Followers

 లాక్ డౌన్ తో  పరేషాన్ అవుతున్న  ఖాకీలు.


 


 లాక్ డౌన్ తో  పరేషాన్ అవుతున్న  ఖాకీలు.


స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)


 


లాక్ డౌన్  నిర్వహణలో  పోలీసులు   పరేషాన్ అవుతున్నారు.  రాత్రి పగలు  ఎండ వాన  లేకుండా  పికెటింగ్  చేస్తూ  ప్రజలకు  సేవలందిస్తున్నారు. కానీ  వారి  ఆరోగ్య పరిస్థితులు  వర్ణనాతీతంగా  మారాయి. బిపి  షుగర్  వంటి  వ్యాధిగ్రస్తుడైన 24*7 కరోనా  డ్యూటీ   చేయక తప్పడం లేదు.  కొందరు  అనారోగ్యం పాలవుతున్న  సందర్భాలు లేకపోలేదు. కరోనా  మహమ్మారి   నియంత్రణకు  కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  ప్రకటించింది. దీంతో  అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.లాక్ డౌన్  పకడ్బందీగా  అమలు జరగాలంటే  పోలీసుల పాత్ర తప్పనిసరి. 24వ తేదీ నుంచి లాక్ డౌన్  అమలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రజలు  సామాజిక  భద్రత  పాటించకపోవడంతో కరోనా  అదుపునకు  పోలీస్  ఉన్నతాధికారులు  చర్యలు పటిష్టం చేశారు. దీంతో  పోలీసులు   ప్రధాన కేంద్రాల వద్ద  పహారా   కాస్తున్నారు.కరోనా వైరస్ కు  ప్రజలు దూరంగా ఉండాలని  హెచ్చరికలు జారీ చేస్తూ  రోడ్లపై కాపలా కాస్తున్నారు. ప్రమాదకరమైన వైరస్ మహమ్మారి  ఎక్కడ ఎలా  సోకుతుందొ  అన్న భయం కూడా  లేకుండా  ప్రజల కోసం  పాటుపడుతున్న. కొందరు  అనారోగ్యం పాలవుతున్నారు సంఘటనలు లేకపోలేదు. శనివారం  జిల్లాలోని  గాజువాక  ప్రాంతంలో  విధులు నిర్వహిస్తున్న  ఒక  పోలీస్  సొమ్మసిల్లి  పడిపోయారు.  తోటి పోలీస్ మాత్రమే  సపర్యలు  చేయగలిగారు.  ప్రజల కోసం  ప్రాణాంతక వైరస్ ని  తరిమికొట్టాలని  అహర్నిశలు  కృషి చేస్తున్న  పోలీస్ అన్నకు  షెల్యూట్.


ప్రజలు నిబంధనలు అతిక్రమించరాదు

రావికమతం పెన్ పవర్....






    రావికమతం మండలం కొత్తకోట గ్రామం లాక్ డౌన్ అమల లో ఉన్నందున వల్ల ప్రజలు  ఇంటి కే పరిమితం కావాలని కొత్తకోట సీఐ లక్ష్మణ మూర్తి ఈ సందర్భంగా తెలిపారు. కేసులు నమోదు చేయబడతాయి అని తెలిపారు. ఈ సందర్భంగా షాపులు మరియు కూరగాయల దుకాణాలు నిర్ణీత ధరలకే అమ్మాలని లేనిచో వారిపై చట్టరీత్యా కేసు నమోదు పడతాయని తెలిపారు. ఇదే సమయంలో ఆజ్ఞలు అతిక్రమించిన ద్విచక్రవాహనాలు సర్కిల్ పరిధిలో 57 కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

 






 లాక్ డౌన్ కాలంలో ఇంటివద్దకే నిత్యావసర వస్తువుల పంపిణీ

 లాక్ డౌన్ కాలంలో ఇంటివద్దకే నిత్యావసర వస్తువుల పంపిణీ


విశాఖపట్నం, పెన్ పవర్


కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఏప్రిల్ 14 వతేది వరకు రాష్ట్రంలో “లాక్ డౌన్” చర్య చేపట్టారు. లాక్ డౌన్ కాలంలో జివిఎంసి పరిధిలో గల గృహ వినియోగదారుల సౌకర్యార్ధం పట్టణంలో ప్రఖ్యాతగాంచిన నిత్యావసర వస్తువుల అమ్మకపు సంస్థలు అయిన రిలియన్స్, మోర్ స్టోర్స్, హెరిటేజ్, స్పెన్సర్ మరియు బిగ్ బాస్కెట్ వంటి సంస్థల యాజమాన్యం వర్గాలవారు వినియోగదారుల ఫోను ద్వారా గాని వాట్సాఫ్ మే సేజ్ ద్వారా గాని వస్తువుల డిమాండ్ పంపించినచో నిత్యావసరవస్తువులు ఇంటివద్దకే నేరుగా పంపిణీ చేయుటకు అంగీకరించారని జివిఎంసి డిప్యూటికమిషనర్ ఫణిరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. జివిఎంసి పరిధిలోగల నిత్యావసరవస్తువుల పంపిణీ చేసే సంస్థలు పేర్లు, సిబ్బంది పేర్లు, ఫోన్ నెంబర్లు తెలిపే పట్టికను ఇందుతో తగు సమాచారం నిమిత్తం జతపరిచియున్నారు.


కారోనా  వ్యాప్తి నివారణకు కఠిన చర్యలు తప్పవు



కారోనా  వ్యాప్తి నివారణకు కఠిన చర్యలు తప్పవు


విదేశాల నుండి వచ్చిన వారిపై  ప్రత్యెక దృష్టి


నిత్యావసరాల  సరఫరా  సాఫీ గా జరగాలి


జిల్లా కలెక్టర్  మరియు కార్పొరేషన్  ప్రత్యెక అధికారి హరి జవహర్ లాల్


లాక్ డౌన్ పరిస్థితుల్ని  అదుపులో ఉంచడం లో పోలీస్ కీలకం


 రేషన్ కార్డు లేని వారికీ బియ్యం  సరఫరా


 అనాధలకు అన్నదానం చేయడానికి సిద్ధం


విజయనగరం  శాసన సభ్యులు కోలగట్ల


 


        విజయనగరం, పెన్ పవర్ 


జిల్లాలో కారోన వ్యాప్తి  నివారించడానికి అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్  మరియు కార్పొరేషన్  ప్రత్యెక అధికారి  డా. హరి జవహర్ లాల్ తెలిపారు.  జిల్లాలో టాస్క్ ఫోర్సు కమిటీ లను వేయడంతోపాటు   కరోనా  పై ఇప్పటికే పారా మెడికల్ సిబ్బందికి, అంగన్వాడి, ఆశ, మహిళా సంఘాల సభ్యులకు కోవిడ్-19 పై శిక్షణలు పూర్తి చేశామని పేర్కొన్నారు  బ్యానర్లు, పోస్టర్లు హోర్డింగ్లు, టామ్ టామ్ ద్వార గ్రామాలలో, పట్టణాలలో విస్త్రుతంగా ప్రచారం చేయడం జరిగిందని అన్నారు. లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు  సామజిక దురాన్ని పాటించేలా అన్ని చర్యలను తీసుకున్నామన్నారు.


        రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు నియోజకవర్గం స్థాయి లో కారోణా పై సమీక్షించి, ప్రజల లో ధైర్యాన్ని నింపాలని,  ఎదుర్కోడానికి  సన్నద్ధం చేయాలని ఆదేశించిన దృష్ట్యా శనివారం మున్సిపల్ కార్యాలయం లో విజయనగరం నియోజక వర్గంకు సంబంధించిన  అధికారులతో కార్పొరేషన్  ప్రత్యేకాధికారి హోదాలో శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామితో కలసి  కలెక్టర్  సమీక్షించారు.  ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ  జిల్లాకు  విదేశాల  నుండి   476  మంది   వచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వ నివేదిక అందిందని, అందులో 145 మంది విజయనగరం  నియోజక వర్గానికి చెందిన వారె ఉన్నారని, వారిలో 15 మంది వివరాలు తెలియలేదని మిగిలిన 130 మందిని  క్వారెంటైన్  లో ఉంచడం జరిగిందని అన్నారు.   వారి పై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతోందని  అన్నారు. వీరిలో 7 రోజుల లోపు ఉన్నవారు 18 మంది కాగా, 7 నుండి 14 రోజుల లోపు వారు 40 మంది ఉన్నారని,   క్వరెంటైన్ లో ఉన్న వీరిలో 50 ఏళ్ళు దాటిన  ప్రతి ఒక్కరికి ఒక వైద్యున్ని నియమిస్తున్నట్లు తెలిపారు.   ముఖ్యంగా హై రిస్క్ ఉన్న దేశాలనుండి వచ్చిన వారిని నిర్బంధంగా ఉంచాలని,  ఇంకొకరికి వ్యాపించకుండా కట్టడి చేయాలనీ అన్నారు. మందు లేదు కనుక  కఠినంగ ఉండక తప్పదన్నారు.


        లాక్ డౌన్ ఉన్నందున నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా చూడాలని  అందుకోసం శాఖల మధ్య సమన్వయం తో పాటు పోలీస్ అధికారుల సహకారం  చాలా  అవసరమని పేర్కొన్నారు.   టోకు వ్యాపారులు , మామిడి వర్తకులు, స్వచ్చంద సంస్థలు లాక్ డౌన్ నుండి వెసలుబాటు కల్పించమని కోరుతున్నారని,  అయతే కోవిడ్ నిబంధనలకు విఘాతం కలగకుండా ఉండేలా సడలించడం జరుగుతుందని స్పష్టం చేసారు.  తాగు నీటి కోసం స్థానిక శాసన సభ్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నందున, ఈ ఏడాది నీటి సమస్య తలెత్తక పోవచ్చునని అన్నారు.   కార్పొరేషన్ సిబ్బంది పారిశుధ్యం పై కూడా దృష్టి పెట్టాలని  నీరు  కాలుష్యం  కాకుండా క్లొరినేషన్ చేయాలన్నారు.


లాక్ డౌన్ పరిస్థితుల్ని  అదుపులో ఉంచడం లో పోలీస్ కీలకం : కోలగట్ల


కరోన వ్యాప్తిని కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రజలు సామజిక దూరాన్ని పాటించడంలో  సహకరిస్తున్నారని, అందులో పోలీస్ పాత్ర కీలకమని విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు.  సామజిక బాధ్యతగా భావించి పోలీస్, ప్రజలు సహకరిస్తున్నందుకు అభినందనలు తెలుపుతూ, పరిస్థితులు చక్క బడే వరకు ఇంకా  జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. అగ్ర రాజ్యాలె కరోణా  ధాటికి  విలవిలలాడి పోతున్నాయని, మనం మరింత జాగురూకత వహించాల్సిన సమయమని అన్నారు.  మన దేశంలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చాల అవసరమని,  దీని కోసమే సామజిక  దూరాన్ని పాటించాలని ప్రతిఒక్కర్ని కోరుతున్నామని తెలిపారు.  ప్రజలు  నిత్యావసరాల కోసం గుమిగూడి ఉండకుండ  బజార్లను వికేంద్రీకరించి, సంఖ్య పెంచడం జరిగిందని, ఎక్కడి వారు అక్కడే కొనుగోలు చేసే ఏర్పాట్లను చేసామని అన్నారు.  ప్రతి కుటుంభానికి  సరిపడే వస్తువులు అందుబాటు లో ఉంచాలని,  భవిష్యత్ లో ఎలాంటి పరిస్థితి వస్తుందో  వుహించాలేమని  అన్నారు.   ప్రస్తుతం రైతు బజార్లు ఉదయం 6 నుండి 1 గంట వరకు ఉంటున్నాయని, ఇక పై వాటిని 11 గంటలకే మూసి వేయడం  ద్వార సామజిక దురాన్ని పెంచేలా చూడాలని కోరారు.  రేషన్ కార్డులు ఉన్న వారికి  ప్రభుత్వమే రేషన్ ఇస్తుందని, లేని వారికీ తను అందిస్తానని అన్నారు.  వార్డ్ వారీగా రేషన్ కార్డులు లేని వారి జాబితాను ఇవ్వాలని తహసిల్దార్ ను కోరారు.  ప్రజా సేవ చేయడానికి ఎల్లవేళలా ముందుంటానని, ఎప్పుడు ఏ అవసరం వచ్చిన తనకు చెప్పాలని అధికారులకు చెప్పేరు.  పేదలు, అనాధలకోసం, యాచకుల కోసం  భోజన ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.   పైడితల్లి గుడి వద్ద, పంచ ముఖ ఆంజనేయ గుడి, వాసవి కన్యకా పరమేశ్వరి గుడి వద్ద  భోజనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశం లో మున్సిపల్ కమీషనర్ ఎస్.ఎస్.వర్మ ,  మార్కెటింగ్ ఎ.డి.  శ్యాం కుమార్, తహసిల్దార్ సత్యనారాయణ మూర్తి,  హెల్త్ ఆఫీసర్ డా. ప్రణీత , పోలీస్ తదితర శాఖల  అధికారులు హాజరైనారు.


పరిశ్రమల వారు లాక్ డౌన్ నిబంధనలను పాటించాలి


పరిశ్రమల వారు లాక్ డవున్ నిబంధలను పాటించాలి


   సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి

              పరవాడ పెన్ పవర్

పరవాడ:మండలం లో ఉన్న పరిశ్రమల యజమానులు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డవున్ నిబంధనలను పాటించాలి సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యన్నారాయణ డిమాండ్ చేశారు.శనివారం నాడు కరోనా కారణంగా గనిశెట్టి ప్రెస్ వారికి ప్రెస్ నోట్ ద్వారా వివరాలు అందించారు.దేశంలో ఉన్న ప్రజలంతా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వ్యక్తిగత దూరం పాటించండి అని ఇటు ప్రభుత్వాలు,ఆరోగ్య శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు పెద్దఎత్తున ప్రచారం చేస్తుంటే కంపెనీ యాజమాన్యాలు మాత్రం తమ ఉద్యోగులను మాత్రం వ్యక్తిగత దూరం లేకుండా అధిక సంఖ్యలో వారిని బస్సులో తీసుకు వస్తున్నాయి అని ఆరోపించారు.కంపెనీల వారి ఈ నిర్లక్ష్య వ్యవహారంతో చుట్టు పక్కల గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు అని అన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులతో పనులు చేయించు కోవాలి అంటే వారిని కంపెనీ లోపలే ఉంచి పని చేయించుకోవాలి అని కరోనా వైరస్ తగ్గిన తరువాతే వారిని బయటికి వదలాలి అని అలా కాకుండా వారిని బయటకు పంపిస్తే వారి వల్ల కరోనా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ ఉంది అని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు అని గనిశెట అన్నారు.కోన్ని కంపెనీ యాజమాన్యాలు 25 గురు పట్టే బస్సులో 10 మందినే తీసుకు వతున్నాయి అని వారికి బస్సులోనే మాస్కులు,సాని టైజర్ స్ప్రే చేస్తూ వారిని ఇంటిదగ్గర దింపే ముందు కూడా స్ప్రే చేస్తూ తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు అలాంటి యాజమాన్యం ఎంతో అభినందించ దగిన వారు అని అన్నారు.టొరంటో,ర్యాక్స్ కంపెనీ ల వారు వందల సంఖ్యలో కార్మికుల తో పని చేయించడం మంచిది కాదు అన్నారు.ఈ రెండు కంపెనీల వారు ఎటువంటి సానిటరీ భద్రతలు పాటించడం లేదు అని అన్నారు.తాడి,తాణాo,లంకెలపాలెం,పరవాడ, సాలాపువాని పాలెం,గ్రామాలకు చెందిన కార్మికులు ఫార్మా కేంద్రంలో బల్క్  కంపెనీలకు కూడా పనులకు వెల్లడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు అని అన్నారు.144 ఫోర్ సెక్షన్ అమలులో ఉండగా చుట్టు ప్రక్కల గ్రామలనుండి ఇంతమంది కార్మికులు ఎలా తిరుగుతున్నారు అని ప్రశ్నించారు.కరోనా బారినుండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడటానికి కoపెనీల యాజమాన్యాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేసారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి, పోలీసు శాఖ సిబ్బందికి, స్థానిక ప్రభుత్వరంగ సిబ్బందికి,ఆశా వర్కర్లకు,పారిశుధ్య కార్మికుల కు ప్రభుత్వం సత్వరమే మాస్కులు, శాని టైజర్స్,మెడికల్ కిట్లు తగినన్ని పంపిణి చేయాలి అని డిమాండ్ చేశారు.ప్రజల్లో ఎవరిమీద అన్నా అనారోగ్య తో అనుమానం వచ్చినపుడు వారి రక్తాన్ని సేకరించడానికి తగిన సామగ్రిని ప్రభుత్వం సమకూర్చాలి అని డిమాండ్ చేశారు.ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు వాలంటీర్ల ద్వారా ఇళ్లకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి అని గనిశెట్టి సత్యన్నారాయణ అన్నారు.

అన్నార్తులకు అపన్నహస్తం : రెడ్ క్రాస్


శ్రీకాకుళం, పెన్ పవర్ 





 కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి  నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా లెప్రసీ కాలనీలో గల కుష్టు వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు లేకపోవడం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి విజ్ఞప్తి మేరకు సివి నాగజ్యోతి ఛారిటబుల్ సొసైటీ వారు సుమారుగా 8000 రూపాయల విలువ గల నిత్యవసర సరుకులు ఆయిల్ టిన్, చింతపండు, కందిపప్పు మొ. నవి  శనివారం  సాయంత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ పి.జగన్ మోహన్ రావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ నూక సన్యాసిరావు గారు, రెడ్ క్రాస్ వలంటీర్లు ఉమా శంకర్, కృష్ణ, మదీనా పాల్గొన్నారు.


 




 

 


చీరాలలో ఇద్దరికి కారోనా పాజిటివ్

 



చీరాల, పెన్ పవర్


ప్రకాశంజిల్లా చీరాల లో కరోనా వైరస్ కలకలం రేపింది. స్దానిక నవాబుపేట చెందిన ఓ వ్యక్తి ఈనెల 17 తేదీన ఢిల్లీ నుండి విజయవాడ చేరుకొని విజయవాడ నుండి జనాశతాబ్ది రైల్లో చీరాల చేరుకున్నాడు.వచ్చిన దగ్గరనుండి దగ్గు,జలుబుతో బాధపడుతున్నాడు. ఆయన భార్యకు కూడా  దగ్గు జలుబు ఆయాసంతో బాధ పడుతుంది, వీరికి కారోనా అనే అనుమానం తో గత రెండు రోజుల క్రితం చీరాల ప్రభుత్వ వైద్య శాల డాక్టర్లు పరిశీలించిన అనంతరం కొవిడ్-19 లక్షణాలు కనిపించడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. వారి రక్తనమూనాలను కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం విజయవాడ పంపారు.అయితే శనివారం మధ్యాహ్నం విజయవాడ వైద్యులు వారికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. చీరాలలో రెండు కేసులు నిర్ధారణ కావడంతో పోలీసులు ఈ రాత్రి నుండి ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేసి ప్రజలు ఎవ్వరూ అనవసరంగా బయట తిరుగ కుండా పటిష్టమైన చర్యలు చేపడతామని డియస్పీ జయరామ సుబ్బారెడ్డి తెలిపారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...