భీమవరం, పెన్ పవర్
ఆదివారం కావడంతో ఉవ్వెత్తున రోడ్ల పైకి ఎగసి పడ్డారు భీమవరం పట్టణ వాసులు ... ఓ పక్క ప్రపంచమంతటా కరోనా వైరస్ కు ప్రజలు బయపడుతుంటే ,మరో ప్రక్క ప్రభుత్వాలు ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా పట్టించుకున్న పాపాన పోలేదు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణ ప్రజలు . ఉదయం 6 గంటలనుండి దిరుసుమర్రు రోడ్డు చాపల మార్కెట్ వద్ద మార్కెట్ చేసుకునేవారు కనీస వసతులు కూడా పాటించకుండా గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు . అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు. ఇదిలా కోనసాగితే కరోనా వైరస్ ఒకరి నుండి ఒకరికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ప్రమాదం పొంచిఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి ,భీమవారం నగర వాసులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని బట్టి పట్టణ వాసులు బయటకు వెలెలా కట్టడి చేయవలసిందిగా ప్రజలు ఆధికారులని కోరుతున్నారు..
No comments:
Post a Comment