పోలీస్ ది గ్రేట్
అనకాపల్లి, పెన్ పవర్
పోలీస్ ది గ్రేట్ . ప్రజలకు రక్షణ కల్పించే కల్పించడంలో వారు వ్యవహరించే తీరే వేరు. ఇప్పుడు కరోనా వ్యాధి నుంచి ప్రజలను గట్టెక్కించడంలో వాళ్లు రోడ్లపై చేస్తున్న విధులు విలువైనవిగా చెప్పొచ్చు. ఆపత్కాలంలో వారు చేస్తున్న కృషి అభినందనీయం. పోలీస్ దిగ్రేట్ అంటూ పలువురు పేర్కొంటున్నారు. పోలీసులను రక్షక భటులని ఎందుకంటారో ఇప్పుడు క్షేత్రస్థాయిలో తెలిసొస్తుందనెేది జనం మాట. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి ప్రజలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
జనం రోగం బారిన పడకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా రోడ్లపై రక్షణ వలయంగా నిలుస్తున్నారు అంటే అతిశయోక్తి లేదు.
కరోనా వ్యాధి నేపథ్యంలో కుటుంబం మొత్తం కలిసి ఉండేందుకే సంకోచించాల్సిన పరిస్థితి. ఆ వ్యాధి తీవ్రతెే అలాంటిది. అందుకే దాని బారిన పడకుండా జాగ్రత్త వహించాల్సిందేనని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. దీని కోసం ఎవరూ రోడ్లపైకి రాకుండా ఇంటిలోనే ఉండాలని లాక్ డౌన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం చెప్పినా వినేవారు అరుదుగానే ఉంటారన్నది తెలిసిందే. దీంతో ప్రజలను రక్షించాలనె ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తుంది పోలీసులే. రోడ్లపై ఎండనకా వాననకా సేవలు అందించే పోలీసులు నిస్పక్షపాతంగానే నిర్వహిస్తారు. ఈ క్రమంలో అదుపు తప్పెవారిని నియంత్రించడం లొో కఠినంగా కూడా వ్యవహరించాల్సిన పరిస్థితి. కరోనా వ్యాధి ప్రభావం తెలిసి కొందరు తెలియక మరికొందరు ఏదో నెపంతో రోడ్లపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీంతో అటువంటి వారిని నిలువరించడంతో పాటు ప్రజలను కంటికి రెప్పలా కాపాడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారంటే అతిశయోక్తి లేదు. పోలీసులకి కుటుంబాలు ఉన్నా ప్రజా ధర్మమే ముఖ్యం అన్న వైఖరి తో ముందుకెళతారు. వృత్తి ధర్మంలో భాగంగా విధి నిర్వహణలో ఇబ్బందులున్నా వెరవకుండా ఉత్సాహంగా పని చేస్తుంటారు. ప్రజలకు రక్షణ కల్పించే రక్షక భటులుగా పేరున్న పోలీసులు ఇప్పుడు కరోనా మహమ్మారి నేపథ్యంలో వారు ప్రజలను బయటికి రాకుండా కాపాడుతున్న చర్యలు గొప్పవిగా అభివర్ణిస్తున్న వారు అధికమే. నిజంగా పోలీసులు ది గ్రేట్ అంటూ పలువురు పేర్కొంటున్నారు అంటే అతిశయోక్తి కాదు.
No comments:
Post a Comment