మెంటాడ లో కరోనా టెన్షన్
మెంటాడ, పెన్ పవర్
మండల కేంద్రం లోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం కరోనా పరీక్షలు నిర్వహించారు. గత రెండు రోజుల క్రితం మెంటాడ ఏవో మల్లికార్జున రావు కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారు లో టెన్షన్ మొదలైంది. దీనితో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఎంపీడీవో, వెలుగు, తాసిల్దార్ కార్యాలయాల్లో విధులు 30 మందికి నిర్వహిస్తున్న కరోనా పరీక్షలు నిర్వహించగా ఇందులో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ, రెవెన్యూ, వెలుగు, ఉపాధి, గృహ నిర్మాణ శాఖ, గ్రామ వాలంటీర్లకు, సచివాలయాల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్పందించి పరీక్షలు నిర్వహించాలని అధికారులు కోరుతున్నారు.
No comments:
Post a Comment