పరవాడ వైసిపి కార్యాలయంలో ఎంపీ సత్యవతి పుట్టినరోజు వేడుకలు
పరవాడ పెన్ పవర్
పరవాడ మండలం:అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్.బిసెట్టి.వెంకట సత్యవతి పుట్టినరోజు వేడుకలును పరవాడ వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరోనా లాక్ డవున్ కారణంగా స్థానిక వైసిపి నాయకులు ఎంపీ సత్యవతి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియ చేయలేని పరిస్థితుల్లో స్థానిక పార్టీ కార్యాలయం లోనే పుట్టినరోజు వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల వైసిపి పార్టీ అధ్యక్షుడు సిరిపురపు అప్పలనాయుడు,రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ,బండారు రామారావు,దళాయి నదియా,పయిల జూనియర్ అప్పలనాయుడు,పయిల నరేష్,వెంకట లక్ష్మి,ఇల్లపు ప్రవీణ్,పయిల పైడంనాయుడు,సిహెచ్.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment