కరోనా విధుల్ని నిర్వహిస్తున్న జివిఎంసి సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ రసాయనాన్ని వితరణ చేసిన పిఆర్‌టియు (అర్బన్), విశాఖపట్నం
విశాఖపట్నం,
జివిఎంసి పరిధిలో కరోనా నివారణ గూర్చి కేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులకు వైరస్ నుంచి రక్షించుకొనే నిమిత్తం వినియోగించుకోవడానికి 100 బాటిళ్ళ శానిటైజర్ రసాయనాన్ని 100 మాస్కులను పిఆర్‌టియు అర్బన్, విశాఖపట్నం యాజమాన్యం వారు జివిఎంసి అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావుకు ఆయన ఛాంబర్‌లో జివిఎంసి డిప్యూటీ ఎడ్యూకేషనల్ ఆఫీసర్ శ్రీనివాసరావు సమక్షంలో సంఘ ప్రెసిడెంట్ పి.హరిక్రిష్ణ, సెక్రటరీ కె.నాగేశ్వరరావు, స్టేట్ కౌన్సిలర్ ఎల్.క్రిష్ణారావు చేతులు మీదుగా ఉచితంగా అందించారు. పిఆర్‌టియు (అర్బన్), విశాఖపట్నం సంఘ సభ్యులు చేసిన వితరణకు జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
No comments:
Post a Comment