కరోనా వైరస్ నిర్మూలనకు అందరూ సహకరించాలి
విఎం ఆర్ డి చైర్మన్ ద్రోణంరాజు శ్రీ నివాస్
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
కరోనా వైరస్ నిర్మూలనకు అందరూ సహకరించాలని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీ నివాస్ అన్నారు.
గురువారం దక్షిణ నియోజకవర్గం( 31 వార్డు) పాత జైల్ రోడ్డు మార్గం విశాఖ మహిళా డిగ్రీ కాలేజ్ లోని రైతు బజార్ కాయగూరలు మార్కెట్‌లో హ్యండ్ వాస్ యంత్రం ఏర్పాటు చేశారు. మార్కెట్ కి వచ్చే వారు కరోనా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు "ప్రగతి భారత్ ఫౌండేషన్" (విశాఖపట్నం) వారి ఆర్థిక సహాయం తో ఏర్పాటుచేసిన "డి ఏ ఎస్ ఇన్ఫెక్షన్ టూనెల్ స్ప్రే హ్యాండ్ వాష్ మిషన్"....పరికరాన్నివి ఎం అర్ డి ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ సీఎంఆర్ వాణిజ్య సంస్థల అధినేత మావూరి వెంకటరమణ ప్రారంభించారు, ఈ సందర్భంగా శ్రీనివాస్ మార్కెట్ లో వ్యాపారస్తుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా మార్కెట్ కు వస్తున్న ప్రజలను వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ ఈరోజు ఏర్పాటు చేసిన హ్యాండ్ వాష్ మార్గము ద్వారా చేతులు శుభ్రపరుచుకుని లోపలికి వెళ్లి వచ్చేటప్పుడు కూడా శుభ్ర పరచుకోవాలి అని వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం పాటించాలని సూచనలు ఇచ్చారు జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది వారికి పోలీసు శాఖ వారికి సహకరించాలని మరియు కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వం, విధించిన ఆంక్షలను తప్పకుండా పాటించాలని కరోనా వ్యాధి నిర్మూలన మన చేతుల్లోనే ఉందని అన్నారు, ఈ యొక్కకార్యక్రమంలో జీవీఎంసీ జోన్ -3.జెడ్ సి కటేశ్వరరావు ,శానిటేషన్ అధికారి డేవిడ్ రాజు, వార్డు వై ఎస్ ఆర్ సి పి కార్పొరేటర్ అభ్యర్థి బత్తిన నాగరాజు, రామూ మాస్టర్, వడ్ల రామారావు, పల్లా శ్రీనివాస్, పెంటకోట నాగరాజు, మకర గోపి, గంట్ల శ్రీను,తదితరులు పాల్గొన్నారు,
No comments:
Post a Comment