జిల్లాలో బ్యాంకులు1గంట వరకే పనిచేస్తాయ్..
జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్
విశాఖపట్నం, పెన్ పవర్
జిల్లాలోని బ్యాంకులు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పనిచేస్తాయని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఉదృతం అవుతున్న సందర్భంగా బ్యాంకు ల పని వేళలను తగ్గించడం జరిగిందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేస్తా అన్నారు. పైలట్ ప్రభుత్వ రంగ బ్యాంకులు పని వేళలు మార్పు చేయాలని బ్యాంక్ యూనియన్ లో కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. మంగళ వారం నుంచి బ్యాంకుల పనివేళలో మారుతున్నాయని తెలిపారు. కోవిడ్ 19 నిబంధనలు తప్పక పాటించాలని బ్యాంకర్లను కోరడం జరిగిందన్నారు. బ్యాంకుల పనివేళల్లో తగ్గించడం వల్ల ఖాతాదారుల రద్దీ తగ్గుతుందని వినయ్ చంద్ తెలిపారు.
No comments:
Post a Comment