కరోనా పై పరవాడ జనసైనికుల పోరాటం.
స్వయంగా వీధుల్లో హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ.
పరవాడ, పెన్ పవర్
పరవాడ : కరోనా పై పోరాటానికి పరవాడ జనసైనికులు నడుం బిగించారు. స్వయంగా జనసైనికులు భుజాలకు హైపో క్లోరైడ్ ద్రావణ డబ్బాలను తగిలించుకొని గ్రామ పురవీధుల్లో ఆదివారం ఉదయం పిచికారి చేసి గ్రామస్తులు చేత శభాష్ అనిపించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ మాత్రం భయపడకుండా గ్రామ పురవీధుల్లో క్రిమిసంహారక మందును స్వయంగా స్ప్రే చేయడంపై పలువురు జనసైనికుల పై ప్రశంసల కురిపిస్తున్నారు. పరవాడ గ్రామంలో జనసైనికులు శెట్టి బలిజ, రజక వీధి, సిరిపురపు వారి వీధి, చుక్క వారి వీధి, శివాలయం రోడ్డు చేలల్లో ఇళ్లలు, ముస్లిం వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ పిచికారి చేసారు. ఈ కార్యక్రమంలో చుక్కా నాగు, కరెడ్ల అభిరామ్, వడిసెల రాము సన్నాఫ్ బంగారు బాబు, మెకానిక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment