Followers

కరోనా కట్టడిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది

కరోనా కట్టడిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది


సామర్లకోట, పెన్ పవర్


కరోనా ఉధృతి దేశంలో చూస్తే ఆంధ్ర ప్రదేశ్ లోను,రాష్ట్రంలో చూస్తే తూర్పుగోదావరి జిల్లాలోను అధికమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం దీనిని కట్టడి చేసే విషయంలో ఎంతో నిర్లక్ష్యన్ని కనపరుస్తుంది అని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అడబాల కుమారస్వామి తదితరులు అన్నారు.స్థానిక తెదేపా కార్యలయంలో పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వ తీరును విమర్శించారు. వారు మాట్లాడుతూ పాజిటివ్ కేసులో  ఎంతో ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్న పరీక్షలు చేయించుకునే వారికి సరిపడా కిట్లు అందించకుండా,ప్రజలకు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టకుండా,కారంటెయిన్లో ఉన్న రోగులకు పోషకాహారం,మందులు పూర్తిస్థాయిలో అందించకుండా చాలా తేలికగా తీసుకుంటుంది అన్నారు.ఒక ప్రక్క ప్రాణనష్టం విపరీతమవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.క్వారంటైన్ లో ఉన్న రోగులకోసం రోజుకు 5 వందలు ప్రభుత్వం కేటాయించిన వారికి సరైన మెనును అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలి పెడుతున్నట్టు స్వయంగా ఆ రోగులు ఫోన్ లు చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.బ్రాందీ షాపులను తెరచి కరోనా ఉధృతి కి ప్రభుత్వం కారణమైంది అన్నారు.షాపులు వద్ద భౌతిక దూరం పాటించకుండా ఉండటం తో కేసులు పెరిగిపోతున్నాయి అన్నారు.తక్షణం వ్యాధి ఉధృతి తాగేంతవరకు బ్రాందీ షాపులను మూసివేసి పరీక్ష కిట్టులు తగినన్ని అందించడంతో పాటు క్వారంన్ టైన్ రోగులు తగిన సదుపాయాలను కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఇంకా పార్టీ కార్యదర్శి బడుగు శ్రీకాంత్,నాయకులు అందుగుల జార్జి చక్రవర్తి, కంటే జగదీష్, వాసు తదితరులు పాల్గొన్నారు.


శిరోముండన కేసులో దోషులను వెంటనే అరెస్టు చెయ్యాలి

శిరోముండన కేసులో దోషులను వెంటనే అరెస్టు చెయ్యాలి


సామర్లకోట ,పెన్ పవర్


సీతానగరంలో దళితునిపై జరిగిన శిరోముండనం కేసులో దోషులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పట్టణ తెదేపా దళిత నాయకులు మాజీ కౌన్సీలర్ అందుగుల జార్జి చక్రవర్తి డిమాండ్ చేశారు.తెదేపా కార్యలయం లో  ఆయన మాట్లాడుతూ ఎస్సి,ఎస్టీల పట్ల వైఎస్సార్ ప్రభుత్వం ఎంతో చులకన భావంతో ఉందన్నారు.వైసిపి నాయకులు ఏమి చెబితే వాటిని పోలీసులు చేస్తున్నారు అన్నారు.దానికి నిదర్శనమే ఈ శిరోముండన ఘటనగా ఆయన విమర్శించారు. బాధ్యత గల ఉన్న ఎస్ఐ ,ఒక కానిస్టేబులు కలసి ఇంతటి దారుణానికి పాల్పడటం వెనక ఆ గ్రామానికి చెందిన వైసిపి నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. వెంటనే వారిని పురిగొల్పిన వైసిపి నాయకులును అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసును నమోదు చేయాలన్నారు.అలాగే సామర్లకోట పట్టణంలో ఒకే గృహంలో కరోనాతో తల్లి,కుమారులు మృతిచెందగా ఆ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో గాని, ఆ ప్రాంతంలో తక్షణ భద్రతా చర్యలు చేపట్టే విషయంలో గాని అధికారులు ఎంతో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్టు ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని లేదంటే వైసిపి ప్రభుత్వానికి చివరి రోజులు వచ్చినట్టుగా తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా  చక్రవర్తి వెంట తెదేపా నాయకులు అడబాల కుమారస్వామి,బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్, వాసు పాల్గొన్నారు.


మెంటాడ లో కరోనా టెన్షన్


మెంటాడ లో కరోనా టెన్షన్


 


 


 మెంటాడ, పెన్ పవర్


 

మండల కేంద్రం లోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం కరోనా పరీక్షలు నిర్వహించారు. గత రెండు రోజుల క్రితం మెంటాడ ఏవో మల్లికార్జున రావు కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారు లో టెన్షన్ మొదలైంది. దీనితో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఎంపీడీవో,  వెలుగు,  తాసిల్దార్ కార్యాలయాల్లో విధులు 30 మందికి  నిర్వహిస్తున్న కరోనా పరీక్షలు నిర్వహించగా ఇందులో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ,  రెవెన్యూ,  వెలుగు,  ఉపాధి,  గృహ నిర్మాణ శాఖ,  గ్రామ వాలంటీర్లకు,  సచివాలయాల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.  జిల్లా కలెక్టర్,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్పందించి పరీక్షలు నిర్వహించాలని అధికారులు కోరుతున్నారు.

ప్రెస్ క్లబ్ సహకారంతో జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ





ప్రెస్ క్లబ్ సహకారంతో జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ


         


 పరవాడ పెన్ పవర్


 

పరవాడ; కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీయూడబ్ల్యూజే పరవాడ ప్రెస్ క్లబ్ కు చెందిన జర్నలిస్టులకు స్థానిక యూనియన్ సహకారంతో శుక్రవారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 10 కిలోల నాణ్యమైన బియ్యం, కిలో బెల్లం, కిలో గోధుమరవ్వ, కిలో గోధుమపిండి, కిలో ఇడ్లీ రవ్వ, కిలో ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్, అరకిలో మినప్పప్పు, అర కిలో పెసరపప్పు, రెండు మైసూర్ శాండల్ సబ్బులు చొప్పున ప్రెస్ క్లబ్  గౌరవా ఆధ్యక్షులు  పయిల సన్యాసిరావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ కమిటీ సభ్యులు రవి అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల వారికి కృతజ్ఞతలు తెలిపారు.


 

 




భాజపా ఆధ్వర్యంలో వైద్యులకు పిపిఈ కిట్లు










భాజపా ఆధ్వర్యంలో వైద్యులకు పిపిఈ కిట్లు


 


అనకాపల్లి , పెన్ పవర్


 

 భారతీయ జనతాపార్టీ  ఆధ్వర్యంలో వైద్యులకు పీపీఈ కిట్లు శుక్రవారం అందజేశారు. జిల్లా అధ్యక్షులుు డాక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో నాయకులు వైద్యులుకు అందజేశారు. ఎన్టీఆర్  ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ కి ఇచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా కట్టడి  విషయంలో రోగులకు వైద్యం అందించడం లో వైద్యుల త్యాగం మరువలేనిదన్నారు. వైరస్ ప్రబలే అవకాశంం లేకుండా పి పి ఈ కిట్లు   లేక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. దీంతో పార్టీ ఆదేశాల మేరకు తాము వైద్యులకు వైద్య సిబ్బందికి రక్షణగా వీటిని అందజేశామన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు , మాజీ ఎంపిటిసి చదరం నాగేశ్వరరావు , దళిత మోర్చ జిల్లా అధ్యక్షులు కొండబాబు మాస్టారు,  అనకాపల్లి టౌన్ ప్రధాన కార్యదర్శి కర్రి రామకృష్ణ  , అనకాపల్లి మండల  అధ్యక్షులు  కసిరెడ్డి  శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.

 

 




 




 

 



 



 



లాక్ డౌన్ ప్రకటిస్తే బాగుంటుంది





లాక్ డౌన్ ప్రకటిస్తే బాగుంటుంది   కోప్పల రామ్ కుమార్


 


పూర్ణ మార్కెట్, పెన్ పవర్


 

 

కరోనా విలయతాండవం  రోజు రోజుకీ విజరంభిస్తున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్  ప్రకటించే దిశగా ఆలోచిస్తే బాగుంటుందని దక్షిణ నియోజక వర్గం బి.జె.పి.  కన్వీనర్ కొప్పల రామ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ కేసులు ఎక్కువ అవుతుండడం వలన లాక్ డౌన్ ప్రకటిస్తే కేసులను కొంత  వరకు కంట్రోల్ చేయవచ్చన్నారు. దక్షిణ నియోజకవర్గంలో  గల పూర్ణా మార్కెట్లోని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఊదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపార కలాపాలు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం ద్రుష్టిలో పెట్టుకొని రాష్ట్ర  ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తెలియజేశారు.


 

 




వారోత్సవాలు కొనసాగింపా వాయిదా


మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కొనసాగింపా వాయిదా


 


చింతపల్లి  ,పెన్ పవర్


 

ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు అటవీ ప్రాంతంలో  సిపిఐ మావోయిస్టు అమరవీరుల సంస్సరణవారోత్సవాలు విజయవంతం  చేసుకోవడానికి మవోయిస్థులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నెల 28 నుంచి వచ్చే నెల3 వరకు మావోయిస్టులు నిర్వహించే సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీసులు  ఏ ఓ బి లో కుంబింగ్ ముమ్మరం చేరారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల19,  22న, మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి.ఈ ఎదురు కాల్పుల్లోమావోయిస్టు అగ్రనేతలకు తీవ్ర గాయాలయినట్లు పోలీసులు వర్గాలు భావిస్తున్నాయి.ఇటువంటి పరిస్థితుల్లో మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకోవాలా? లేక వాయిదా వేసుకోవాలా? అనే దానిపై మావోయిస్టులలో సందిక్తత నెలకొన్నంటుంది. అయితే ప్రతీ ఏడాది ఏవోబి అటవీ  ప్రాంతంలో ఉన్న అమరవీరుల సంస్కరణ స్థూపాలను సుందరంగా తీర్చిదిద్ది విప్లవ గేయాలతో, గ్రామ సభలు నిర్వహిస్తూ వారోత్సవాలు ఘనంగా జరుపుకునే వారు. వారోత్సవాలు మరో పది రోజులు వుందనగా గతంలో నిర్మించిన స్థూపాలకు రంగులు వేసేవారు.కానీ మరో 4 రోజులలో మావోయిస్టు సంస్మరణ వారోత్సవాలు ప్రారంభం కానున్నప్పటికి  ఎప్పుడో నిర్మించిన స్థూపాలకు నేటికీ రంగులు వేయలేక పోయారు.పోలీస్ నిర్బంధం,గాలింపు చర్యలు విస్తృతంగా వుండడం వలన మావోయిస్టు కార్యకలాపాలు సాగడం లేదు. గత కొన్నేళ్లుగా వారోత్సవాలు అడ్డుకొవడానికి పోలీస్  బలగాలు ఏవో బి అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతునే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఏవోబీ అటవీ ప్రాంతంతో పాటు ఏజెన్సీ గ్రామాలలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, స్తూపాలకు రంగులు వేసేందుకు అవకాశం లేకుండా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతూ,వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు మాత్రం ఏదో ఒక ప్రాంతంలో సంస్మరణ సభ నిర్వహించే తీరుతారని ప్రచారం జరుగుతోంది. ఏ ఓ బి,విశాఖ ఏజెన్సీ అంతటా పోలీసు యంత్రాంగం  ముందుగానే అప్రమత్తమై మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. ఇరు వర్గాల చర్యలతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని మన్య వాసులు భీతిల్లుతున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...