Followers

క్వారంటైన్ లో ఉన్న వారితో స్నేహపూర్వకంగా ఉండాలి


క్వారంటైన్ లో ఉన్న వారితో స్నేహపూర్వకంగా ఉండాలి


ఆరోగ్యసేతు యాప్ ప్రతి ఒక్కరితో డౌన్లోడ్ చేయించాలి   


జిల్లా రెవెన్యూ  అధికారి  జె. వెంకటరావు


        విజయనగరం, 


 


క్వారంటైన్ లో వున్నవారితో స్నేహపూర్వకంగా వుండాలని, స్వంత బంధువుల్లా భావించి వారితో మాట్లాడుతూ వుండాలని జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు క్వారంటైన్ కేంద్రాల నిర్వహణపై  క్వారంటైన్ ప్రత్యేకాధికారులకు ఆదేశించారు.   గురువారం కలక్టరేట్ ఆడిటోరియం లో ప్రత్యేకాదికారులతో సమావేశం నిర్వహించారు.  క్వారంటైన్ లో ఉంటున్న వారికి మెనూ ప్రకారం మంచి ఆహారాన్ని అందించాలని, సౌకర్యవంతమైన  వసతులను కల్పించాలని, స్వంత ఇంటిని మరిపించేలా ఉండాలని అన్నారు.   అక్కడి  గదులు, పరిసరాలు, టాయలెట్లు పరిశుభ్రంగా వుండేలా చూడాలని అన్నారు.  క్వారంటైన్ లో వుంటున్న వారికి ప్రతిరోజు పౌష్టికాహారాన్ని అందివ్వడంతో పాటు వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలన్నారు.  మానసిక సమస్యలు వుండే వారికి మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ చేయించాలన్నారు.  ఆరోగ్య సమస్యలతో మందులు వాడుతున్న వారికి మందులను కూడా తెప్పించి ఇవ్వాలన్నారు.  ప్రతి ఒక్కరికీ ట్రానాట్ పరీక్షలు నిర్వహించాలని, 14 రోజుల నిర్భందం తప్పనిసరి అని అన్నారు.  12వ రోజున అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి 13వ రోజున వైద్యుని సలహాలు తీసుకొని, కరోనా నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే డిస్ చార్ట్ చేయాలని సూచించారు.  డిస్ చార్ట్ చేసేటప్పుడు క్వారంటైన్ నిబంధనలు పాటించేలా వారి వద్ద నుండి పూచీకత్తులు తీసుకోవాలన్నారు.  వారిని ఇళ్లకు పంపేటప్పుడు సమస్య తలెత్తకుండా ముందుగానే స్ధానిక పోలీసు అధికారికి సమాచారం ఇవ్వాలన్నారు.  క్వారంటైన్ లో రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు.  క్వారంటైన్ లో కూడా సామాజిక దూరం పాటించాలన్నారు.  క్వారంటైన్ లో ఉన్న ప్రతి ఒక్కరితో ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేయించాలని,  క్వారంటైన్ నుండి బయటకు వెళ్లిన తర్వాత కూడా దానివలస ప్రయోజనాలున్నాయని తెలిపారు.  ఈ యాప్ ద్వారా పాజిటివ్ కేసుల వివరాలు కూడా తెలుసుకోవచ్చన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...