నేటి నుంచి ఎయిర్ పోర్ట్ విశాఖ సిటీల మధ్య
ఫ్లైఓవర్ పై వాహనాలు రాకపోకలు
మంత్రి బొత్స
విశాఖపట్నం, పెన్ పవర్
ఎయిర్ పోర్ట్ విశాఖ సిటీ మధ్య ఫ్లై ఓవర్ పై మంగళ వారం నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయనతోపాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ ఎంపీ సత్యనారాయణలు ఎన్ఏడి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. నిర్మాణం దాదాపు పూర్తి కావడంతో అధికారులకు తగిన సూచనలు చేశారు. విశాఖ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంమధ్యలో ఫ్లైఓవర్ పైనుంచి వాహనాలు నడుపు కోవచ్చని ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశించారు. మర్రిపాలం నుంచి గోపాలపట్నం మధ్యలో ఫ్లైఓవర్ ను ఆగస్టు 15 నా ప్రారంభిస్తామన్నారు. పనులు కొద్దిగా మిగిలి ఉండడంతో వాటిని పూర్తి చేసి ఆరోజున దానాలు రాకపోకలు అనుమతిస్తున్నారు. ఎంతో కాలంగా విశాఖ వాసులను వెంటాడుతున్న ట్రాఫిక్ జామ్ సమస్య నేటితో తీరిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో అతిపెద్ద ట్రాఫిక్ సమస్య ఎన్ఏడి కొత్త రోడ్ వద్దనే అని అది నేటితో తీరిపోతుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరం అయినా చోట్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జి లను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. మంత్రులతోపాటు అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment