Followers

కరోనా పరీక్ష కేంద్రాలు


ఏజెన్సీ 11 మండలాల్లో కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 


 


సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నయ్య పడాల్.


 


 చింతపల్లి , పెన్ పవర్


 

విశాఖ ఏజెన్సీ 11 మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులలో కరోనా వైరస్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు. సోమవారం వామపక్ష రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు సీపీఐ, సిపిఎం నాయకులతో చింతపల్లి గ్రామ సచవాలయం ఎదురుగా ప్లే కార్డులు పట్టుకొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేయలేకపోవడంతో గత్యంతరం లేని ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం (లాక్ డౌన్) పాటించవలసిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేయడం ఎంతవరకు సమంజసమని ఆయన మండిపడ్డారు. ఐసోలేషన్ కేంద్రాలలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వెంటనే ఫలితాలు వెల్లడించాలన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు,పట్టణాల్లో మునిసిపాలిటీ, పారిశుద్ధ్య కార్మికులకు పీ పీ కిట్లు, శానిటైజర్ లు రక్షణతో కూడిన భద్రత పరికరాలు ప్రభుత్వాలు వెంటనే అందించాలన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన కుటుంబాలకు ఆహారంతో పాటు నిత్యావసర సరుకులు, కుటుంబానికి నెలకు రూ. 7,500 లు, 6 నెలల పాటు అందించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల  నాయకులు ఎస్ కె రహీమాన్, (బుజ్జి ) మాజీ వైస్ సర్పంచ్ గింజారి రమణ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్, మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...