పరిశుభ్రత వార్షికోత్సవం
ఆత్రేయపురం,పెన్ పవర్
ఆత్రేయపురం మండలం పేరవరం లో లో లో పరిశుభ్రతా పక్షోత్సవాలలో భాగంగా సోమవారం పైలట్ పంచాయతీలైన పేరవరం,బొబ్బర్లంక గ్రామాలలో ఎంపీడీఒ నాతి బుజ్జి ఆద్వర్యంలో పరిశుభ్రత కమిటీ సభ్యులు , టాస్క్ ఫోర్స్ టీమ్ సభ్యులు, సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లతో కలిసి గ్రామ సందర్శ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఘన,ద్రవవ్యర్ధాల నిర్వహణ,-త్రాగునీటి సరఫరా, పైప్ లైన్ లీకేజ్ లు, వ్యక్తిగత మరుగుదొడ్లు మరియు కమ్యూనిటీ మరుగు దొడ్లు వాడకం, బహిరంగ మల విసర్జన లేకుండా అవగాహన కల్పించడం, డ్రైన్లు శుభ్రం చేయడం- SWPC షెడ్ నిర్వహణ ,
అంటువ్యాధులు ,ఇతర ఆరోగ్య సంబంధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి , పంచాయతీ సిబ్బందికి తగు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్ , కార్యదర్శులు శివరామకృష్ణ, హనుమ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీకాంత్, బొబ్బర్లంక మాజీ ఎంపీటీసి సల్లపూడి క్రీస్తమ్మ, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment