ముఖ్య ప్రణాళికాధికారిగా శ్రీనివాసరావు
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి గా వి.శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. బుధవారం ఆయన విధులలో చేరి బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రెవెన్యూ విపత్తు నివారణ కార్యాలయం, విజయవాడలో ఉప సంచాలకులుగా పనిచేస్తూ పదోన్నతి పొంది సంయుక్త సంచాలకులుగా ముఖ్య ప్రణాళి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
No comments:
Post a Comment