Followers

విపత్కర  పరిస్థితుల్లో  రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది




  • విపత్కర  పరిస్థితుల్లో  రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది

  • ఏప్రిల్ 1 న ఇంటి వద్దకే పించన్లు

  • లాక్ డౌన్ నేపథ్యం లో పేదలకు వెయ్యి రూపాయల ఆర్ధిక  సాయం


                  రేషన్ సరుకులను పంపిణి కార్యక్రమం లో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి


విజయనగరం, పెన్ పవర్ 


కారోనా వ్యాప్తి చెందకుండా  ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినందున ప్రజలంతా ఇంటివద్దనే ఉండి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి విజ్ఞప్తి చేసారు.   ప్రజల అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా  బాసటగా ఉంటుందని అన్నారు.   ఆదివారం విజయనగరం లో  22 వ వార్డ్ అవనాపువారి వీధి లోనున్న షాప్ నెంబర్ 8 లో  పౌర సరఫరాల ద్వార ఉచిత బియ్యం, కందిపప్పు  పంపిణి చేసారు.  అనంతరం  ఆమె మాట్లాడుతూ  కారోనా  ను నియంత్రించడానికి అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. ఐసోలేషణ్  వార్డులను,  వైద్యులను ఏర్పాటు చేయడం, పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేయడం జరుగుతోందన్నారు.   లాక్ డౌన్ ప్రకటించినందున నిత్యావసర సరకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.   పౌర సరఫరాల ద్వారా 1 కోటి 47 లక్షల కుటుంబాలకు లబ్ది చేకుర్చేలా   3 విడతలలో 3 నెలల రేషన్ సరుకులను అందజేయనున్నట్లు  తెలిపారు,  ఈ నెల 29 న, ఏప్రిల్ 15, 29 తేదీలలో  ఈ సరుకుల పంపిణి ఉంటుందని అన్నారు.  ఏప్రిల్ 1 న  జిల్లాలో 58  లక్షల మందికి వాలంటీర్ ల ద్వార  ఇంటి వద్దకే పించన్ అందజేయనున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ దృష్ట్యా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఏప్రిల్ 4 న  వెయ్యి రూపాయల ఆర్ధిక సాయాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.  కారోనా నియంత్రణ లో మన రాష్ట్రం దేశం లోనే ముందుందని, సచివాలయాల సిబ్బంది,  వాలంటీర్ లు  చిత్త శుద్ధి తో పని చేస్తున్నారని, అదే విధంగా మీడియా కూడా బాధ్యత యుతంగా పని చేస్తున్నారని అందరి సహకారం తోనే కరోనాను ఎదుర్కోగలమని అన్నారు.


హోల్ సేల్ దుకాణాలను తెరిపించాలి:   కూరగాయల వర్తకుల వినతి


       కూరగాయలు సరఫరాచేసే  టోకు వర్తకులు మూసివేసిన తమ దుకాణాలను తెరిపించాలని,  రైతులను  పోలీస్ లు అడ్డుకుంటున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు రోజుల్లో కాయగూరల సమస్య ను ఎదుర్కోవలసి ఉంటుందని ఉప ముఖ్య మంత్రి  పుష్ప శ్రీ వాణి, శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారి ద్వార వినతి పత్రాన్ని అందజేసారు.  ఆ వినతిని వెంటనే సంయుక్త  కలెక్టర్ జి.సి.కిషోర్ కుమార్ కు అందజేస్తూ ఈ విషయాన్ని  పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.    ఈ కార్యక్రమం లో రెవిన్యూ దివిజినల్ అధికారి కే.హేమలత, తహసిల్దార్ సత్యనారాయణ మూర్తి, జిల్లా పౌర సరఫరా అధికారి పాపా రావు తదితరులుపాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...