Followers

త్రాగు నీటి ఎద్దడి సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకోండి



 

రంపచోడవరం పెన్ పవర్:

 

గిరిజన ప్రాంతాలలో వేసవిలో త్రాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నం కాకుండా వేసవి కార్యాచరణ ప్రణాళికలు సమర్ధవంతం పరిచి గిరిజనులకు పూర్తిగా దాహార్తిని తీర్చాలని ఐ టి డి ఎ పి.ఓ నిశాంత్ కుమార్ గ్రామీణ త్రాగునీటి సరఫరా ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఐటిడిఎ కార్యాలయం లో వేసవి కార్యాచరణ ప్రణాళికలు అమలు తీరును ఆయన ఆ శాఖ ఇంజనీర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధులు మండలాలకు, పంచాయతీలకు విడుదల కాబడ్డాయని, మండలాలకు విడుదలైన నిధులతో ఆయా పరిధిలోని చేతి పంపులు రిపేర్లు, మెటీరియల్ కొనుగోలుకు మెకానిక్, మొబైల్ వాహనాల కొరకు ప్రతిపాదనలు సిద్ధంగా చేసి వెంటనే అనుమతులు పొంది ఆయా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. చేతి పంపులు ఫ్లసింగ్, వివిధ రకాలు స్కీములు నిర్వహణ, స్పేర్ పార్ట్స్ అవసరతలు గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కోరాలి అన్నారు. ఇరిగేషన్ శాఖ వారి ఆయకట్టు పరిధిలోని గ్రామాలలో మంచినీటి స్టోరేజ్ చెరువులను వేసవి కార్యచరణ అమలుకు ముందుగా నింపుకోవాలని ఆదేశించారు. ఆయా స్కీమింగ్ వర్కింగ్ కండిషన్లు విశ్లేషించి వాటికి రిపేర్లు అవసరతను గుర్తించి ప్రతిపాదనల ద్వారా వాటిని చేపట్టాలన్నారు. నీటి కొరత ఉన్న చోట్ల ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనుల క్షేత్రాలలో వేసవి కార్యాచరణ ప్రణాళికలు పూర్తిస్థాయిలో కూలీలకు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాలకు విదేశాల నుంచి ఎవరైనా తిరిగి వచ్చిన ఎడల వారిని ముందుగానే గుర్తించి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయో లేదో వైద్యుల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి వారిని క్వారం టైన్ కేంద్రాలలో 28 రోజులు పాటు వైద్యపరంగా పర్యవేక్షణ కొరకు ఉంచాలని ఆదేశించారు. ఏఎన్ఎం లు ఆశాలు వారి పరిధిలోని విదేశాల నుంచి వచ్చి క్వారం టైన్ ఉన్నవారిని రోజులో రెండు పర్యాయాలు వారి యోగక్షేమాలు గురించి ఆరా తీసి వైద్యులు ద్వారా తదాగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి 15 మంది వచ్చారన్నారు. చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా చర్యలు చేపట్టాలని ఎట్టిపరిస్థితులలోనూ ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఎవరిని అనుమతించరాదని హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలలో కూడా క్వారం టైన్ ఉన్నవారికి ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. హోమ్ క్వారం టైన్ ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిత్యవసర వస్తువులు కొనుగోలు కొరకు బయటకు రాకుండా గ్రామ వాలంటీర్లు ద్వారా నిర్దేశిత సామాజిక దూరాలు పాటిస్తూ సరఫరా చేయాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా ప్రస్తుత పరిస్థితులలో సామాజిక దూరం పాటించడమే శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, ఆర్డబ్ల్యూఎస్ డి ఈ లు నాగ వెంకట పద్మనాభం, రవీంద్ర బాబు, ఇంజనీర్లు రాజు, హరి రామ కృష్ణ, ఏ డి ఎం హెచ్ ఓ డాక్టర్ బి.వినోద్ కుమార్, మెడికల్ అధికారి జి రాజ్ కుమార్, ఎంపీడీవో లక్ష్మారెడ్డి, తాసిల్దార్ కే లక్ష్మి కళ్యాణి, డివిజినల్ చాయతీ అధికారి హరి, తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...