ఫార్మా నిర్వాసిత గ్రామాల్ని తరలించండి
పెందుర్తి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ బొద్ధపు వెంకటరమణ
పరవాడ పెన్ పవర్
పరవాడ:జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీ(రామ్ కీ ఫార్మాసిటీ) లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్న కారణంగా ప్రజలు బయ బ్రాoతులతో జీవిస్తున్నారు అని అందుకు ఫార్మాసిటీ చుట్టు ప్రక్కల గ్రామాలను తరలించండి లేదా వారికి హాని కలగ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని పెందుర్తి బీజేపీ కన్వీనర్ బొద్ధపు వెంకట రమణ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కి స్పoదన కార్యక్రమంలో ఎమ్యెల్సి మాధవ్ కి వినతిపత్రం అందజేశారు.అనంతరం వేoకటరమణ మాట్లాడుతూ ఫార్మాసిటీ దగ్గరలో అనేక గ్రామాలు ఉన్నాయి అని ఫార్మా పొల్యూషన్ వలన ఈ గ్రామాల్లోని ప్రజలు అనేక రుగ్మతలకు లోనవుతున్నారు అని అన్నారు.గుండె,ఊపిరితిత్తుల వ్యాధులు,కిడ్నీ సమస్యల తో భాధపడటమే కాకుండా కొందరు మృతి చెంది కూడా ఉన్నారు అని తెలిపారు.ఇప్పటికే విశాఖ జిల్లా పలు ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్,ఎన్టీపీసీ,ఫార్మాసిటీ,బ్రాన్డిక్స్,లాంటి కంపెనీల కాలుష్యం వలన ఆ చుట్టుప్రక్కల నివసిస్తున్న అనేక మంది మహిళలు,చంటి పిల్లలు అవస్థలు పడుతున్నారు అని అన్నారు.ఇదే కాకుండా అనేక రకాలు అయిన ఫార్మా విష రసాయనాలు,వ్యర్ధాలు సముద్రంలోకి వదిలివేయడం వలన సముద్రం లోని మత్యు సంపద పూర్తిగా నాశనం అయి మాత్యుకారుల మనుగడకే ప్రమాద ఏర్పడింది అని అన్నారు.ఇటు ఫార్మా,ఎన్టీపీసీ లాంటి వాటి వాయు కాలుష్యం వలన ఈ ప్రాతంలో వర్ష ప్రభావం తగ్గిపోవడం వలన ఈ ప్రాంతాల్లో వ్యవసాయమే జీవన ఆధారంగా బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలు వ్యవసాయం లేక రోడ్డున పడ్డారు అని అన్నారు.ఈ ప్రస్థితుల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించ లేదు అని తమరు అయినా చొరవ తీసుకుని ముఖ్యమంత్రి తో మాట్లాడి ఈ చుట్టు ప్రక్కల గ్రామాల్లోని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి అని కలెక్టర్ వినయ్ చంద్ ని కోరుతూ వినతిపత్రం ఇచ్చాము అని వెంకటరమణ తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment