ఏప్రెల్ 1న వై.ఎస్.ఆర్. పింఛనుకానుక
పింఛనుల పంపిణీపై సూచనలు పాటించాలి
కరోనా వైరస్ కారణంగా తగు జాగ్రత్తలు
3,26,414 పించను దారులకు, రూ.77.16 కోట్లు పంపిణి
డిఆర్డిఎ ప్రాజక్టు డైరక్టరు కె. సుబ్బారావు
విజయనగరం, పెన్ పవర్
ఏప్రిల్ 1వ తేదీన వాలంటీర్లు పింఛనుదార్ల ఇంటివద్దకే వెళ్ళి పింఛనులు పంపిణీ చేయాలని డిఆర్డిఎ ప్రాజక్టు డైరక్టరు కె. సుబ్బారావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కరోన వైరస్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు లాక్ డౌన్ ప్రకటించడం వలన పింఛనుధారులు ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా ఉండుటకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏప్రిల్ 1వ తేదీన పింఛనుదారుల ఇంటికి వెళ్ళి పింఛను పంపిణీ చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఏప్రిల్ 1వ తేదీన పింఛనుల పంపిణీ చేయుటకు ముందే వాలంటీర్లు అందరూ తప్పకుండా నూతన మొబైల్ యాప్ (1.2) ను తమ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పింఛను పంపిణీ చేయుటకు వాలంటీర్లు వాళ్ళ మొబైల్ లలో లాగిన్ అయ్యి పింఛను పంపిణీ ప్రారంబించాలి. వాలంటీర్ల లాగిన్లో కనబడని పింఛనుదార్లకు పింఛను ఇచ్చుటకు యాప్ లో “సెర్చ్ ఆప్షన్” ఇవ్వడం జరిగిందని, పింఛనుదారుడి యొక్క ఐ.డి. ద్వారా సెర్చ్ చేసి వివరములు సరిచూసుకొని పింఛను పంపిణీ చేయవచ్చన్నారు.
కొవిడ్-19 లాక్ డౌను దృష్ట్యా పింఛనుదారులకు రాష్ట్ర పరిధిలో పింఛను “పోర్టబిలిటీ” ద్వారా పింఛను పంపిణీ చేయవచ్చునన్నారు. కరోనా వైరస్ ధృష్ట్యా, ఏప్రిల్ నెల పింఛను పంపిణీ ప్రక్రియలో పింఛనుదారుల వేని ముద్రలు తీసుకొనే ప్రక్రియ రద్దుచేయబడినదన్నారు. అంతేకాక పింఛను ఇచ్చేటప్పుడు అక్విటెన్స్ పై సంతకములు గానీ, వేనిముద్రలు గానీ తీసుకోనవసరం లేదని, ఇది ఇంతకుముందు ఇచ్చిన సూచనలలో మార్పుగా గమనించాలన్నారు. పింఛనుదారులకు పింఛను మొత్తం ఇచ్చిన తదుపరి, పింఛనుదారుడు నగదు తీసుకున్న తరువాత పించన్ దారుడు కనబడేలా స్పష్టముగా ఫోటో తీయాలన్నారు. తదుపరి ఫోటోను జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేయబడుతుందన్నారు. ఇంటింటికీ వెళ్ళి పింఛను పంపిణీ చేసిన సమయంలో సామాజిక దూరం (తగినంత దూరం) పాఠించాలని, పింఛనుదారులు ఇంటినుండి బయటకు రానక్కరలేదన్నారు.
పింఛనుల పంపిణీ ఎంపిడిఓ/మున్సిపల్ కమిషనర్లు లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, పింఛనుల పంపిణీ త్వరితగతిన జరిగేటట్లు చూడాలన్నారు. జిల్లాకలెక్టర్ వారు, పంపిణి సమయంలో పంపిణి దారులుకు పోలీస్ వారు ఎటువంటి ఆటంకం కలిగించకుండా వారియొక్క గుర్తింపు కార్డులను పరిగణలోనికి తీసుకొని సహకరించాలని తెలిజేసారన్నారు. పంపిణి చేయు సమయములో కరోనా వైరస్ ధృష్ట్యా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ తరచుగా చేతులు సుభ్రపరచుకొని, సామజిక దూరాన్ని పాటిస్తూ పంపిణి చేయాలని ఆదేశించారన్నారు. జిల్లాకలెక్టర్ వారు టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబందిత మండల మరియు గ్రామస్తాయి అధికారులు వరకు వివరించారన్నారు. ఏప్రిల్ 1వ తారీకున మొత్తం 3,26,414 పించను దారులకు, రూ.77.16 కోట్లు పంపిణి చేయబడుతుందని పిడి తెలిపారు.
No comments:
Post a Comment