- మినహాయింపు సమయమే కారణం
- ప్రభుత్వం, అధికారులు ,పోలీసులు పక్కా పర్యవేక్షణ
- సమస్యల్లా సామాన్య జనంలో లోపిస్తున్న అవగాహన
అనకాపల్లి, పెన్ పవర్
కరోనా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించేది. జాగ్రత్తగా లేకపోతే అందరి చావుకు కారకంగా నిలిచే అవకాశాలు లేకపోలేదంటూ ప్రభుత్వం ఓవైపు మొత్తుకుంటూనే ఉంటుంది. ఇళ్లకే పరిమితమవండి అంటూ లాక్డౌన్ ను కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ వైపు పలుశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఎండనకా వాననక పనిచేస్తూనే ఉన్నారు. పోలీసులు నిరంతర పర్యవేక్షణలో ఉంటూనే ఉన్నారు. కానీ ఏమి లాభం. నిత్యావసర సరుకుల కోసం అంటూ ఇచ్చిన మినహాయింపు సమయం ప్రజల భద్రతకు, ప్రభుత్వ లక్ష్యానికి భంగం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నిత్యావసర సరుకుల కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం మినహాయింపు సమయాన్ని ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చారు. ఇస్తూనే సామాజిక దూరాన్ని కూడా తప్పక పాటించాలని కూడా సూచనలు చేస్తున్నారు. రాజకీయ ప్రముఖులు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సలహాలిస్తునెే ఉన్నారు. కానీ అది ఏ మేరకు సత్ఫలితాన్ని ఇస్తుందో అన్నదే ఇక్కడ ప్రశ్న. అవగాహన ఉన్నా కొందరు అవగాహన లేక మరికొందరు మార్కెట్లకు ఇబ్బడి ముబ్బడిగా వస్తూనే ఉన్నారు. ఎక్కడో చోట గుమి గుూడుతూనే ఉన్నారు. దీంతో కరోనా వ్యాధి చైన్ కు బ్రేక్ వేయాలనె లక్ష్యానికి ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల మాట.
ప్రభుత్వం పరంగా మార్కెట్ ను వికేంద్రీకరణ చేశారు. సామాజిక దూరానికి తగ్గట్లు చర్యలు కూడా తీసుకున్నారు. కానీ ప్రజల నుంచి వచ్చే స్పందన అంతంతగానెే ఉండటంతో చిత్తశుద్ధితో లాక్డౌన్ లో పాటించేవారు కూడా పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా అధికారుల పరంగా ఎంత చేస్తున్న ఈ మినహాయింపు సమయంతో ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. గుమిగూడే జనంతో ఏ సమస్య వచ్చినా అక్కడి నుంచి మరొకరికి మరొకరి నుంచి ఇంకొకరికి తాకే అవకాశాలు లేకపోలేదు. పైగా మినహాయింపు సమయాన్ని ఆసరాగా చేసుకుని ఊరికినే బయటికి వచ్చే వారే అధికంగా ఉంటున్నారనది క్షేత్ర స్థాయి మాట. రోజు మార్కెట్కి వచ్చేవారు ఉండనే ఉన్నారు. దీంతో అసలు లక్ష్యం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయనే వారు లేకపోలేదు. చాలా చోట్ల మార్కెట్ వికేంద్రీకరణ జరగడంతో మినహాయింపు సమయాన్ని తగ్గిస్తే బావుండు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తపరుస్తున్నారు. అలాగే గ్రామాల నుంచి మార్కెట్కు రాకుండా వారివారి గ్రామాల్లోనే నిత్యావసర సరుకులు అందుబాటులొో ఉండేలా చర్యలు తీసుకుంటే ప్రభుత్వ లక్ష్యం త్వరగా నెరవేరే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
No comments:
Post a Comment