Followers

కారోనా  వ్యాప్తి నివారణకు కఠిన చర్యలు తప్పవు



కారోనా  వ్యాప్తి నివారణకు కఠిన చర్యలు తప్పవు


విదేశాల నుండి వచ్చిన వారిపై  ప్రత్యెక దృష్టి


నిత్యావసరాల  సరఫరా  సాఫీ గా జరగాలి


జిల్లా కలెక్టర్  మరియు కార్పొరేషన్  ప్రత్యెక అధికారి హరి జవహర్ లాల్


లాక్ డౌన్ పరిస్థితుల్ని  అదుపులో ఉంచడం లో పోలీస్ కీలకం


 రేషన్ కార్డు లేని వారికీ బియ్యం  సరఫరా


 అనాధలకు అన్నదానం చేయడానికి సిద్ధం


విజయనగరం  శాసన సభ్యులు కోలగట్ల


 


        విజయనగరం, పెన్ పవర్ 


జిల్లాలో కారోన వ్యాప్తి  నివారించడానికి అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్  మరియు కార్పొరేషన్  ప్రత్యెక అధికారి  డా. హరి జవహర్ లాల్ తెలిపారు.  జిల్లాలో టాస్క్ ఫోర్సు కమిటీ లను వేయడంతోపాటు   కరోనా  పై ఇప్పటికే పారా మెడికల్ సిబ్బందికి, అంగన్వాడి, ఆశ, మహిళా సంఘాల సభ్యులకు కోవిడ్-19 పై శిక్షణలు పూర్తి చేశామని పేర్కొన్నారు  బ్యానర్లు, పోస్టర్లు హోర్డింగ్లు, టామ్ టామ్ ద్వార గ్రామాలలో, పట్టణాలలో విస్త్రుతంగా ప్రచారం చేయడం జరిగిందని అన్నారు. లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు  సామజిక దురాన్ని పాటించేలా అన్ని చర్యలను తీసుకున్నామన్నారు.


        రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు నియోజకవర్గం స్థాయి లో కారోణా పై సమీక్షించి, ప్రజల లో ధైర్యాన్ని నింపాలని,  ఎదుర్కోడానికి  సన్నద్ధం చేయాలని ఆదేశించిన దృష్ట్యా శనివారం మున్సిపల్ కార్యాలయం లో విజయనగరం నియోజక వర్గంకు సంబంధించిన  అధికారులతో కార్పొరేషన్  ప్రత్యేకాధికారి హోదాలో శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామితో కలసి  కలెక్టర్  సమీక్షించారు.  ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ  జిల్లాకు  విదేశాల  నుండి   476  మంది   వచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వ నివేదిక అందిందని, అందులో 145 మంది విజయనగరం  నియోజక వర్గానికి చెందిన వారె ఉన్నారని, వారిలో 15 మంది వివరాలు తెలియలేదని మిగిలిన 130 మందిని  క్వారెంటైన్  లో ఉంచడం జరిగిందని అన్నారు.   వారి పై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతోందని  అన్నారు. వీరిలో 7 రోజుల లోపు ఉన్నవారు 18 మంది కాగా, 7 నుండి 14 రోజుల లోపు వారు 40 మంది ఉన్నారని,   క్వరెంటైన్ లో ఉన్న వీరిలో 50 ఏళ్ళు దాటిన  ప్రతి ఒక్కరికి ఒక వైద్యున్ని నియమిస్తున్నట్లు తెలిపారు.   ముఖ్యంగా హై రిస్క్ ఉన్న దేశాలనుండి వచ్చిన వారిని నిర్బంధంగా ఉంచాలని,  ఇంకొకరికి వ్యాపించకుండా కట్టడి చేయాలనీ అన్నారు. మందు లేదు కనుక  కఠినంగ ఉండక తప్పదన్నారు.


        లాక్ డౌన్ ఉన్నందున నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా చూడాలని  అందుకోసం శాఖల మధ్య సమన్వయం తో పాటు పోలీస్ అధికారుల సహకారం  చాలా  అవసరమని పేర్కొన్నారు.   టోకు వ్యాపారులు , మామిడి వర్తకులు, స్వచ్చంద సంస్థలు లాక్ డౌన్ నుండి వెసలుబాటు కల్పించమని కోరుతున్నారని,  అయతే కోవిడ్ నిబంధనలకు విఘాతం కలగకుండా ఉండేలా సడలించడం జరుగుతుందని స్పష్టం చేసారు.  తాగు నీటి కోసం స్థానిక శాసన సభ్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నందున, ఈ ఏడాది నీటి సమస్య తలెత్తక పోవచ్చునని అన్నారు.   కార్పొరేషన్ సిబ్బంది పారిశుధ్యం పై కూడా దృష్టి పెట్టాలని  నీరు  కాలుష్యం  కాకుండా క్లొరినేషన్ చేయాలన్నారు.


లాక్ డౌన్ పరిస్థితుల్ని  అదుపులో ఉంచడం లో పోలీస్ కీలకం : కోలగట్ల


కరోన వ్యాప్తిని కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రజలు సామజిక దూరాన్ని పాటించడంలో  సహకరిస్తున్నారని, అందులో పోలీస్ పాత్ర కీలకమని విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు.  సామజిక బాధ్యతగా భావించి పోలీస్, ప్రజలు సహకరిస్తున్నందుకు అభినందనలు తెలుపుతూ, పరిస్థితులు చక్క బడే వరకు ఇంకా  జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. అగ్ర రాజ్యాలె కరోణా  ధాటికి  విలవిలలాడి పోతున్నాయని, మనం మరింత జాగురూకత వహించాల్సిన సమయమని అన్నారు.  మన దేశంలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చాల అవసరమని,  దీని కోసమే సామజిక  దూరాన్ని పాటించాలని ప్రతిఒక్కర్ని కోరుతున్నామని తెలిపారు.  ప్రజలు  నిత్యావసరాల కోసం గుమిగూడి ఉండకుండ  బజార్లను వికేంద్రీకరించి, సంఖ్య పెంచడం జరిగిందని, ఎక్కడి వారు అక్కడే కొనుగోలు చేసే ఏర్పాట్లను చేసామని అన్నారు.  ప్రతి కుటుంభానికి  సరిపడే వస్తువులు అందుబాటు లో ఉంచాలని,  భవిష్యత్ లో ఎలాంటి పరిస్థితి వస్తుందో  వుహించాలేమని  అన్నారు.   ప్రస్తుతం రైతు బజార్లు ఉదయం 6 నుండి 1 గంట వరకు ఉంటున్నాయని, ఇక పై వాటిని 11 గంటలకే మూసి వేయడం  ద్వార సామజిక దురాన్ని పెంచేలా చూడాలని కోరారు.  రేషన్ కార్డులు ఉన్న వారికి  ప్రభుత్వమే రేషన్ ఇస్తుందని, లేని వారికీ తను అందిస్తానని అన్నారు.  వార్డ్ వారీగా రేషన్ కార్డులు లేని వారి జాబితాను ఇవ్వాలని తహసిల్దార్ ను కోరారు.  ప్రజా సేవ చేయడానికి ఎల్లవేళలా ముందుంటానని, ఎప్పుడు ఏ అవసరం వచ్చిన తనకు చెప్పాలని అధికారులకు చెప్పేరు.  పేదలు, అనాధలకోసం, యాచకుల కోసం  భోజన ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.   పైడితల్లి గుడి వద్ద, పంచ ముఖ ఆంజనేయ గుడి, వాసవి కన్యకా పరమేశ్వరి గుడి వద్ద  భోజనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశం లో మున్సిపల్ కమీషనర్ ఎస్.ఎస్.వర్మ ,  మార్కెటింగ్ ఎ.డి.  శ్యాం కుమార్, తహసిల్దార్ సత్యనారాయణ మూర్తి,  హెల్త్ ఆఫీసర్ డా. ప్రణీత , పోలీస్ తదితర శాఖల  అధికారులు హాజరైనారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...