Followers

రాజారత్న బార్ పై సోదాలు



మండపేట, పెన్ పవర్ 



కరోనా వైరస్ కారణంగా మండపేట లో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లను, మద్యం దుకాణాలను అధికారులు పూర్తిగా నిషేధించారు. శనివారం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండపేట విచ్చేసి కూరగాయల మార్కెట్ తో పాటు పలు ప్రాంతాలు పర్యటన జరిపారు. మండపేట లో పరిస్థితిని తెలుసు కోడానికి ప్రజల స్పందన తదితర అంశాల పై మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశం మధ్యలో పట్టణంలో మద్యం అమ్మకాలు రహస్యంగా సాగుతున్నాయని బోస్ దృష్టికి తీసుకువచ్చారు.  బోస్ స్పందిస్తూ ఆ బార్ కి వెళ్లి  సోదాలు జరపమని ఆదేశించారు. దీంతో కమిషనర్ త్రిపర్ణ  రామ్ కుమార్ టీపీఎస్ కట్టా వీరబ్రహ్మం, శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఇతర సిబ్బందిని వెంట బెట్టుకుని రాజారత్న బార్ ను తనిఖీ చేశారు. బార్ తలుపులు మూసి వేయడంతో చుట్టూ ఉన్న గార్డెన్ , వంటశాల, లూజు న అమ్మే కౌంటర్ లను పరిశీలించారు. అక్కడ ఎటువంటి మద్యం బాటిల్స్ కనపడలేదు. ఈలోగా బార్ నిర్వాహకులు ఊలపల్లి ప్రసాద్, బొడ్డు రామకృష్ణలు బార్ వద్దకు వచ్చారు. వారిని కమిషనర్ రామ్ కుమార్ ప్రశ్నించారు. తాము అయితే  బార్ ని ఎట్టి పరిస్థితిలో తెరవ లేదని కమిషనర్ కు సమాధానం ఇచ్చారు. తెరవకుండా మద్యం క్వార్టర్ బాటిల్ ఎలా వచ్చింది అని కమిషనర్ అడగ్గా ఇది ఎవరో కావాలని చేసిన పని తప్పా తాము అయితే అమ్మలేదని చెప్పారు. మద్యం బాటిల్ ఇక్కడే కొన్నట్టు సమాచారం ఉందని  తాను దీనిపై నివేదిక సిద్ధం చేసి జిల్లా కలెక్టరుకు ఫైల్ అందజేస్తాను అని కమిషనర్  అక్కడి నుండి కార్యాలయానికి వచ్చేశారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...