స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
నిత్యం రద్దీగా ఉండే ఫిషింగ్ హార్బర్ మూసి వేసినట్లు ఫిషింగ్ హార్బర్ అసోసియేషన్ ప్రకటించింది. కరొనా వైరస్ లాక్ డౌన్ వల్ల నగరం జన సంచారం లేక బోసి పోతుందని ఈ తరుణంలో చాపల మార్కెట్ వ్యాపారం స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో చాపల వేట కూడా నిలిపి వేయడం జరిగింది. మర పడవలు లంగర్ కే పరిమితం కావడంతో షిప్పింగ్ హార్బర్ నిలిచి పోయింది. పడవలు నిలిపి వేయడం వేట ఆగిపోవడంతో మార్కెట్ వెల వెల బోతుంది. మత్స్యకారులు వేట లేకపోవడంతో విలవిలలాడుతున్నరు. కరోనా మహమ్మరి ప్రభావంతో ఫిషింగ్ హార్బర్ మూతపడింది. ఫలితంగా మత్స్యకారులు, వ్యాపారులు,కూలీలతో పాటు రవాణా మొత్తం స్తంభించిపోయింది.
No comments:
Post a Comment