు జాగ్రత్తలు పాటించాలని ఎండిఓ పేర్కొన్నారు లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేసేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు అవసరమైతే తప్ప దూరప్రయాణాలు చేయరాదని విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు వైసిపి నాయకులు వీధుల్లో తిరిగి పారిశుద్ధ్య పనులు చేయించారు


మనం మన పరిశుభ్రత పై అవగాహన సదస్సు


మనం మన పరిశుభ్రత పై అవగాహన సదస్సు



ఆత్రేయపురం,పెన్ పవర్ 


ఆత్రేయపురంమండలం లో నిర్వహించిన మనం_మన పరిశభ్రత పక్షోత్సవాలలో భాగంగా బొబ్బర్లంక  పేరవరం గ్రామాలకు చెందిన గ్రామ సచివాలయ సిబ్బందికి  మొబైల్ టాస్క్ ఫోర్స్ టీం సభ్యులకు ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఒ నాతి బుజ్జి ఆద్వర్యంలో మండల అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. పదిహేను రోజుల పాటు గ్రామాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు.  టీం సభ్యులు గ్రామంలో తిరిగి ఇంటింటికీ అవగాహన కల్పిస్తూ, ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు ఉంటే గుర్తించి , వెంటనే రిపేర్ చేయించాలని, ఎక్కడైనా అపారిశుధ్యం ఉంటే వెంటనే పారిశుధ్య మెరుగుదలకు చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమం లో మండల విద్యాశాఖాధికారి వర ప్రసాద రావు, పంచాయతీ కార్యదర్శులు శివారెడ్డి, శివ రామ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


చిన్న వెంకన్న స్వామి వారి స్వర్ణమయ పథకము






చిన్న వెంకన్న స్వామి వారి స్వర్ణమయ పథకము


 


పెన్ పవర్ పశ్చిమ గోదావరి బ్యూరో


 

పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి వారి విమాన గోపురం స్వర్ణమయ పథకాన్ని నకు లక్ష రూపాయల విరాళం సమకూర్చినది చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి కి చెందిన పొట్టి మాణిక్య కృష్ణ ఆనంద్ ఈ విరాళాన్ని ఈ ఓ ఆర్ ప్రభాకర్ రావు నాకు శుక్రవారం అందజేశారు ఈ సందర్భంగా ఈవో అతను ప్రత్యేకముగా అభినందించి స్వామివారి స్వర్ణమయ పత్రాన్ని స్వామి ప్రసాదాన్ని అందజేశారు .


 

 




Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...