మధ్యవర్తులు మాటలు నమ్మవద్దు
రొయ్యలును గిట్టుబాటు ధరలకు విక్రయించాలి
మత్స్య శాఖ ఉప సంచాలకులు టి. సుమలత
విజయనగరం, పెన్ పవర్
కోవిడ్ – 19 (కరోనా) ప్రభావం వలన ఆక్వా రంగం నష్ట పోకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపడుతుందని మత్స్య శాఖ ఉప సంచాలకులు టి. సుమలత తెలిపారు. అందులో భాగంగా మత్స్య శాఖ అధికారులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ, సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతిదారులు సంఘం, ఆంధ్ర ప్రదేశ్ వారు సంయుక్తంగా రొయ్యలకు ఈ క్రింది విధముగా నిర్దిష్ట ధరలును నిర్ణయించారు.
క్రమ సంఖ్య | రొయ్యల సంఖ్య (కౌంట్ ఒక కేజీకి) | ధర(రూపాయలలో) |
1 | 30 | 430 |
2 | 40 | 310 |
3 | 50 | 260 |
4 | 60 | 240 |
5 | 70 | 220 |
6 | 80 | 200 |
7 | 90 | 190 |
8 | 100 | 180 |
ధరలు ఏప్రెల్ 14వ వరకు అమలులో ఉండునని, ఈ ధరలు కాకుండా వేరే ధరలుకు అమ్మినా, కొనుగోలు చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ధరలును సంబంధిత గ్రామ సచివాలయాలనందు ప్రదర్శించడమైనదని, రొయ్యల రైతులు ఆందోళన చెందకుండా, మధ్యవర్తులు మాటలు నమ్మకుండా రొయ్యలును గిట్టుబాటు ధరలకు అమ్మకం చేపట్టవలసినదిగా కోరారు.
No comments:
Post a Comment