పాయకరావుపేట, పెన్ పవర్
పాయకరావుపేట, పెన్ పవర్
కొత్తపేట పెన్ పవర్....
.
విజయనగరం, పెన్ పవర్
ఢిల్లీలోని నిజాముద్దీన్, ప్రాంతానికి మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి ,వారిలో ఇద్దరిని కేంద్ర ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఒక వ్యక్తి హైదరాబాదులో వైద్యులు తీసుకుంటున్నట్లు సమాచారం ఉంది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కరెంట్ టైం లో ఉంటూ వైద్యం తీసుకుంటున్నట్లు సమాచారం ఉంది. ఇంకా ఎవరైనా ముస్లిం సోదరులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు ఉంటే వెంటనే దయచేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు జరిపించుకొని ఉండవలసిన అవసరం ఉంది .మీరు వైద్య పరీక్షలు చేయించుకొని మీరు ఎవరెవరితో కలిశారో ఆ వివరాలు పోలీసువారికి గాని ,వైద్యులు కానీ, తెలియపరిచిన వారు మీకు తగిన వైద్య సలహాలు కూడా ఇస్తారు. ఆరోగ్యంగా ఉన్న వారికి కరోనా లక్షణాలు బయటపడటానికి కాస్త ఎక్కువ సమయం తీసుకోవచ్చు, అలా అని మాకు ఏమీ లేదు, అని అశ్రద్ధ చేయకుండా కరెంట్ టైం లో ఉంటూ ఎటువంటి సూచనలు బయటపడిన, వెంటనే పరీక్షలు చేయించుకోవలసిన దిగా రెండు చేతులు జోడించి ముస్లిం సోదరులకు మనవి చేస్తున్నాను. మీరు అనవసర భయాలు పోయి చెప్పకుండా ఉన్నట్లయితే, వ్యాధి సోకితే మీ దేహాన్ని చూడటానికి మీ తండ్రి కాని, తండ్రి గాని, బిడ్డ గాని ,స్నేహితులే కానీ, ఎవరు రాలేని పరిస్థితి .చివరకు నీ కర్మకాండ ఎలా జరుగుతుందో తెలియదు .ఇంత నికృష్టపు చావు మనకు అవసరమా? ఈ సమాజం కోసం, దేశం కోసం, ప్రజలను రక్షించడానికి కోసం 24 గంటలు శ్రమిస్తున్నటువంటి వైద్యులకు, ఎండనకా, వాననకా, తమ కుటుంబాన్ని వదిలి మన కోసం శ్రమిస్తున్న పోలీసు వ్యవస్థకు, రెండు చేతులెత్తి నమస్కరిస్తూ, వారికి సహకరిద్దాం రండి. దయచేసి మీ వద్ద ఏదైనా సమాచారం ఉన్న ఎడల ఈ క్రింది టోల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేసి సమాచారం అందించవలసినదిగా మనవి. నిజాముద్దీన్ మత ప్రార్థనలకు హాజరైన వారి కొందరు వివరాలను నిజాముద్దీన్ ప్రార్థనకు హాజరు వచ్చిన వారి వివరాలు వక్ఫ్ బోర్డు ద్వారా సేకరించి వారు విడుదల చేసినటువంటి వివరాలను జిల్లా మైనారిటీ అధికారి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి అందించడం జరిగిందని తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
నిత్యం రద్దీగా ఉండే ఫిషింగ్ హార్బర్ మూసి వేసినట్లు ఫిషింగ్ హార్బర్ అసోసియేషన్ ప్రకటించింది. కరొనా వైరస్ లాక్ డౌన్ వల్ల నగరం జన సంచారం లేక బోసి పోతుందని ఈ తరుణంలో చాపల మార్కెట్ వ్యాపారం స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో చాపల వేట కూడా నిలిపి వేయడం జరిగింది. మర పడవలు లంగర్ కే పరిమితం కావడంతో షిప్పింగ్ హార్బర్ నిలిచి పోయింది. పడవలు నిలిపి వేయడం వేట ఆగిపోవడంతో మార్కెట్ వెల వెల బోతుంది. మత్స్యకారులు వేట లేకపోవడంతో విలవిలలాడుతున్నరు. కరోనా మహమ్మరి ప్రభావంతో ఫిషింగ్ హార్బర్ మూతపడింది. ఫలితంగా మత్స్యకారులు, వ్యాపారులు,కూలీలతో పాటు రవాణా మొత్తం స్తంభించిపోయింది.
విశాఖ సెంట్రల్ జైలు నుండి 74 మంది ఖైదీల విడుదల.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
విశాఖ కేంద్ర కారాగారం నుంచి 74 మంది ఖైదీలను విడుదల చేశా మని కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎస్ . రాహుల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావం కారణంగా లాక్ డౌన్ అమలు జరుగుతున్న సందర్భంగా కారాగారంలో ఉన్న ఖైదీలను మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విడుదల చేయాలని సుప్రీం కోర్ట్ మరియు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు కారాగారంలో ఉన్న 53 మంది రిమాండ్ ఖైదీలు 21 మంది శిక్ష ఖైదీలు మొత్తం 74 మందిని మార్చి 31న విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. ఈ సందర్భంగా కారాగారంలో ఉన్న ఏడుగురు మహిళలతో 74 మంది ఖైదీలను విడుదల చేయడం జరిగిందన్నారు. విశాఖ ఏడవ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జగదీష్ కుమార్ ఆధ్వర్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఖైదీలను ఇళ్లకు పంపించామని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఖైదీలు సామాజిక దూరం వ్యక్తిగతవ శుభ్రత పాటించాలని ఎల్ల కే పరిమితం కావాలని రాహుల్ సూచనలు ఇచ్చారు.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...