కరోనా పట్లప్రజలు మరింతఅప్రమత్తంగా ఉండాలి
సొంత నిధులతో గ్రామ ప్రజలకు మాస్కులు శానిటైజర్లు. పి.పి.ఈ కిట్టు పంపిణీ
పంచాయతీ సెక్రటరీ పద్మరాజ
పెద్దాపురం,పెన్ పవర్
పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం గ్రామంలో కరోనా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని రానున్న రోజుల్లో కేసులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరూ మాస్కులు విధిగా ధరించాలనీ మాస్క్ లేనిది బయట తిరిగి రాదని మీ రక్షణ కోసమే మేమందరం పనిచేస్తున్నామని కరోనా పట్ల ఎటువంటి అవసరం వచ్చినా వాలంటీర్స్ ని గాని పంచాయతీ గాని సంప్రదించాలని
పంచాయతీ సెక్రటరీ జె.పద్మరాజు కోరారు అలాగే నా వంతు కృషిగా గ్రామ ప్రజలకు మాస్కులు శానిటైజర్లు పి పి ఈ డ్రెస్లు పారిశుద్ధ్య కార్మికులకు షూలు అందించడం జరిగిందని.ఆయన తెలిపారు.నా ముఖ్య ఉద్దేశం కరోనా బారిన ఎవరు పడకుండా ఉండేందుకే ఇవన్నీ అందించడంజరిగిందని. గ్రామ రక్షణనే మా బాధ్యతగా పంచాయతీ ఎల్లవేళలా సేవలందించడానికి ముందుందని ఆయనతెలిపారు. *గ్రామస్తులుహర్షం*. కల్లు సారాయి నిర్మూలనరహితంగా. తీర్చిదిద్దేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఇటువంటి సెక్రెటరీ మా గ్రామానికిఉండడం గ్రామ ప్రజల అదృష్టంగా భావించాలని గ్రామ పెద్దలు గ్రామస్తులు తెలిపారు. అలాగే గ్రామ అభివృద్ధికి వాలంటీర్స్ వ్యవస్థ కీలకంగా పని చేస్తుందని గ్రామస్తులు అభినందించారు, ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్స్ ఎం.సుభాష్ వి.సాయికృష్ణ,ఎన్.స్వామి,యూ. వీరేంద్ర,దివాకర్,రవి, మణి, వీరకుమార్,పంచాయతీ గుమస్తా శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment