ఉద్దేశ్ వైద్యానికి భరణికం హెల్పింగ్ హాండ్స్ బృందం అందించిన ఆర్ధిక సహాయం
రు"3.26లక్షల ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేత.
పరవాడ పెన్ పవర్
పరవాడ : తమ ఊరికి చెందిన బాలుడు లుకేమియా బ్లడ్ క్యాన్సర్ తో ప్రాణాలతో పోరాడుతున్నాడని తెలుసుకున్న భరణికం హెల్పింగ్ హాండ్స్ బృంద సభ్యులు చలించిపోయారు. తమ కళ్ళముందే ఆడుతూపాడుతూ తిరుగుతూ చలాకీగా కనిపించే ఉద్దేశ్ కి ఎంత కష్టం వచ్చింది అని వాపోయారు. ఇంత చిన్న వయసులోనే లుకేమియా తో తమిళనాడు సి.ఎం.సి. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడని తెలుసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. బాలుడి వైద్యానికి భారీగా ఖర్చు అవుతుందని, ఆ ఖర్చును బాలుడు తల్లిదండ్రులు భరించలేరని తెలుసుకున్న భరినికం హెల్పింగ్ హాండ్స్ బృందం సభ్యులు, గ్రామస్థులతో కలిసి చేయి చేయి కలిపారు. దీనికి వైసీపీ మండల యూత్ అధ్యక్షులు పెదశెట్టి శేఖర్ ఆధ్వర్యంలో నడుంబిగించారు. బాలుడు వైద్యానికి అవసరమైన నిధులను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారి ప్రయత్నాలకు గ్రామస్తులు పూర్తిగా సహకరించడంతో రు"మూడు లక్షల ఇరవై ఆరు వేలు రూపాయలు సమకూరాయి. ఈ నగదును సోమవారం ఉదయం బాలుడు కుటుంబ సభ్యులకు అందజేశారు. తమ ఊరు కి చెందిన నాలుగేళ్ల బాలుడికి కష్టం వస్తే గ్రామస్తులు స్పందించిన తీరు చూసి చుట్టు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. బాలుడు త్వరగా కోలుకొని చిరునవ్వుతో తమ గ్రామానికి తిరిగి రావాలని గ్రామస్తులు యువత ఆకాంక్ష వ్యక్తం చేశారు. తమ కుమారుడు వైద్యం కోసం ఇంతగా సహాయం చేస్తున్న భరణికం హెల్పింగ్ హాండ్స్ బృంద సభ్యులకు, గ్రామస్తులకు ఎంతగానో రుణపడి ఉంటామని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని బాలుడు తల్లితండ్రులు జర్నలిస్టు బొండా నాని దంపతులు కన్నీటి పర్యంతంతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొండా తాతారావు, గ్రామ పెద్దలు గణేష్ రాజు, సూర్యనారాయణ మాస్టర్, పిల్లి అప్పారావు, భరణికం హెల్పింగ్ హాండ్స్ సభ్యులు రవికుమార్,భరత్ కుమార్ ,రమేష్ కుమార్,మహేష్ కుమార్,జయప్రకాష్,నాయుడు,శరణ్య,పూజ, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment