కూరగాయల మద్దతు ధరకై దేవరాపల్లిలో రైతుల నిరసన.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్).
కూరగాయలకు మద్దతు ధర కల్పించాలని దేవరాపల్లి లో రైతులు నిరసన చేపట్టారు. రోజు వారి హోల్ సేల్ కూరగాయల మార్కెట్ కు రెండు రోజులుగా కూరలు తేకుంటా వ్యాపారులపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా రైతులు సమాలొచనతో కాయగూరలు మార్కెట్ కు తీసుకు రాకూడదని నిర్ణయం చేసుకు న్నారు.గు రువారం మార్కెట్ కు ఎవరు కూరగాయలు తీసుకు రాకపోవడంతో మార్కెట్ వెల వెల బోయింది. మార్కెట్ కి పాడేరు హుకంపేట విశాఖపట్నం నుండి వచ్చిన కోంతమంది వ్యపారులు విస్తుపోయారు. తిరిగి పోలేక రైతులుకు పోన్లు చేసి కాయగూరలు తెప్పించు కోనే ప్రయత్నం చేశారు.రైతులు స్పందించక పోవడంతో ,వ్యాపారులు తిరిగి వెళ్ళిపోయారు , రైతులు కోసం ,అధికారులు పంపిన రెండు బస్సులు ఖాళీగా పోయాయి.ఆరుగాలాలు కష్టించి పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు.బజారు కి తెచ్చిన కూరగాయల కి కనీసం కూలి డబ్బులు అయిన రావడం లేదు. మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. విశాఖ రైతు బజారులో రైతులు నేరుగా అమ్ము కోనే విధంగా కార్డులు ఇవ్వాలని ,కోల్డ్ స్టోరేజ్ నీర్మీంచాలని సిపి ఎం నాయకుడు వెంకన్న డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment