Followers

తిన్నింటివాసాలు లెక్కించిన రాయవరం ఎక్సైజ్ సిఐ రెడ్డి త్రినాథ్


 


 


 రూ.2 లక్షల అక్రమ మద్యాన్ని పట్టుకున్న స్థానికులు


అన్నం పెట్టే ప్రభుత్వానికి కన్నం లక్షల్లో సొమ్ము చేసుకున్న వైనం


సిఐ ఆదేశాలతో తరలిస్తున్నామన్న షాపు సూపర్వైజర్


ధర్నాకు దిగిన వైసీపీ నేతలు


గతంలోనే సిఐ వ్యవహారంపై పెనపవర్ లో కథనం


ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక సమర్పణ


సిఐని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు సూచించిన ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి


(పెన్ పవర్, అనపర్తి)


తిన్నింటి వాసాలు లెక్కించే వారిని చాలా అరుదుగా మనం చూస్తుంటాం. అలాంటి సంఘటన జిల్లాలోని అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలోని మారుతీనగర్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. అక్రమంగా సుమారు లక్ష రూపాయల మద్యాన్ని, రాయవరం ఎక్సైజ్ సిఐ ఆదేశాలతో  తరలిస్తున్న కార్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఒక్క సారిగా సిఐ రెడ్డి త్రినాథ్ భాగోతం వెలుగుచూసింది. మద్యం అక్ర్రమంగా తప్పిస్తున్న కార్లలో సుమారు రూ.2 లక్ష మేర సరుకు ఉన్నట్లు తెలుస్తుంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవవద్దని గట్టి సూచనలు చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇలంటి అక్రమ అధికారులతో... నిజాయతీగా పని చేసే అధికారులు సైతం ప్రజల నుంచి, ప్రభుత్వం నుంచి మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా ఉద్యోగం ఇచ్చిన యజమానికి కన్నం వేయాలంటే సవా లక్ష ఆలోచిస్తారు. కాని మన సిఐ మాత్రం తనకు అన్నం పెట్టి, ఉద్యోగం చూపిన ప్రభుత్వానికే కన్నం వేసేందుకు నడుం బిగించారు. తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల రూపాయల మద్యాన్ని తన స్నేహితుల ద్వారా బయటకు తరలించి లక్షలు సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్థులు తెలిపారు. ఈ భాగోతం గత వారం రోజులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే గ్రామస్థులు పక్కా సమాచారంతో పట్టుకుని అటు ఉన్నతాధికారులకు, ఇటు స్థానిక శాసనసభ్యులు కు సమాచారం చేరవేశారు. దీంతో ఉన్నతాధికారులు వచ్చే లోపుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మీడియా కూడా ఒక్క సారిగా అక్కడకు చేరుకోవడంతో తప్పించుకోవాలనుకున్న సిఐ పీకల్లోతు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు. పట్టుపడ్డ షాపు సూపర్ వైజర్ లు కూడా తమకే పాపం తెలియదని, సిఐ ఆదేశించడంతోనే తాము ఈ సరుకు అంతా బయటకు తరలిస్తున్నామని మీడియా ముందు వివరించారు. గతంలో పెన పవర్ దిన పత్రికలో సైతం సిఐ వ్యవహారాలపై పలు కథనాలు ప్రచురించాము. ఆ సమయంలో ఏకంగా మీడియాపైనే ఆయన తప్పుడు నివేదికలు ఉన్నతాధికారులకు అందజేశారు. గ్రామంలోని వైసీపీ నాయకులు రోడ్డుపైకి చేరి ధర్నాకు దిగారు. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఉన్నతాధికారులకు ఆయన అక్కడ నుంచే ఫోన్ చేసి వెంటనే రాయవరం సిఐ ని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. వాస్తవానికి గత వారం రోజులుగా ఆయన పరిధిలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను ఉన్నతాధికారులు ఒక సారి పరిశీలిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేకపోలేదు. లాక్ డౌన్ నేపథ్యంలో లక్షలకు లక్షలు అక్రమంగా సిఐ సంపాదించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు సిఐ పై చర్యలు తీసుకోవడంతో పాటు షాపులు మూసివేసిన రోజు నుంచి నేటి వరకు ఆయన పరిధిలోని షాపుల్లోని సరుకును ఒక సారి తనిఖీ చేస్తే మరిన్ని వాస్తవాలు తెలియవచ్చు.


విపత్కర  పరిస్థితుల్లో  రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది




  • విపత్కర  పరిస్థితుల్లో  రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది

  • ఏప్రిల్ 1 న ఇంటి వద్దకే పించన్లు

  • లాక్ డౌన్ నేపథ్యం లో పేదలకు వెయ్యి రూపాయల ఆర్ధిక  సాయం


                  రేషన్ సరుకులను పంపిణి కార్యక్రమం లో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి


విజయనగరం, పెన్ పవర్ 


కారోనా వ్యాప్తి చెందకుండా  ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినందున ప్రజలంతా ఇంటివద్దనే ఉండి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి విజ్ఞప్తి చేసారు.   ప్రజల అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా  బాసటగా ఉంటుందని అన్నారు.   ఆదివారం విజయనగరం లో  22 వ వార్డ్ అవనాపువారి వీధి లోనున్న షాప్ నెంబర్ 8 లో  పౌర సరఫరాల ద్వార ఉచిత బియ్యం, కందిపప్పు  పంపిణి చేసారు.  అనంతరం  ఆమె మాట్లాడుతూ  కారోనా  ను నియంత్రించడానికి అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. ఐసోలేషణ్  వార్డులను,  వైద్యులను ఏర్పాటు చేయడం, పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేయడం జరుగుతోందన్నారు.   లాక్ డౌన్ ప్రకటించినందున నిత్యావసర సరకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.   పౌర సరఫరాల ద్వారా 1 కోటి 47 లక్షల కుటుంబాలకు లబ్ది చేకుర్చేలా   3 విడతలలో 3 నెలల రేషన్ సరుకులను అందజేయనున్నట్లు  తెలిపారు,  ఈ నెల 29 న, ఏప్రిల్ 15, 29 తేదీలలో  ఈ సరుకుల పంపిణి ఉంటుందని అన్నారు.  ఏప్రిల్ 1 న  జిల్లాలో 58  లక్షల మందికి వాలంటీర్ ల ద్వార  ఇంటి వద్దకే పించన్ అందజేయనున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ దృష్ట్యా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఏప్రిల్ 4 న  వెయ్యి రూపాయల ఆర్ధిక సాయాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.  కారోనా నియంత్రణ లో మన రాష్ట్రం దేశం లోనే ముందుందని, సచివాలయాల సిబ్బంది,  వాలంటీర్ లు  చిత్త శుద్ధి తో పని చేస్తున్నారని, అదే విధంగా మీడియా కూడా బాధ్యత యుతంగా పని చేస్తున్నారని అందరి సహకారం తోనే కరోనాను ఎదుర్కోగలమని అన్నారు.


హోల్ సేల్ దుకాణాలను తెరిపించాలి:   కూరగాయల వర్తకుల వినతి


       కూరగాయలు సరఫరాచేసే  టోకు వర్తకులు మూసివేసిన తమ దుకాణాలను తెరిపించాలని,  రైతులను  పోలీస్ లు అడ్డుకుంటున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు రోజుల్లో కాయగూరల సమస్య ను ఎదుర్కోవలసి ఉంటుందని ఉప ముఖ్య మంత్రి  పుష్ప శ్రీ వాణి, శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారి ద్వార వినతి పత్రాన్ని అందజేసారు.  ఆ వినతిని వెంటనే సంయుక్త  కలెక్టర్ జి.సి.కిషోర్ కుమార్ కు అందజేస్తూ ఈ విషయాన్ని  పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.    ఈ కార్యక్రమం లో రెవిన్యూ దివిజినల్ అధికారి కే.హేమలత, తహసిల్దార్ సత్యనారాయణ మూర్తి, జిల్లా పౌర సరఫరా అధికారి పాపా రావు తదితరులుపాల్గొన్నారు.


నూతన ఓరవడితో యువత ముందడుగు




 


నూతన ఓరవడితో యువత ముందడుగు 


పుట్టినరోజు వేడుకల్లో పలు సేవాకార్యక్రమాలు


144 సెక్షన్,కర్ఫ్యూలో విధులు నిర్వహిస్తూన్న సిబ్బందికి సహాకారం


పెన్ పవర్,శివ సేన పార్టీల అధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు


స్వయంఉపాది, సేవ లక్ష్యంగా అదర్శభావాలు


గాజువాక (పెన్ పవర్)


 


కరోనా మహామ్మారికి ప్రపంచం జనజీవనాన్ని అతలాకుతలం చేయడం విచారకరం. ప్రపంచ దేశాలు ఏకత్రాటిపై నడుస్తున్న వైనం అభినందనీయం. 196 దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో శాస్త్రవేతలను, వైద్యనిపుణులను కలవరపాటుకి గురిచేస్తూంది. వ్యాదికి తగిన వ్యాక్సిన్లు కై వైద్యనిపుణులు కఠోరంగా శ్రమిస్తున్నారు.వైరస్ నిర్మూలనకై ఐక్యరాజ్యసమితి పలు ప్రణాళికలు రూపొందించింది. ప్రపంచ దేశాలకు పలు సూచనలు , సలహాలను విశదీకరించడం జరిగింది. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం , లా డౌనను విధిగా పాటించాలని కోరింది. ఉద్యోగులు, కార్మికులు,స్వయం ఉపాది కలిగిన వారు ,దేశ పౌరులు, విద్యార్థులు విధిగా గృహాలకే పరిమితం కావాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్చంద యావత్ దేశం మొత్తం ఎప్రిల్ 14 వరకు లాక్ డౌన్ పాటిస్తూ దేశఔన్యత్యాని చాటిచెబుతున్న భారతీయులు, ప్రపంచ దేశాలకు అదర్శప్రాయం నిలిచింది. నిత్యావసర సరుకులకు ,అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం సడలించడంతో దేశవాసులకు ఉపసమనం కలిగింది. కర్తవ్యదీక్షను బూనిన పోలీసు సిబ్బంది 24 గంటలు కటుంబసభ్యులను సైతం వదలి విధులు నిర్వహిస్తూ, ప్రజలు యోగక్షేమాలకై చేస్తున్న కృషి అభినందనీయం. పెన్ పవర్ టీం, శివ సేన పార్టీ అధ్వర్యంలో మణికంఠ తన పుట్టిన రోజు శనివారం పోలీసు సేవలకు గాను తమ వంతు సహాకారంగా వాటర్ బాటిల్స్, బిస్కట్ పేకెట్లను అందజేశారు. యువత చేస్తున్న కార్యక్రమాలను పలువురు అభినందనలు తెలిపారు. 144 సెక్షన్ అమలు కారణంగా అనాధలుకు, పేదలకు


త్రాగు నీటి ఎద్దడి సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకోండి



 

రంపచోడవరం పెన్ పవర్:

 

గిరిజన ప్రాంతాలలో వేసవిలో త్రాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నం కాకుండా వేసవి కార్యాచరణ ప్రణాళికలు సమర్ధవంతం పరిచి గిరిజనులకు పూర్తిగా దాహార్తిని తీర్చాలని ఐ టి డి ఎ పి.ఓ నిశాంత్ కుమార్ గ్రామీణ త్రాగునీటి సరఫరా ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఐటిడిఎ కార్యాలయం లో వేసవి కార్యాచరణ ప్రణాళికలు అమలు తీరును ఆయన ఆ శాఖ ఇంజనీర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధులు మండలాలకు, పంచాయతీలకు విడుదల కాబడ్డాయని, మండలాలకు విడుదలైన నిధులతో ఆయా పరిధిలోని చేతి పంపులు రిపేర్లు, మెటీరియల్ కొనుగోలుకు మెకానిక్, మొబైల్ వాహనాల కొరకు ప్రతిపాదనలు సిద్ధంగా చేసి వెంటనే అనుమతులు పొంది ఆయా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. చేతి పంపులు ఫ్లసింగ్, వివిధ రకాలు స్కీములు నిర్వహణ, స్పేర్ పార్ట్స్ అవసరతలు గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కోరాలి అన్నారు. ఇరిగేషన్ శాఖ వారి ఆయకట్టు పరిధిలోని గ్రామాలలో మంచినీటి స్టోరేజ్ చెరువులను వేసవి కార్యచరణ అమలుకు ముందుగా నింపుకోవాలని ఆదేశించారు. ఆయా స్కీమింగ్ వర్కింగ్ కండిషన్లు విశ్లేషించి వాటికి రిపేర్లు అవసరతను గుర్తించి ప్రతిపాదనల ద్వారా వాటిని చేపట్టాలన్నారు. నీటి కొరత ఉన్న చోట్ల ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనుల క్షేత్రాలలో వేసవి కార్యాచరణ ప్రణాళికలు పూర్తిస్థాయిలో కూలీలకు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాలకు విదేశాల నుంచి ఎవరైనా తిరిగి వచ్చిన ఎడల వారిని ముందుగానే గుర్తించి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయో లేదో వైద్యుల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి వారిని క్వారం టైన్ కేంద్రాలలో 28 రోజులు పాటు వైద్యపరంగా పర్యవేక్షణ కొరకు ఉంచాలని ఆదేశించారు. ఏఎన్ఎం లు ఆశాలు వారి పరిధిలోని విదేశాల నుంచి వచ్చి క్వారం టైన్ ఉన్నవారిని రోజులో రెండు పర్యాయాలు వారి యోగక్షేమాలు గురించి ఆరా తీసి వైద్యులు ద్వారా తదాగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి 15 మంది వచ్చారన్నారు. చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా చర్యలు చేపట్టాలని ఎట్టిపరిస్థితులలోనూ ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఎవరిని అనుమతించరాదని హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలలో కూడా క్వారం టైన్ ఉన్నవారికి ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. హోమ్ క్వారం టైన్ ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిత్యవసర వస్తువులు కొనుగోలు కొరకు బయటకు రాకుండా గ్రామ వాలంటీర్లు ద్వారా నిర్దేశిత సామాజిక దూరాలు పాటిస్తూ సరఫరా చేయాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా ప్రస్తుత పరిస్థితులలో సామాజిక దూరం పాటించడమే శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, ఆర్డబ్ల్యూఎస్ డి ఈ లు నాగ వెంకట పద్మనాభం, రవీంద్ర బాబు, ఇంజనీర్లు రాజు, హరి రామ కృష్ణ, ఏ డి ఎం హెచ్ ఓ డాక్టర్ బి.వినోద్ కుమార్, మెడికల్ అధికారి జి రాజ్ కుమార్, ఎంపీడీవో లక్ష్మారెడ్డి, తాసిల్దార్ కే లక్ష్మి కళ్యాణి, డివిజినల్ చాయతీ అధికారి హరి, తదితరులు పాల్గొన్నారు.


రాజారత్న బార్ పై సోదాలు



మండపేట, పెన్ పవర్ 



కరోనా వైరస్ కారణంగా మండపేట లో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లను, మద్యం దుకాణాలను అధికారులు పూర్తిగా నిషేధించారు. శనివారం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండపేట విచ్చేసి కూరగాయల మార్కెట్ తో పాటు పలు ప్రాంతాలు పర్యటన జరిపారు. మండపేట లో పరిస్థితిని తెలుసు కోడానికి ప్రజల స్పందన తదితర అంశాల పై మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశం మధ్యలో పట్టణంలో మద్యం అమ్మకాలు రహస్యంగా సాగుతున్నాయని బోస్ దృష్టికి తీసుకువచ్చారు.  బోస్ స్పందిస్తూ ఆ బార్ కి వెళ్లి  సోదాలు జరపమని ఆదేశించారు. దీంతో కమిషనర్ త్రిపర్ణ  రామ్ కుమార్ టీపీఎస్ కట్టా వీరబ్రహ్మం, శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఇతర సిబ్బందిని వెంట బెట్టుకుని రాజారత్న బార్ ను తనిఖీ చేశారు. బార్ తలుపులు మూసి వేయడంతో చుట్టూ ఉన్న గార్డెన్ , వంటశాల, లూజు న అమ్మే కౌంటర్ లను పరిశీలించారు. అక్కడ ఎటువంటి మద్యం బాటిల్స్ కనపడలేదు. ఈలోగా బార్ నిర్వాహకులు ఊలపల్లి ప్రసాద్, బొడ్డు రామకృష్ణలు బార్ వద్దకు వచ్చారు. వారిని కమిషనర్ రామ్ కుమార్ ప్రశ్నించారు. తాము అయితే  బార్ ని ఎట్టి పరిస్థితిలో తెరవ లేదని కమిషనర్ కు సమాధానం ఇచ్చారు. తెరవకుండా మద్యం క్వార్టర్ బాటిల్ ఎలా వచ్చింది అని కమిషనర్ అడగ్గా ఇది ఎవరో కావాలని చేసిన పని తప్పా తాము అయితే అమ్మలేదని చెప్పారు. మద్యం బాటిల్ ఇక్కడే కొన్నట్టు సమాచారం ఉందని  తాను దీనిపై నివేదిక సిద్ధం చేసి జిల్లా కలెక్టరుకు ఫైల్ అందజేస్తాను అని కమిషనర్  అక్కడి నుండి కార్యాలయానికి వచ్చేశారు.


లాక్ డౌన్ నిష్ప్రయోజనం అవుతుందా?







- మినహాయింపు సమయమే  కారణం 

- ప్రభుత్వం, అధికారులు ,పోలీసులు పక్కా పర్యవేక్షణ 

- సమస్యల్లా సామాన్య జనంలో లోపిస్తున్న అవగాహన 

 

 అనకాపల్లి, పెన్ పవర్ 

 

కరోనా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించేది. జాగ్రత్తగా లేకపోతే అందరి చావుకు కారకంగా నిలిచే అవకాశాలు లేకపోలేదంటూ  ప్రభుత్వం ఓవైపు మొత్తుకుంటూనే ఉంటుంది. ఇళ్లకే పరిమితమవండి అంటూ లాక్డౌన్ ను కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ వైపు పలుశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఎండనకా వాననక పనిచేస్తూనే ఉన్నారు. పోలీసులు నిరంతర పర్యవేక్షణలో ఉంటూనే  ఉన్నారు. కానీ ఏమి లాభం. నిత్యావసర సరుకుల కోసం అంటూ ఇచ్చిన మినహాయింపు సమయం ప్రజల భద్రతకు, ప్రభుత్వ లక్ష్యానికి భంగం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

 

      నిత్యావసర సరుకుల కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం మినహాయింపు సమయాన్ని ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చారు. ఇస్తూనే సామాజిక దూరాన్ని కూడా  తప్పక పాటించాలని కూడా సూచనలు చేస్తున్నారు. రాజకీయ ప్రముఖులు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సలహాలిస్తునెే ఉన్నారు. కానీ అది ఏ మేరకు సత్ఫలితాన్ని ఇస్తుందో అన్నదే ఇక్కడ ప్రశ్న.  అవగాహన ఉన్నా కొందరు అవగాహన లేక మరికొందరు మార్కెట్లకు ఇబ్బడి ముబ్బడిగా వస్తూనే ఉన్నారు. ఎక్కడో చోట గుమి గుూడుతూనే  ఉన్నారు. దీంతో కరోనా వ్యాధి చైన్ కు   బ్రేక్ వేయాలనె లక్ష్యానికి ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల మాట. 

 

      ప్రభుత్వం పరంగా మార్కెట్ ను వికేంద్రీకరణ చేశారు. సామాజిక దూరానికి తగ్గట్లు చర్యలు కూడా తీసుకున్నారు. కానీ ప్రజల నుంచి వచ్చే స్పందన అంతంతగానెే ఉండటంతో  చిత్తశుద్ధితో లాక్డౌన్ లో పాటించేవారు కూడా  పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా అధికారుల పరంగా ఎంత చేస్తున్న ఈ మినహాయింపు సమయంతో ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. గుమిగూడే జనంతో  ఏ సమస్య వచ్చినా అక్కడి నుంచి మరొకరికి మరొకరి నుంచి ఇంకొకరికి తాకే అవకాశాలు లేకపోలేదు.  పైగా మినహాయింపు సమయాన్ని ఆసరాగా చేసుకుని ఊరికినే బయటికి వచ్చే వారే అధికంగా ఉంటున్నారనది క్షేత్ర స్థాయి మాట. రోజు మార్కెట్కి వచ్చేవారు ఉండనే ఉన్నారు. దీంతో అసలు లక్ష్యం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయనే వారు లేకపోలేదు. చాలా చోట్ల మార్కెట్ వికేంద్రీకరణ జరగడంతో మినహాయింపు సమయాన్ని తగ్గిస్తే బావుండు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తపరుస్తున్నారు. అలాగే  గ్రామాల నుంచి మార్కెట్కు రాకుండా వారివారి గ్రామాల్లోనే నిత్యావసర సరుకులు అందుబాటులొో ఉండేలా చర్యలు తీసుకుంటే ప్రభుత్వ లక్ష్యం త్వరగా నెరవేరే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. 






 

 

 


పోలీస్ ది గ్రేట్ 






పోలీస్ ది గ్రేట్ 
 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

పోలీస్ ది గ్రేట్ .  ప్రజలకు రక్షణ కల్పించే కల్పించడంలో వారు వ్యవహరించే తీరే వేరు. ఇప్పుడు కరోనా వ్యాధి నుంచి ప్రజలను గట్టెక్కించడంలో వాళ్లు రోడ్లపై చేస్తున్న విధులు విలువైనవిగా చెప్పొచ్చు.   ఆపత్కాలంలో వారు చేస్తున్న కృషి అభినందనీయం. పోలీస్ దిగ్రేట్ అంటూ పలువురు  పేర్కొంటున్నారు. పోలీసులను రక్షక భటులని ఎందుకంటారో ఇప్పుడు క్షేత్రస్థాయిలో తెలిసొస్తుందనెేది జనం మాట.   ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి  ప్రజలను రక్షించడంలో  కీలక పాత్ర పోషిస్తున్నారు. 

జనం రోగం బారిన పడకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా రోడ్లపై రక్షణ వలయంగా నిలుస్తున్నారు అంటే అతిశయోక్తి లేదు. 

కరోనా వ్యాధి నేపథ్యంలో కుటుంబం మొత్తం కలిసి ఉండేందుకే సంకోచించాల్సిన పరిస్థితి.  ఆ వ్యాధి తీవ్రతెే అలాంటిది. అందుకే దాని బారిన పడకుండా జాగ్రత్త వహించాల్సిందేనని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. దీని కోసం ఎవరూ రోడ్లపైకి రాకుండా ఇంటిలోనే ఉండాలని లాక్ డౌన్  పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం చెప్పినా వినేవారు అరుదుగానే  ఉంటారన్నది తెలిసిందే. దీంతో ప్రజలను రక్షించాలనె ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తుంది పోలీసులే. రోడ్లపై ఎండనకా వాననకా సేవలు అందించే పోలీసులు  నిస్పక్షపాతంగానే నిర్వహిస్తారు. ఈ క్రమంలో అదుపు తప్పెవారిని నియంత్రించడం లొో కఠినంగా కూడా వ్యవహరించాల్సిన పరిస్థితి. కరోనా వ్యాధి ప్రభావం తెలిసి కొందరు తెలియక మరికొందరు ఏదో  నెపంతో రోడ్లపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తూనే  ఉన్నారు.  దీంతో అటువంటి వారిని నిలువరించడంతో పాటు ప్రజలను కంటికి రెప్పలా కాపాడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారంటే అతిశయోక్తి లేదు.  పోలీసులకి కుటుంబాలు ఉన్నా  ప్రజా ధర్మమే ముఖ్యం అన్న వైఖరి తో ముందుకెళతారు.  వృత్తి ధర్మంలో భాగంగా  విధి నిర్వహణలో ఇబ్బందులున్నా వెరవకుండా  ఉత్సాహంగా పని చేస్తుంటారు. ప్రజలకు రక్షణ కల్పించే రక్షక భటులుగా పేరున్న పోలీసులు ఇప్పుడు కరోనా మహమ్మారి నేపథ్యంలో వారు ప్రజలను బయటికి రాకుండా కాపాడుతున్న  చర్యలు గొప్పవిగా అభివర్ణిస్తున్న వారు అధికమే. నిజంగా పోలీసులు ది గ్రేట్ అంటూ పలువురు పేర్కొంటున్నారు అంటే అతిశయోక్తి కాదు.


 

 



 




 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...