Followers

ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలతో ప్రభుత్వ ఆదేశాలను కూడా బేఖాతర్ చేసిన  మద్యం దుకాణ సిబ్బంది!


ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలతో ప్రభుత్వ ఆదేశాలను కూడా బేఖాతర్ చేసిన  మద్యం దుకాణ సిబ్బంది!



 పెదబయలు, పెన్ పవర్:


 


మండల కేంద్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చాటుమాటుగా అమ్మకాలు అధికారుల కనుసన్నల్లో నిర్భయంగా జరుగుతున్నాయని విమర్శలు వెల్లెవేత్తడంతో అధికారులు స్పందించారు. మంగళవారం పెదబయలు ప్రభుత్వం మద్యం దుకణాన్ని పాడేరు సర్కిల్ ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ 
జి, రమణ రావు ప్రభుత్వ మద్యం దుకాణం నుు  పరిశీలించగా నిబంధనల ప్రకారం దుకాణానికి అమర్చి ఉన్న సెటర్ (తలుపు)మొదటి రోజే  మూడుచోట్ల  తాళాలు వేయవలసి ఉండగా... అలాగే ఆ తాళాలు వేసి దానిపై  లక్క మార్క్ ముద్ర శీలు వేయ చేయవలసి ఉండగా  నామమాత్రంగా మధ్యలో ఒక తాళం కప్ప మాత్రమే వేసి ఉంది దానిపై తెల్లటి గుడ్డ చుట్టి వదిలివేశారు, దీనిని బట్టి చూస్తే రాత్రిపూట యధావిధిగా బయటకు అధిక రేట్లకు అమ్మి  జేబులు నింపుకుంటున్నారని దీని వెనకాల అధికారుల అండదండలు ఉంటాయని పలువురు  విమర్శలు చేస్తున్నారు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల సిబ్బంది ఇష్టారాజ్యం ఏలుతున్నారని  దీనిని బట్టి అర్థమవుతుంది మంగళవారము టీవీ ఛానళ్లలో ప్రచారము కావటంతో పాడేరు సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ శాఖ 


జి రమణ రావు హుటాహుటిన వచ్చి  మొదటిసారి వేసిన  తాళం పై  తెల్లటి గుడ్డ చుట్టి ఎరుపు రంగు లక్క అంటించి ముద్రవేసి వెనుతిరిగారు ఈ అంశంపై విలేకరులు ప్రశ్నించగా మందు కోసం వచ్చిన వారే ఈ అఘాత్యాలు చేసి  శీలు  పీకి పడేసి ఉంటారని సమాధానమిచ్చారు.


మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, దయచేసి బయటకు తిరగకండి,


విజయనగరం,  పెన్ పవర్


 మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, దయచేసి బయటకు తిరగకండి, మీ కుటుంబాలను కాపాడుకోండి, లాక్ డౌన్ పాటిస్తూ అధికారులకు సహకరించండి అంటూ విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు, పాదచారులకు అభ్యర్థించారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలో పరిస్థితి, తన వాహనం పై వెళుతూ నగరమంతా కలియతిరిగారు. బాలాజీ జంక్షన్ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వాహనదారులను ఆపి ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా దయచేసి లాక్ డౌన్ సమయంలో బయట తిరగవద్దు అని వాహనదారులను అభ్యర్థించారు. వారికి అవగాహన కల్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా మరింత జాగ్రత్త అవసరం అని వారికి నచ్చచెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, ఇంటికే పరిమితం కావాలని, నిత్యావసర సరుకులు అందుబాటులోనే ఉన్నాయి అని ఎవరు కలత చెంద వద్దని ఎమ్మెల్యే కోలగట్ల వారితో అన్నారు. అనంతరం ప్రధాన రహదారులపై నగరపాలక పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న క్లోరిన్ పిచికారి పనులను ఎమ్మెల్యే కోలగట్ల పర్యవేక్షించారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ వద్ద ఉన్న ట్యాంకర్ల తో పాటు, ఎమ్మెల్యే కోలగట్ల వ్యక్తిగతంగా మరో ట్యాంకర్ ను కూడా తెప్పించి నగరంలో ఆయా డివిజన్లలో పిచికారి పనులకు ఉపయోగించే విధంగా చూడాలని పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. అదే సమయంలో మూడు లాంతర్ల వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారి గుడి వద్ద ఏ ఆధారం లేని నిరుపేదలకు ఆహార పొట్లాలను ఎమ్మెల్యే కోలగట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దినసరి కూలీ చేసుకున్న వారు కానీ, రేషన్ కార్డు లేని వారు కానీ కలత చెంద వద్దని అన్నారు. అన్నార్తులకు ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు ఆయా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పైడితల్లి అమ్మవారి గుడి వద్ద పగలు, రాత్రి సమయాలలో ఏ ఆధారం లేని నిరుపేదలకు ఆహారం అందించడం జరుగుతుందన్నారు. అలాగే కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద కూడా నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఎక్కడైనా పేదవారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు, ఆకలి బాధతో ఉన్న వారు ఆయా ప్రాంతాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సంప్రదించాలని, లేదా స్థానిక శాసన సభ్యునిగా తాను అందుబాటులో ఉంటానని, నాయకుల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లాక్ డౌన్ పిలుపును విజయవంతం చేస్తూ, ప్రజలందరూ ఇళ్ల వద్దే ఉంటూ, కరోనా వైరస్ ను తరిమి కొట్టాలన్నారు. ఎమ్మెల్యే కోలగట్ల వెంట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ వి వి రాజేష్, సత్త రావు శంకర్రావు తదితరులు ఉన్నారు.


"శ్రీ సిటీ సేవలు"  అభినందనీయం.


"శ్రీ సిటీ సేవలు"
 అభినందనీయం.
పెన్ పవర్, చిత్తూరు/ సత్యవేడు


శ్రీసిటీ ప్రముఖ పారిశ్రామికవాడలో మెండాలిజ్ చాక్ల్ టు పరిశ్రమ వారు, పోలీస్ వారు, వారి సిబంది, లాక్ డౌన్ సందర్బంగా వారు చేసుతున్నా సేవలు మరుపురానివని శ్రీసిటీ పరిశ్రమల అధికారి వారిని అభినందించారు. కరోనా -19, మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని, ప్రభుత్వం ఆదేశాలుమేరకు వారు ప్రాణాలనులెక్క చేయకుండా, సమయానికి తిండి, తిప్పలు లేకుండా ప్రతినిత్యం సేవసేస్తున్నవారికీ, మనం సహకరించక పోతే ఈ జీవితంనకు, అర్ధం, పరమార్ధం ఉండదని, పరిశ్రమల అధికారులు, ప్రతినిధులు ఈ సందర్బంగా శానిటైజేర్, మాస్కులు, బోర్నవిటా, హేల్తిడ్రింక్స్ పౌడర్లు. సుమారు 4లక్షలు రూపాయలు విలువ చేసే 400 కిట్లను శ్రీసిటీ, తడ, సూళూరుపేట,సత్యవేడు, వరదయ్యపాలెం మండలంలోని పోలీస్ అదికారులకు మరియూ వారి సిబందికి అందజేశారు.ఈ సందర్బంగా పరిశ్రమ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ యావత్ ప్రపంచం మొత్తం లాక్ డౌన్ ఉంటే పోలీసులు మాత్రం తమ ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా, ప్రజలసంక్షేమమ్ కోసంఅహరిని శలు కటపడుతున్న, వారిఆరోగ్యం కోసంఈ కిట్లును అందించారు. లాక్ డౌన్ఉన్నoత వరకు పోలీస్ వారికీ, మరియు శ్రీసిటీ సెక్యూరిటీ సిబందికి రోజుకు సుమారు 30లీటర్లు మజిగను అందజేస్తామనారు. ఈ సందర్బంగా శ్రీసిటీ డీస్పీ విమలాకుమారి, సిఐ జగదీశ్ నాయక్, వారిసేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మెండలీజ్ చాక్లెట్ పరిశ్రమ ఉద్యోగులు భాస్కర్ రావు, కేవీ సత్యనారాయణ, శ్రీ శర్మ, సుధాకర్, సంతోష్, సతీష్ తథి దరులు పాల్గొన్నారు.


తబ్లిగి జమాత్ వారు ఢిల్లీ వెళ్లి  వచ్చిన వారు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా వారి సంఖ్య

తబ్లిగి జమాత్ వారు ఢిల్లీ వెళ్లి  వచ్చిన వారు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా వారి సంఖ్య


వారిని త్వరగా తమ ఉళ్ళల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి  చెక్   చేయంచుకుని చికిత్స తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది...సమాజ హితం కోరి  వారు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కొరింది.



శ్రీకాకుళం జిల్లా    0


విజయనగరం జిల్లా      3


విశాఖపట్నం రూరల్.   1


విశాఖపట్నం సిటీ.     41


తూర్పు గోదావరి జిల్లా     6


పశ్చిమ గోదావరి జిల్లా   16


రాజమండ్రి.             21


కృష్ణ జిల్లా.              16


విజయవాడ సిటీ.      27


గుంటూరు అర్బన్.    45


గుంటూరు రూరల్.    43


ప్రకాశం జిల్లా.           67


నెల్లూరు జిల్లా.          68


కర్నూల్ జిల్లా.           189


కడప జిల్లా.               59


అనంతపూర్ జిల్లా.     73


చిత్తూరు జిల్లా.           20


తిరుపతి.                  16


                Total.      711


కరోనా (కోవిడ్-19) నేపథ్యంలో ప్రజలకు, మీడియాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనలు

 


కరోనా (కోవిడ్-19) నేపథ్యంలో ప్రజలకు, మీడియాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనలు


అమరావతి, పెన్ పవర్


• ఇది మానవాళి మునుపెన్నడూ ఎరుగని విపత్తు కాలం,కంటికి కనపడని శత్రువు (కోవిడ్-19) తో మనం యుద్దం చేస్తున్న సమయమిది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిచెందిన దేశాలు, వర్ధమాన దేశాలు అనే తేడా లేకుండా ప్రతీ చోటా కోవిడ్-19 ప్రభలతుంది.


• ఇలాంటి క్లిష్టమైన సమయంలో ప్రభుత్వాలు, ప్రజలు కరోనా పై అవగాహన పెంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. 


• ఈ ప్రయత్నంలో సాంప్రదాయ సమాచార, వార్తా సంస్థలతో పాటూ ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, షేర్ చాట్, టిక్ టాక్ వంటి అనేక సామజిక మాధ్యమాలు, వెబ్ సైట్లు, మొబైల్ యాప్స్ వంటి ఇతర డిజిటల్ మాధ్యమాలను మనం ఉపయోగిస్తున్నాం. 


• కొంతమంది తమ అవగాహనా లోపం వల్ల, లేదా ఆకతాయితనం వల్ల అనేక రకాల తప్పుడు సమాచారాన్ని, వదంతుల్ని వ్యాపింప చేస్తున్నారు. ఈ తప్పుడు సమాచారం, వదంతులు కూడా మరొక మహమ్మారిగా తయారై సాధారణ ప్రజలకి, ప్రభుత్వ యంత్రాంగానికి మరో సవాలుగా పరిణమిస్తున్నాయి. 


• అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బాధ్యతారహితమైన ఈ విచ్చలవిడి తప్పుడు సమాచార, వదంతుల వ్యాప్తిని ఇన్ఫోడెమిక్ (Infodemic)గా అభివర్ణించింది.     


ఆంధ్రప్రదేశ్ పౌరులకు, మీడియాకుసమాచార పౌరసంబంధాల శాఖ విభాగం కింది సూచనలు చేస్తున్నది...


• డిజిటల్ మాధ్యమాలలో మీకు వచ్చిన సమాచారాన్ని ఇతరులతో పంచుకునే ముందు బాధ్యతతో,కొంచెం జాగ్రత్త తో వ్యవహరించండి.  సమాచార ప్రామాణికతను రూఢీ చేసుకోకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ సమాచారాన్ని ఇతరులకు చేరవేయవద్దు. 


• వాట్సాప్ వంటి వేదికలలో బృంద సభ్యులు ఎవరైనా తప్పుడు సమాచారం వ్యాపింపచేస్తే ఆ బృందపు అడ్మిన్స్ దానికి బాధ్యులవుతారు. చట్టపరంగా విచారణను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.  


• డిజిటల్ మాధ్యమాలను ఇప్పుడిప్పుడే వాడుతున్న వారు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం లేని వారి విషయంలో మనం మరింత దృష్టి పెట్టాలి. వారికి ఆ మాధ్యమాలకున్న బలం, బలహీనతలు, పరిధులు,  పరిమితులు, అనుకూల, ప్రతికూలతల గురించి వివరంగా చెప్పాలి. వాటి దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన చర్యలపై అవగాహన కలిగించాలి.


• కరోనా మహమ్మారి విషయంలో అనేక రకాల తప్పుడు సమాచారం వ్యాపిస్తున్నది. ఇటువంటి సందర్భాల్లో వ్యక్తిగత వివరాల గోప్యత అత్యంత ముఖ్యమైన అంశం. వ్యాధి బారిన పడిన వ్యక్తుల గురించి ఎవరు సమాచారం పంపినా దాన్ని మీరు ఇతరులకు పంపకండి. మొదటగా ఆ సమాచారం ప్రామాణికమైనది కాకపోవచ్చు, ఒక వేళ అది ప్రామాణికమైనదైనా అది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించవచ్చు.


• ఇది అనైతికమే కాదు శిక్షార్హమైన నేరం,విపత్తుల విషయంలో వదంతులను, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసే వారికి విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని 54వ సెక్షన్ ప్రకారం ఒక సంవత్సరం పాటు జైలుశిక్ష ఇంకా జరిమానా విధించే అవకాశం ఉంది. ఇంకా ఐపీసీ సెక్షన్ 505 ప్రకారం కూడా తప్పుడు సమాచార ప్రచారం శిక్షార్హమౌతుంది.  


• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటువ్యాధుల చట్టం, 1897 లోని సెక్షన్ 2,3 మరియు 4 క్రింద సంక్రమించిన అధికారాలను అనుసరించి జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులేషన్, 2020 ద్వారా కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి, అదుపులో ఉంచటానికి మరియు నియంత్రించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి జీవో ఆర్టీ నెం. 189,హెమ్ మరియు ఎఫ్ డబ్లూ (బీ2) ని విడుదల చేసింది. ఈ నిబంధనలలోని 9వ సెక్షన్ ప్రకారం కరోనా వైరస్ కు సంబంధించినా, ఎటువంటి సమాచారాన్నైనా సంబంధిత అధికారులతో ధృవీకరించుకోకుండా వార్తా పత్రికలు, టీవీ చానెళ్లు, సామాజికమాధ్యమాలలో వ్యాప్తి చేయకూడదు. దీనికి విరుద్ధంగా వదంతులు, తప్పుడు సమాచారాన్ని ఎవరైనా వ్యాప్తి చేస్తే సంబంధిత చట్టాల కింద శిక్షార్హులవుతారు.


• ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రామాణిక సమాచారం అందరికీ అవసరం. కరోనా సమరంలో అది చాలా కీలకం. డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించే వారు ఏ సమాచారం, వార్త ప్రామాణికతపై సందేహం వచ్చినా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే సమాచారం, ప్రధాన స్రవంతి వార్తా మాధ్యమాలు ప్రచురించే, ప్రసారంచేసే సమాచారంతో పోల్చి సరిచూసుకోవాలి.       
సమాచార మాధ్యమాలకు సమాచార పౌర సంబంధాల శాఖ సూచనలు:


1. కరోనా మహమ్మారిని రూపుమాపడంలో సమాచార మాధ్యమాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రవ్యాప్త లాక్ డౌన్ కి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసే మహత్తర బాధ్యతను అవి నిర్వర్తిస్తున్నాయి. మీకు, మీ సిబ్బందికి ధన్యవాదాలు.


2. సామాజిక మాధ్యమాల వ్యాప్తిలో ఉన్న సంచలనాత్మక, భయాందోళనలకు గురిచేసే, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని కొన్ని ప్రధాన స్రవంతి వార్తా పత్రికల ఆన్లైన్ ఎడిషన్లు, వెబ్ మ్యాగజైన్లు, ఆన్లైన్ న్యూస్ సైట్లు యధాతథంగా, అధికారిక వార్తలతో సరిపోల్చకుండా ప్రచురిస్తున్నాయి. అదేవిధంగాఎలక్ట్రానిక్ మాధ్యమాలు తమ యూట్యూబ్ ఛానెళ్లలో ఇటువంటి వార్తలను ప్రసారం చేస్తున్నాయి. 


3. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు చాలా వార్తలను తప్పుదోవ పట్టించే థంబ్నెయిల్స్ (thumbnails)తో పోస్ట్ చేస్తున్నాయి. సంబంధిత శీర్షికకు, క్రింద ఇచ్చేసమాచారానికి సంబంధం లేని ఈ థంబ్ నెయిల్స్ వీక్షకుడిని తప్పుదోవ పట్టించడమే కాకుండా, సమాచారాన్నీ కలుషితం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అవహేళన చేసే విధంగా, వారిపై చులకన భావం కలిగించేదిగా, వారి మనోస్థైర్యాన్ని దెబ్బ తీసేవిధంగా ఈ వీడియోలు ఉండడం విచారకరం. ఇది అనైతికమే కాదు ఆ డిజిటల్ మాధ్యమాల నిబంధనలకు విరుద్ధం. 


4. పదే పదే ఇటువంటి తప్పుదోవ పట్టించే వార్తలు, వీడియోలని ప్రచురించే, ప్రసారం చేసే వేదికలపై సమాచార పౌరసంబంధాల శాఖ సంబంధిత సామాజిక మాధ్యమ సంస్థల దృష్టికి తీసుకెళ్లి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా ఇటువంటి వార్తలు, వీడియోలను పోస్టు చేస్తున్న ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్ల కు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం నిలిపివేసే  అవకాశం ఉంటుంది. తరచుగా తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే చానెళ్లను ఆ సామాజిక మాధ్యమ సంస్థలు పూర్తిగా తొలగించే అవకాశం కూడా ఉంది.


5. పైగా ఇటువంటి వార్తలు, వీడియోలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటువ్యాధుల చట్టం, 1897 లోని సెక్షన్ 2,3 మరియు 4 క్రింద సంక్రమించిన అధికారాలను అనుసరించి జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులేషన్, 2020,  విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని 54వ సెక్షన్, ఐపీసీ సెక్షన్ 505 కింద ఉల్లంఘనలుగా పరిగణించబడతాయి. పై చట్టాలే కాకుండా ఇతర నిబంధనలను అనుసరించి ఆ సంస్థలు/ సంస్థల యజమానులు శిక్షార్హులవుతారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలకు డిజిటల్ మీడియా వేదికలు అత్యంత ప్రయోజనకారి అవుతాయి. అనేక వార్తా సంస్థలు, సమాచార మాధ్యమాలు డిజిటల్ మాధ్యమాలను అత్యంత ప్రభావవంతంగా సమాజహితం కోసం వాడుతున్న వారందరికీ ధన్యవాదాలు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి, అంతిమంగా విజయం సాధించడానికి సామాన్య ప్రజలు, సమాచార, వార్తా సాధనాలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన సమయమిది. ఇది సమిష్టిగా చేయాల్సిన ప్రయత్నం, ఇది ఖచ్చితంగా గెలవాల్సిన యుద్ధం అని


తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి,
కమిషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ,
ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి  తెలిపారు.


 


 కాలినడకన వెళ్లే ప్రయాణికులకు ఆహార పొట్లాలు పంపిణీ





 

 

ఏలేశ్వరం, పెన్ పవర్ 

 

పట్టణంలోని  అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మాచారి నాగ మృత్యుంజయ శర్మ బృందం ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ ఆహార పొట్లాలను నేషనల్ హైవే ఎర్రవరం నుండి విశాఖ జిల్లా పాయకరావుపేట వరకు వెళ్లి నడిచి వెళుతున్న ప్రయాణికులకు సుమారు రెండు వందల మందికి భోజనం ప్యాకెట్లను శర్మ బృందం అందజేశారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ సందర్భంగా కరోనా వైరస్ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ తో వాహనాలను నిలుపుదల చేయడంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రయాణికులు తమ తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు  కాలినడకన వెళ్తున్నారని మార్గంమధ్యలో వారికి కనీసం తాగేందుకు మంచినీరు కూడా దొరకడం లేదని వారి దాహార్తిని ఆకలిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మువ్వ శ్రీరామచంద్రమూర్తి, నూకల సుబ్రమణ్యం, ఎస్ రవికుమార్, పి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


 

 



 

పేదలకు సాయం


 


అనకాపల్లి, పెన్ పవర్ 

 

 

 గౌరీ హోల్ సేల్ కాయగూరల వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హాస్పిటల్, రైల్వే స్టేషన్ దగ్గర అన్న క్యాంటీన్లలో  అన్న సమారాధన నిర్వహించారు . ఎమ్మెల్యే గుడివాడ అమర్ చేతుల మీదుగా పేదలకు అన్నదానం చేశారు.  జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్  శ్రీరామూర్తి, సంఘం అధ్యక్షా  కార్యదర్శులు సూరి శెట్టి జగదీష్ ,  భద్రం తదితరులు పాల్గొన్నారు .

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...