బల్లిపాడులో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలు పట్టివేత
తాళ్ళపూడి, పెన్ పవర్
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ అదేశాలమేరకు, అడిషనల్ ఎస్పీ యస్ఈబి వారు జయరామ్ ఇన్ఫర్మేషన్ ద్వారా కొవ్వూరు డిఎస్పీ బి.శ్రీనాథ్ ఆధ్వర్యంలో కొవ్వూరు సిఐ సురేష్, తాళ్ళపూడి ఎస్ఐ జి.సతీష్ ఎంతో చాకచక్యంగా గురువారం సాయంత్రం 7 గంటలకు బల్లిపాడు ఇసుక ర్యాoపులో అక్రమంగా తరలిస్తున్న 6 ఇసుక లారీలను, ఒక ప్రొక్లైన్ సీజ్ చేసినట్లు బి.శ్రీనాథ్ తెలిపారు. ఈ ర్యాంపు కంటిపూడి రవీంద్ర కనస్ట్రక్షన్ వారికి చెందిఉన్నదని, దీనిని వేరే వ్యక్తులకు సబ్ లీజ్ కు ఇచ్చినట్లుగా తెలిపారు. వీటిలో 3 లారీలకు బిల్లులు లేవని, 3 లారీలు అదనంగా లోడ్ తో ఉన్నాయని, మొత్తం 130 టన్నుల ఇసుక పట్టుబడిందని తెలిపారు. 14 మంది నిందితులు పట్టుబడగా, 10 మందిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లుగా తెలియజేసారు. కొవ్వూరు సిఐ సురేష్, తాళ్ళపూడి యస్ఐ జి.సతీష్, మరియు పోలీస్ సిబ్బంది ఎంతో చాకచక్యంగా ఉద్యోగ కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు కొవ్వూరు డియస్పి బి.శ్రీనాథ్ కొనియాడారు. ఈ నియోజకవర్గoలో ఇసుక ర్యాంపులలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.