Followers

సంజీవని కోవిడ్ పరీక్షల రిపోర్టులు ఎక్కడా


సంజీవని కోవిడ్ పరీక్షల రిపోర్టులు ఎక్కడా


 


వారం రోజులు దాటినా విడుదల కాని రిపోర్టులు పరీక్షలు చేయించుకున్న వారిలో తీవ్ర ఆందోళన...


 


సామర్లకోట,,పెన్ పవర్


 

ఈ నెల  సామర్లకోట పట్టణంలో సంజీవిని సంచార వాహనం ద్వారా నిర్వహించిన కోవిడ్ పరీక్షల రిపోర్టు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి స్థానికంగానెలకొంది స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో ఈ నే 20 వ తేదీన మూడు వందలకు పైబడి ప్రైమరి ,సెకండరీ కంటాక్టులకు సంబంధించిన మూడు వందలకు పై బడి కోవిడ్ పరీక్షలను పూల్ పద్దతి లో నిర్వహించారు అలా రాత్రి సుమారు తొమ్మిది గంటల వరకు నిర్వహించి సేకరించిన సెంపిల్  కిట్టులను కాకినాడ తరలించారు. ఐతే దానికి ముందు కొద్దీ రోజుల పాటు పట్టణ పరిధిలో భారీగానే పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కోవిడ్ లక్షణాలు ఉన్న వారు అనుమానం ఉన్నవారందరికి ఈ పరీక్షలు నిర్వహించిన వాటికి సంబంధించిన రిపోర్టులు ఇప్పటివరకు విడుదల కాకపోవడం ఆశ్చర్యనికి గురి చేస్తుంది.సంజీవి వాహనం ద్వారా చేపట్టిన పరీక్షలు ఏమయ్యాయో స్థానిక వైద్య అధికారులకు సహితం అర్థం కాకపోవడం మరింత ఆశ్చర్యనికి గురి చేస్తుంది.పరీక్షలు చేయించుకుని 8 రోజులు గడిచిన రిపోర్టులు రకవడంతో పరీక్షలు చేయించుకున్న ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తమకు పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అనే విషయం తెలియక అయోమయానికి గురవుతున్నామని దానితో తాము ఎక్కడికి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఒక వేళ పరీక్షలు చేయించుకొన్నవారిలో ఉన్న వయస్కులకు పాజిటివ్ లక్షణాలు ఉంటే వారి పరిస్థితి ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాగా పరీక్షలు చేయించుకున్న వారిలో పలువురు పలు ప్రయివేటు పరిశ్రమలలో పని చేస్తున్నo దున పరీక్షల రిపోర్టులు వస్తే తప్ప తమను విదులులోకి తీసుకోమని యాజమాన్యం చెబుతున్నారు అని దానితో ఉపాధిని కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నాము అని పలువురు కార్మికులు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయం పై స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యులను ప్రశ్నిస్తే ఆ రిపోర్టుల కోసమే తాము చూస్తున్నాము అని ఆలస్యానికి కారణం తమకు తెలియడం లేదు అంటున్నారు.దాని పై జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా మల్లిక్ ను వివరణ కోరగా జిల్లా  వ్యాప్తంగా సుమారు 7 వేలకు పై బడి రిపోర్టులు పెండింగులో ఉన్నాయి అన్నారు.కాకినాడ లొ కోవిడ్ పరీక్షలు నిర్వహించే టెక్నీషియన్ ల కొరత ఉన్నందున ఉన్న ఒక్క టెక్నీషియన్ రాత్రి పగలు పనిచేస్తున్న తరగడం లేదు అన్నారు.అయితే స్థానికంగా ఉన్న వైద్య అధికారుల సూచనల ప్రకారం రెడ్ లేబుల్ అతికించిన సెంఫుల్స్ సంబంధించి రిపోర్టులు తొలుత నిర్వహించి వారికి రిపోర్టులను తక్షణం విడుదల చేస్తున్నట్టు చెప్పారు.నెగిటివ్ వచ్చిన రిపోర్టుల విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా రిపోర్టుల కోసం సమయం పాటించాలన్నారు.అన్ని రిపోర్టులు ప్రకటిస్తామని, ఉన్న పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి అని డి ఎం హెచ్ ఓ స్పష్టం చేశారు.ఏదేమైనా 20 వ తేదీనాటి రిపోర్టులు ఇప్పటి వరకు రాకపోవడం పట్ల ప్రజలు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు అని చెప్పక తప్పడం లేదు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...