Followers

తాగునీటి చెరువును 15 లక్షలతో అబివృద్ది చేసిన మంత్రి చెరుకువాడ


ఆచంట లో తాగునీటి చెరువును 15 లక్షలతో అబివృద్ది చేసిన మంత్రి చెరుకువాడ. శ్రీరంగనాథ రాజు





 

 


ఆచంట, పెన్ పవర్ 


 

 

ఆచంట మండలం ఆచంట వేమవరం లో సుమారు రూ 15 లక్షల రూపాయలతో అబివృద్ది చేసిన తాగునీటి చెరువు మరియు  మంచి నీటి సరఫరా ను గురువారం  రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ .శ్రీరంగనాధరాజు ప్రారంభించారు.ఆచంట వేమవరం గ్రామంలో చాలాకాలంగా  ప్రధాన తాగునీటి చెరువు అబివృద్ధికి నోచు కోకుండా గత ప్రభుత్వం లో నిర్లక్షానికి గురైoది. గ్రామస్తుల కోరికపై మంత్రి తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చెరువు అబివృద్ధికి అధికారులను ఆదేశించడం, పనులు పూర్తికావటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా మంత్రి వర్యులు  మాట్లాడుతూ తాగునీటి కి ఇబ్బంది లేకుండా అన్ని తాగునీటి చెరువులను నీటితో నింపామని అన్నారు. అధికారులతో సమీక్షించి ముందస్తు చర్యలు తీసుకోవటం తో పాటు శివారు గ్రామాలకు అవసరం అయితే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. అనంతరం మంత్రి గ్రామంలో జరుగుతున్న శానిటేషన్, పారిశుధ్యపనులను, వైద్య ఆరోగ్య సర్వేను  పరిశీలించారు. లాక్ డౌన్ అమలు జరుగుతున్న దృష్ట్యా ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం, స్వీయనియంత్రణ పాటించాలన్నారు. కారోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకై అధికారుల ఆదేశాలను పాటించాలన్నారు.

అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దన్నారు.అనంతరం  చౌకదర దుకాణాల వద్ద దూరం పాటించండి... మూడవ విడత ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ జరుగుతున్నందున ప్రతీ ఒక్కరూ వారికి కేటాయించిన టైం స్లాట్ ఆధారంగా సరుకులు తీసుసు కోవాలన్నారు. బయోమెట్రిక్ తప్పనిసరి అయినందున శానిటైజర్ లు అందుబాటులో ఉంచామన్నారు. రేషన్ సరుకులను మే 10వతేదీ వరకు పంపిణీ చేస్తునందున ఎటువంటి ఆందోళనకు గురికావదన్నారు. రేషన్ షాపుల వద్ద తాగునీరు, షామియానా వంటి ఏర్పాట్లు చేశామని మంత్రి రంగనాథ రాజు వివరించారు. కార్యక్రమంలో పోలిశెట్టి లీలా సుబ్బారావు , గ్రామ ప్రెసిడెంట్,బండారు నాగేశ్వరావు,గ్రామ సెక్రటరీ,వేగుళ్ల బులిసత్తియ్య సొసైటీ ప్రెసిడెంట్ ,పుచ్చకాయల సూరిబాబు, గెద్దాడ మంగారావు ,కొడమంచిలి రాజు,స్థానిక నాయకులు పాల్గొన్నారు.


 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...