గిరి పల్లెల్లో మ్రోగుతున్న మరణ మృదంగం.
రహదారులకు నోచుకోని గిరి పల్లెలు.
గిరిపుత్రుల దరిచేరని ఉచిత వైద్యం.
అత్యవసర పరిస్థితుల్లో డోలీయే శరణ్యం.
గిరిజనాభివృద్ధికి పెద్ద పేట పాలకుల ఊతపదం.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం ( పెన్ పవర్)
ప్రకృతి అందాలకు నిలయమైన విశాఖ మన్యంలో గిరి పల్లెలు సమస్యల సుడిలో నలిగిపోతున్నాయి. కానీ స అవసరాలకు నోచుకోని ఈ పల్లెల్లో గిరిపుత్రులు దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారు. రహదారులులేక అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం పల్లెల్లో ఎక్కడో ఒకచోట మరణ మృదంగం మోగుతూనే ఉంది. గిరిజన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందన డానికి అక్కడ పరిస్థితులే నిదర్శనం. పాడేరు మండలం మినుములూరు పంచాయితీ గాలి పాడు గ్రామానికి చెందిన చిట్టమ్మ నిండు గర్భిణీ ప్రసవ వేదనతో అవస్థలు పడుతూ ఉండగా అంబులెన్స్ వచ్చే గత్యంతరం లేక మైళ్ల దూరం డోలీపై మినుములూరు పీహెచ్సీకి తరలించారు. వైద్యులు డెలివరీ చేసినప్పటికీ పరిస్థితి విషమించి బిడ్డ చనిపోయింది. నెలలు నిండక డోలీలొ తీసుకు రావడం వల్ల ఆలస్యమై బిడ్డ మృత్యువాత పడింది. హుకుంపేట మండలం గతుంగ్ పంచాయితీ కరకవలస గ్రామంలో గెమ్మేలి కళ ఇంట్లో పాము కాటుకు గురైంది. గ్రామానికి రహదారి సౌకర్యం లేక 5 కిలోమీటర్లు డోలీపై మోసుకొని అడ్డదారిలో వచ్చి అక్కడ నుండి మరో పది కిలోమీటర్లు ఆటోలో పాడేరు ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. సకాలంలో వైద్య సేవలు అందక మహిళ మృతి చెందింది. ఇలా రోజు ఎవరో ఒకరు ప్రమాదవశాత్తు చనిపోతూనే ఉన్నారు. ఈ మరణ మృదంగం గానికి ప్రధాన కారణం రహదారి సౌకర్యం.. విశాఖ ఏజెన్సీలో 11మండలాల పరిధిలో వేల సంఖ్యలో శివారు గ్రామాలు ఇదే దుస్థితి లో ఉన్నాయి. గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎన్నికల ముందు పాలకుల పాట ఊతపధంలా మారిపోయింది. పూర్వం రహదారులు లేక డోలీలపై ప్రయాణాలు చేసేవారిని పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ 2020 నాటికి డోలీలు ఉపయోగిస్తున్నారు అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఉన్న ఊరు కన్న తల్లి అని గిరిపుత్రులు పల్లెలను విడవడం లేదు. ప్రభుత్వాలు ఆ వైపు కన్నెతైన చూడటం లేదు.
No comments:
Post a Comment