Followers

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సాయాన్ని ఐదు వేల కు పెంచాలి


 


విజయవాడ, పెన్ పవర్


 


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ పేదలకు ప్రకటించిన 1000/-రూపాయల సాయాన్ని 5,000 రూపాయలుగా పెంచాలి.. దాసరిరంగనాథ్  మాల యువత కన్వీనర్ , కృష్ణాజిల్లా .


విజయవాడ : స్థానిక  విలేకరుల  సమావేశంలో దళిత అభ్యుదయ సేవా సమితి కన్వీనర్ శీలం రాజు , మాల యువత కన్వీనర్ దాసరి రంగనాథ్ , పెనమలూరు నియోజకవర్గ ఎంఎం ఎన్ అధ్యక్షులు గోగులమూడి రాజు మాట్లాడుతూ....


ప్రపంచ వ్యాప్తంగా , అత్యంత ప్రమాదకరంగా మారిన "కొవిడ్-19 , కరొనా  వైరస్" యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి అని , కరోన వైరస్ నుంచి తమను తాము రక్షించుకొవల్సిన అవసరం ఎంతైనా ఉందని , ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు . 


అలాగే  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేయుచున్న ప్రతి మంచి పనిని రాజకీయాలకు , పార్టీలకు , మతాలకు , వర్గాలకు, అతితంగా పటించాల్సిన  అవసరం ఉందన్నారు . పేదలకు చేయుచున్న ప్రతి పనిని స్వాగతిస్తామనీ కొనియాడారు .


కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సయం  చేయాలని కోరుతూ , కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల ఉచితము గా అందజేయనున్న  రేషన్ ను ప్రతి కుటుంబానికి  25కేజీల   బియ్యం అలాగే నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించాలని...


రెక్కాడితే గాని డొక్కాడని  పేద కుటుంబాలకు మీరు ఏప్రిల్ 4వ తారీఖున వాలంటీర్ల  ద్వారా అందిస్తానన్న 1000/-రూపాయలను 5000/- రూపాయలుగా పెంచి అందించాలని శీలం రాజు , దాసరి రంగనాథ్ , గోగులమూడి రాజు ప్రభుత్వాన్ని కోరారు


ఇక్కడ కూడా రాజకీయాలా...?


జగ్గంపేట, పెన్ పవర్  


తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సామాజిక దూరం పాటిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మానవాళి పై విజృంభిస్తుంటే సామాజిక మాధ్యమాల ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు, దాంట్లో భాగంగా మా యొక్క జ్యోతుల నెహ్రూ పౌండేషన్ జగ్గంపేట నియోజకవర్గం లోని ఎన్నో సేవా కార్యక్రమాలు  చేస్తున్నటువంటి మా ఫౌండేషన్ కారోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రచార రథం  ద్వారా ప్రచారం చేయించుకోవడానికి పోలీసు వారి అనుమతి కోసం ప్రభుత్వానికి చలనాలు కట్టి పర్మిషన్ కోరుకుంటే దానిని తిరస్కరించడం జరిగిందని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే జగ్గంపేటలో వందలాది మందితో వ్యాప ఆకులు తగలడితే, పోలీసుల దగ్గరుండి ఆ కార్యక్రమం జరిపించారని, మరి మాకు ఒక ప్రచార రథం పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదని ఈ సందర్భంగా పోలీసు వారిని అడుగుతున్నాను అని అన్నారు. కలెక్టర్ గారికి పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకొని కలెక్టర్ గారు ద్వారా అయినా పర్మిషన్ సాధించి ప్రచారం చేపడతామన్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రోజు  పత్రికా సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేసి  మాట్లాడుతూ ప్రజల్లో ఒక మనోధైర్యాన్ని ఇస్తున్నారన్నారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయలేకపోతున్నారని, ప్రజల్లో నేనున్నానని ధైర్యం నింప లేక పోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అప్పలరాజు మండల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం పాండ్రంగి రాంబాబు  కొత్త కొండ బాబు తదితరులు పాల్గొన్నారు


అధికారులతో డిప్యూటీ సీఎం  పిల్లి సుభాష్ చంద్రబోస్ సమీక్ష


అధికారులతో డిప్యూటీ సీఎం  పిల్లి సుభాష్ చంద్రబోస్ సమీక్ష


 


మండపేట, పెన్ పవర్



       మున్సిపల్ ఆఫీస్ లో అధికారులు రాజకీయ నాయకులతో సమీక్ష చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు అందరూ కూడా సామాజిక దూరం పాటించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయములోనే నిత్యవసర వస్తువులు అమ్మాలని మిగతా టైం లో అమ్మ కూడదని ఆయన వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ పేదలు పని చేసుకుంటేనే గానీ రోజు గడవని వారు ఉన్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రామచంద్రాపురం డి.ఎస్.పి ఎం రాజు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎవరిని ఇబ్బంది పెట్టమని ఒంటి గంట దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామని ఎవరు బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి రెడ్డి రాజబాబు ఎమ్మార్వో మున్సిపల్ కమిషనర్ త్రివర్ణ రామ్ కుమార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు


పేదలకు నిత్యవసరాల సరుకులు పంపిణీ: బీజేపీ నాయకురాలు డి. అరుణకుమారి


 


ఎంవిపి కాలనీ, పెన్ పవర్


ఎంవిపి కాలనీ అప్పుఘర్ 18 వ వార్డులో నివసిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని, స్వయంగా  కాలనీ వాసులందరికి  విశాఖ నగర బిజెపి నాయకురాలు ద్వారపురెడ్డి అరుణ కుమారి  అద్వర్యం లో శనివారం ఉదయం రెండు  కేజీలు బియ్యం. కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పంచదార, కేజీ కందిపప్పు ఒక పాల ప్యాకెట్ కలిగిన కిట్లను కాలనీలో పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్త వాసుపల్లి శివ బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


కరోనా కలకలంతో కొంపకు చేరుకోలేని వలస కూలీలు


కరోనా కలకలంతో కొంపకు చేరుకోలేని వలస కూలీలు


త్రిపురంతకం, పెన్ పవర్


 


కరోన మహమ్మారి దెబ్బకు మద్యలోనే ఉండిపోయి స్వగ్రామానికి వెళుతుండగా  చెక్ పోస్ట్ లో చిక్కుకున్న 3000 మంది వలస కూలీల కథఇది.................


 


ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గుట్ల ఉమ్మడివరం చెక్ పోస్ట్ కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై మూడువేల మంది వలస కూలీలు పిల్ల పాపలతో నీళ్ళు తిండి లేక అవస్థలు పడుతున్నారు. పోలీసులు మాత్రం జిల్లా ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామని అంటున్నారు. ఈ మూడు వేల వలస కూలీలు రెండు నెలల క్రితం కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి గుంటూరు జిల్లాలో మిర్చి కోతలకు వలస వచ్చారు. కరోన ఎఫెక్ట్ నేపథ్యంలో గుంటూరు జిల్లా అధికారులు మీ ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఆదేశించడంతో వీరు స్వ గ్రామాలకు వెళ్ళేందుకు వంద వాహనాలలో బయలుదేరి వచ్చి ప్రకాశం గుంటూరు బోర్డర్ లోని చెక్ పోస్ట్ వద్ద చిక్కుకున్నారు. ఉన్నచోట గుంటూరు జిల్లా అధికారులు ఉండనివ్వలేదని ...సొంత గ్రామాలకు వెళతామంటే ప్రకాశం జిల్లా అధికారులు కనికరించడం లేదని వలస కూలీలు వాపోయారు.


రాష్ట్ర హై కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం జిల్లా కోర్టులు నడుస్తాయి


 


మార్కాపురం, పెన్ పవర్


ప్రకాశం జిల్లా మార్కాపురం ఆరో అదనపు జిల్లా జడ్జి  జి. రామకృష్ణ గారి ప్రెస్ మీట్   14 వరకు కోర్ట్ సెలవులు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం విధి నిర్వహణ  చేపడతాం,    ఇంజెక్షన్ ఆర్డర్స్ పొడిగించాం, ప్రజలందరూ సామాజిక దూరం పాంటించాలి,  ప్రభుత్వం నిర్ణయం అందరి బాధ్యత,  ఎవరైనా కరోనా సోకి దాచి పెట్టి... ఇతరుల ను ఇబ్బంది పెట్టె వారి పై క్రిమినల్ కేసులు  నమోదు చేయవచ్చు,   మిమ్మల్ని మీరు కాపుడుకోవడం కోసం మీరు  ఇళ్లలోంచి బయటకు రాకుండా ఉండాలి  పోలీస్ లు బాధ్యత ను కూడా ప్రజలు కూడా గమనించాలి ఆకతాయి గా తిరిగే వాళ్ళ పై పోలీసులు కేసులు నమోదు చేయవచ్చు అని చెప్పారు. 


మద్యం దొరక్క వృద్ధుడు ఆత్మహత్య


మద్యం దొరక్క వృద్ధుడు ఆత్మహత్య


మండపేట, పెన్ పవర్


 మద్యం దొరక్క వ్యసనానికి బానిస అయిన తోపుడు బండి రిక్షా కార్మికుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. టౌన్ ఎస్ ఐ తోట సునీత కధనం మేరకు మండపేట గాంధీ నగర్ రైతు బజార్ ఎదుగా ఉన్న వీధి లో నివసిస్తున్న షేక్ బాజి ఖాన్ (శ్రీను) (56) మండపేట రవికాంత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పాత సామిల్లు షెడ్డు కు ఉరి వేసుకొని మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున రోడ్ పై వెళుతున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా బాజి స్వస్థలం రాజమహేంద్రవరం. అక్కడ ఆర్ టి సి కాంప్లెక్స్ బయట ఇతని తండ్రి సత్తార్ సాహెబ్ పచ్చి చేపలు విక్రయించే వారు.బాగా బతికిన కుటుంబం. కాలక్రమంలో ఆర్ధికంగా చితికి పోయారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండగా 20 ఏళ్ళ క్రితం వారిని విడిచి పెట్టి మండపేట వచ్చేశాడు. ఇక్కడ జీవిన ఉపాధి కోసం తోపుడు రిక్షా నడుపుతూ బ్రతుకు తున్నాడు.ఈ క్రమంలో రైతు బజార్ సమీపంలో నివసిస్తున్న ఓ వృద్ధురాలు తో సహజీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిస గా మారాడు. కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో మద్యం అమ్మకాలు బంద్ కావడంతో ఈ మూడురోజులు గా మద్యం దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆత్మహత్య కు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆటో యూనియన్ నాయకులు మధు తదితరులు అక్కడికి చేరుకుని గుర్తింపు కార్డు ఆధారం గా కొవ్వూరు లో నివసిస్తున్న భార్య, పిల్లలకు సమాచారం ఇచ్చారు.కాగా 20 ఏళ్ళ క్రితమే వదిలేసమని సమాధానం ఇచ్చినట్లు వారు తెలిపారు. దీనిపై ఎస్ ఐ సునీత అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...