Followers

మానవ సేవే,,, మాధవ "సేవా"" స్ఫూర్తిగా


ఆరిలోవ . పెన్ పవర్.


తూర్పు నియోజకవర్గం 12వ వార్డు. సేవా స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, మధ్యాహ్న భోజనం అవసరం ఉన్న నిరుపేదలకు. విధి నిరవహణలో విధులను నిర్వహిస్తున్న వారికి, అవసరం మేరకు నిత్యం సుమారు మూడు వందల నుండీ నాలుగు వందల  వరకు . ఆహారం సిద్దం చేస్తున్నారు. 9,10.11.12.13.  వార్డ్ లలో,  విశాలాక్షి నగర్. హనుమంతువాక. ఇందిరా నగర్ .రవీంద్ర నగర్ పెద్దగదిలి.ఆరిలోవ. పైనాపిల్ కాలనీ .అడవివరం. వరకు గల ప్రాంతాలలో సేవా స్ఫూర్తి సభ్యులు ఆహారాన్ని అందజేస్తున్నారు. ఈనెల 28 న ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కి స్థానికంగా ఉన్నటువంటి  ఓం సాయిరాం క్యాటరింగ్. అధినేత కె రాజు. పూర్తి సహాయ సహకారాలను  అందజేస్తున్నారు అని. ఆహారం కావలసినవారు ముందుగా, 9703456727. మరియు 7981631404. ఫోన్ నెంబర్లకు  సంప్రదించవచ్చని. ఈ సేవా కార్యక్రమం ప్రభుత్వం ఎత్తివేసే వరకు ఉంటుందని. సేవా స్పూర్తి సంస్థ  అధ్యక్షులు ఒమ్మి అప్పలరాజు తెలియజేశారు.

 

                 

 


 


లాక్ డౌన్ కు సహకరించిన పలువురు యువకులు


 





 

 

సీతానగరం పెన్ పవర్  

 

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందకుండా పోలీస్ వారికి సహకారంగా ముదునూరి సురేష్ రాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సీతానగరం సెంటర్ నందు నిత్యావసర సరుకుల కోసం మాత్రమే రావాలని పలు జాగ్రత్తలు పాటించాలని, ఇంటికే పరిమితమై ఉండాలని అవగాహన కల్పించారు. కొత్త వ్యక్తులు తిరగకుండా కాపలా కాస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు పలివెల వీరబాబు,ఈలి శ్రీను, చిట్టి సురేష్, వాసు, హేమంత్, మేడిశెట్టి సతీష్ , దుర్గాప్రసాద్, సుంకర నాని, డి వెంకటేష్, మట్ట చిట్టబ్బాయి, ఖాతా శ్రీను తదితరులు పాల్గొన్నారు.


 

 



 

జిల్లాను గజాగజా వణికిస్తున్న కరోనా గుబులు.


జిల్లాను గజాగజా వణికిస్తున్న కరోనా గుబులు.



నిజాముద్దీన్  యాత్రికులు  రాకతో మొదలైన హైటెన్షన్.



నగరంలో 11కు చేరిన కరోనా  పాజిటివ్  కేసులు.



అనుమానితులను ఐసోలేషన్  కేంద్రాలకు తరలింపు.



  స్టాఫ్ రిపోర్టర్   విశాఖపట్నం (పెన్ పవర్)


 


జిల్లాలో కరోనా వైరస్ కేసులు  పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం  అప్రమత్తమైంది. మంగళవారం ఒక్కరోజే  నాలుగు పాజిటివ్ కేసులు   నమోదు కావడంతో  జిల్లా ఉలిక్కిపడింది. ఆరు కేసులు కే పరిమితమైన కరోనా మహమ్మారి  ఒక్కరోజులోనే  11కు  చేరడంతో కోవిడ్ 19 గుబులు వెంటాడుతుంది. ఈనెల 19న  నిజాముద్దీన్ లో  జరిగిన తల్లిక్  జమాత్  మత సదస్సులో  పాల్గొన్న  41 మంది విశాఖ చేరుకున్న విషయం  తెలిసిందే. జమాత్ లొ  పాల్గొన్న  వారికి  కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో  అధికార యంత్రాంగం అప్రమత్తమై  మత యాత్రికుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.  పలువురు ఆచూకీ  లభించినప్పటికీ   మిగిలిన వారి కోసం  గాలింపు చర్యలు జరుగుతున్నాయి. జమాత్   లో  పాల్గొన్న   వారు నిజాముద్దీన్ ట్రైన్ లో ప్రయాణం  చేశారు. వారితో పాటు  ప్రయాణం చేసిన  మరికొందరిని కూడా  విశాఖ ఐసొలేషన్ కు  తరలించారు. మాడుగుల జెడి పేట నుంచి  యువకుడిని  మంగళవారం రాత్రి  విశాఖ తరలించారు.  నర్సీపట్నం మంచి ఒక వ్యక్తిని  చెట్టు పల్లి నుంచి మరో ముగ్గురిని తుమ్మపాల నుంచి ఒకర్ని ఐసొలేషన్   హోమ్ కు  తరలించారు. మత సదస్సులో పాల్గొన్న వారిలో  కరొనా కేసులు  నమోదు కావడంతో  వారితో ప్రయాణించిన  ఇతర ప్రయాణికులను కూడా అనుమానిత కేసులుగా  నమోదు చేస్తున్నారు. నిజాముద్దీన్ మత సదస్స యాత్రికులు  జిల్లాలో ఎక్కడెక్కడ తిరిగారు  ఎవరితో కలిశారు  అన్నది  మిస్టరీగా మారింది. ప్రస్తుతం జిల్లాలో కరోనా మహమ్మరి   నివురుగప్పిన  నిప్పులా మారింది. ఎక్కడ ఎలా  కాల్ టు కేసులు  బయట పడతాయో అన్న  భయం  ప్రజలను వెంటాడుతోంది.  అధికారులు  ప్రభుత్వం   కరోనా నియంత్రణకు  ప్రత్యేక చర్యలు  చేపడుతుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి   కరోనా తీవ్రతను  ఎదుర్కోటానికి  అధికారులు ప్రజాప్రతినిధులతో  సమావేశాలు  నిర్వహిస్తున్నారు.


అంతర్ జిల్లాల దొంగ అరెస్టు


 

89 కాసుల బంగారం,240 గ్రాముల వెండి,

 

రెండు మోటారు సైకిళ్ళు స్వాధీనం

 

రావులపాలెం, పెన్ పవర్

 

చెడు వ్యసనాలకు బానిసై ఉభయ గోదావరి జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని రావులపాలెం పోలీసులు అరెస్టు చేశారు.  మంగళవారం రాత్రి రావులపాలెం సి.ఐ వి.కృష్ణ వివరాలు వెల్లడించారు. మల్కిపురం మండలం గుడిమెల్లంక గ్రామానికి చెందిన మామిడిశెట్టి నరేష్ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు వృత్తిగా ఎంచుకుని వరుసగా ఇంటి, మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నాడు. తాళం వేసిన ఇండ్లను ఎంచుకుని రాత్రి సమయంలో తాళాలు పగలుకొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.  గతంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో పలుమార్లు అరెస్ట్ అయినట్లు ఆయన తెలిపారు. ఇతను వద్ద 89 కాసుల బంగారం , 240 గ్రాముల వెండి , రెండు మోటారు సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు రూ  16,31800 రూపాయలు  ఉంటుందని తెలిపారు. దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన రావులపాలెం ఎస్సై పి.బుజ్జి బాబు,ఆత్రేయ పురం ఎస్సై  జి.నరేష్,పి.గన్నవరం ఎస్సై జి. హరీష్ కుమార్ లను సి.ఐ.కృష్ణ అభినందించారు. వారికి  రివార్డులు  ఇవ్వనున్నట్లు అమలాపురం డి ఎస్ పి మషూమ్ భాషా,జిల్లా ఎస్పీ అద్నాన్ నయిమ్ లు తెలిపినట్లు ఆయన తెలిపారు.

ఫొటో గ్రాఫర్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ


 





 

రావులపాలెం, పెన్ పవర్

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో  ప్రభుత్వం ప్రకటించిన  లాక్ డౌన్ పాటిస్తున్న కారణంగా ఉపాధి కోల్పోయిన  ఫోటో గ్రాఫర్లకు సి.ఐ వి.కృషి చేతులు మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. బుధవారం  యూనియన్ కార్యాలయ భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో ది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీటిని  రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల ఫోటోగ్రాఫర్స్ కి అందజేశారు. 25 కె.జీల బియ్యం ,1 కెజీ  పంచదార, కెజి గోధుమ నూక, 1 కెజి ఇడ్లీ రవ్వ, 100 గ్రా. టీ పొడిని అందజేసినట్లు యూనియన్ అధ్యక్షుడు గుబ్బల వెంకటరమణ, కార్యదర్శి మనోజ్ లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పవన్, నల్లమిల్లి రామారెడ్డి, సిరి రాము, మురళీ(ఎర్రబుజ్జి), సతీష్, మానే రాజు, పి.కె  నాగేశ్వరరావు, మాణిక్యం, రాజా, సత్యనారాయణ, ఏడుకొండలు,దొర బాబు, షైనీ రవి, బ్రహ్మం, పవన్ (రాజా), తేజ, అయ్యప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


 

 



 

గోకవరం బీజేపీ నాయకుడి ఆద్వర్యంలో  భోజనం ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం


గోకవరం బీజేపీ నాయకుడి ఆద్వర్యంలో  భోజనం ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం

........ ఐదో రోజుకు చేరింది  ,,, 

గోకవరం పెన్ పవర్

 

గోకవరం మండలం గోకవరం గ్రామంలో , దేవి చౌక్ సెంటర్ దగ్గర అరవ పేటలో, భారతీయ జనతా పార్టీ జడ్పిటిసి అభ్యర్థి, పార్టీ సీనియర్ నాయకులు కరాసు శివప్రసాద్ (అన్నదాత) ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంచిపెట్టారు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ  ఆరోగ్య భారతదేశం గా మార్చాలని ఉద్దేశ్యంతో ప్రజల ఎవరు కరోనా బారిన పడకుండా ఉండాలని లాక్ డౌన్ సిస్టంలో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యాచకులు.నిరుపేదలు. ఆహారం లేకుండా ఇబ్బంది పడకుండా ఉండాలని అన్నదాత భోజనం ప్యాకెట్లు కార్యక్రమం చేపట్టానని తెలిపారు.

జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ . ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టాలని తెలిపారు .ఈ కార్యక్రమానికి యోగ విద్యార్థి ఎర్ర అనిల్ తల్లిదండ్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బిజెపి ముఖ్య నాయకులు పురం శెట్టి సత్య రమేష్ మరియు పి. యుగంధర్.

 ఆటో యూనియన్ నాయకులు షేక్ బాబ్జి మరియు అనుచరులు. మాగాపు రవణమ్మ, ఎస్ కె సత్తార్, ఎస్కే మస్తాన్ , కంది కట్ల బుల్లెమ్మ, మాగాపు మంగ, ఎండి ముంతాజ్, సర్వ శెట్టి సీత, షేక్ నన్నేసా, ఎస్కే రజాక్ పాల్గొన్నారు

ప్రజా శ్రేయస్సు కోరి 10 రోజులకు సరిపడా కూరగాయలు వితరణ


 


ప్రజా శ్రేయస్సు కోరి 10 రోజులకు సరిపడా కూరగాయల్ని వితరణ చేసిన మాజి సర్పంచ్ గొర్ల కనకారావు

 

           పరవాడ పెన్ పవర్

పరవాడ:మండలం లోని గొర్లివాని పాలెం గ్రామంలో తెలుగు దేశం నాయకుడు మాజీ సర్పంచ్ గొర్ల కనకారావు గ్రామం లో కల మొత్తం 750 కుటుంబాలకు సుమారు 10 రోజులకు సరిపోయే కూరగాయాల్ని ఒకొక్క రకానికి కేజీ చొప్పున 8 రకాల కూరగాయల్ని,అరడజను కోడి గుడ్లను వితరణ చేశారు.గ్రామ ప్రజలకు కష్టం వస్తే ఆకష్టం తనకష్టం గా ఫీలయ్యే నాయకుల్లో కనకారావు ఒకరు.ఈ సందర్భంగా కనకారావు గ్రామo లో ఇంటింటికి తిరుగుతూ కరోనా వైరస్ వల్ల కలిగిన నష్టాలు వివరిస్తూ ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19) సోకడం వలన అనేకమంది వ్యాధి గ్రస్థులు అవడమే కాకుండా కొన్ని వేలమంది మృత్యువాత పడ్డారు అని  .షాక్షాత్తు కొన్ని దేశాల ప్రధానులు,ప్రెసిడెంట్లు ఈ వైరస్ నుంచి ప్రజలను కాపాడటంలో తాము ఏమి చేయలేక పోతున్నాము అని ఇంక భగవంతుడే దిక్కు అని చేతులు ఎత్తి ప్రాధిస్తున్నారు అని అన్నారు.కరోనా వైరస్ వల్ల వచ్చే వ్యాధి ని తగ్గించే ముందుకోసం అన్ని దేశాలు మేధో మధనం చేస్తున్న తరుణంలో మనదేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ ఒక్కటే మార్గం అని దేశ ప్రజలను అభ్యర్ధించి నెల రోజులపాటు క్వారన్టైన్(స్వీయ నిర్బంధం)విందిచి ప్రజలకు నిత్యావసర సరుకుల కు వెసులుబాటు కలిగించారు అన్నారు.ఆ వేసులుబాటును కొందరు ప్రజలు,ఆకతాయి యువకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అని కనకారావు ఆవేదన వ్యక్తం చేశారు.గత పదిహేను రోజులుగా ప్రజలు వ్యవహరిస్తున్న తీరు వల్ల వైరస్ చాలా స్పీడ్ గా వ్యాప్తి చెందుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఇప్పుడు ఈ పది,పదిహేను రోజులు వైరస్ వ్యాప్తి నివారించడానికి ఎంతో కీలకo అయినoదున ప్రజలు కూరగాయల కోసం బయటికి రాకుండా ఉండటానికి 2 లక్ష రూ పైన తన వ్యక్తిగత ధనాన్ని కర్చుచేసి ప్రతి కుటుంబానికి కూరగాయలు అందించారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలిసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.ప్రస్తుతం విశాఖపట్నం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఎటువంటి పరిస్థితులలోను ఎవ్వరూ కూడా తమ గృహల్లోంచి బయటికి రావద్దు అని అభ్యర్ధించారు.ఎవరు అయినా నిర్లక్ష్యంగా వయహరించి బయటతిరిగి  నట్లు అయితే ఎవరివల్ల అయినా కానీ బయట వస్తువు ముట్టుకోవడం వలన కానీ మీకు వైరస్ సోకి నట్లు అయితే ఆ వైరస్ ని మీరు మీ కుటుంభం లోని సబ్యులకే కాకుండా గ్రామంలో ని వారికి కూడా వైరస్ వ్యాప్తి చెoదటానికి దోహద పడినవారు అవుతారు అని హెచ్చరించారు.దయచేసి ఎవరు కూడా ఈ పదిహేను రోజులు బయటికి రాకండి అని ప్రార్ధించారు.ఇదే కాకుండా అవసరాన్ని బట్టి ఇంకొక సారి ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించే అవకాశం ఉంది అని కనకారావు మీడియా మిత్రులకు సూచన ప్రాయంగా తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గొర్ల శ్రీనివాసరావు,స్థానిక వువకులు పాల్గొన్నారు.   

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...