విశాఖపట్నం, పెన్ పవర్
జిల్లా అధికార యంత్రాంగానికి పేక్ ఈ మెయిల్ తలనొప్పిగా మారింది. జిల్లా కలెక్టర్ అంటూ vadarevuchand@gmail.com పేరుతో కొందరు ఆగంతకులు ఫేక్ మెయిల్ క్రియేట్ చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోన్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి రాగా స్పందించిన ఆయన vadarevuchand@gmail.com పేరుతో వచ్చే మెయిల్స్‌ని నమ్మవద్దని, అది ఫేక్ మెయిల్ అని ప్రకటించారు. ఈ ఫేక్ ఈ మెయిల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
No comments:
Post a Comment