Followers

మావోయిస్టులు మృతి



ఏవోబీలో పోలీసులు మావోల మధ్య ఎదురుకాల్పులు.
మావోయిస్టులు మృతి. మృతుడు జి.మాడుగుల వాసి.
మల్కన్ గిరి జిల్లా గుజ్జేడు  అటవీ ప్రాంతంలో కాల్పులు.

            


విశాఖపట్నం, పెన్ పవర్



  ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో  పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన మావోయిస్టులు సేఫ్ జోన్ లోకి చేరుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎదురు కాల్పులు జరిగిన సంఘటనలో  మావోలు  విడిచిన 3 కిట్ బ్యాగులు 303 రైఫిల్  మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 28నించి ఆగస్టు3 వరకు  అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయి. మావోల ప్లీనరీ చెదించడానికి విశాఖ గ్రేహౌండ్స్ ఒడిశా ఎస్ వో జి  బలగాలు శనివారం సాయంత్రం  మల్కనగిరి జిల్లా గుజ్జేరు  అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా  మావోయిస్టులు ఎదురు పడడంతో కాల్పులు తలెత్తాయి. మావోయిస్టులు పోలీసు బలగాల మధ్య భీకర  తుపాకీల పోరు జరిగింది. ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. రాత్రి కావడంతో మావోయిస్టులు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టు జి. మాడుగుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన దయాగా  పోలీసులు గుర్తించారు. 2016 లో జరిగిన రామ్ గూడా ఎన్కౌంటర్లో మృతి చెందిన పాంగి దోసో సోదరుడు దయా. అక్క మృతిచెందడంతో మావోయిస్టుల్లో చేరాడు. ఈ పది రోజుల్లో  ఏవోబీ పరిధిలో నాలుగు  దఫాలు ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈస్ట్ డివిజన్  కార్యదర్శి అరుణ చల పతి  అగ్రనేత ఆర్ కె తప్పించుకున్న విషయం తెలిసిందే. రెండు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి  చెందారు. పోలీసులు మావోయిస్టు వ్యూహ ప్రతి వ్యూహాలతో  ఎదురు కాల్పులకు తెగబడుతున్నారు.


 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...