నాటు సారా బట్టీలు పై దాడులు అధికంగా బెల్లపు ఊట ద్వంసం
పోలవరం: పెన్ పవర్
పోలవరం మండలం ఎల్ ఎన్ డి పేట గ్రామంలో బుధవారం దాడులు నిర్వహించి నాటు సారా తయారీ కి సిద్ధంగా ఉన్న పులిసిన బెల్లపు ఉటను ధ్వంసం చేసినట్లు పోలవరం ఎక్సైజ్ సిఐ జి సత్యనారాయణ తెలిపారు. అనంతరం బుచ్చయ్య పాలెం, కరక పాడు గ్రామాలలో దాడులు నిర్వహించి మొత్తం నాలుగు వేల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు. నాటు సారా తయారీ కేంద్రాలపై విస్తృత దాడులు జరిపి భారీగా బెల్లపు ఉటలను ధ్వంసం చేయడం ద్వారా నాటు సారా తయారీ, అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని ఎక్స్చేజ్ సి ఐ అన్నారు. నాటు సారా తయారీ , అక్రమ రవాణా , అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు..